(అమరుడు కామ్రేడ్ గాజర్ల రవి @ గణేష్, @ఉదయ్ మీద మిత్ర రాసిన పాట)
పల్లవి:
త్యాగాల నెత్తుటి ముద్దయి
తరలీ వస్తుండో గణేష్-తరలీ వస్తుండో
బానిసత్వమును తరిమే పోరును
తోడుగా తెస్తుండో గణేష్-తోడుగా తెస్తుండో
తిరుగుబాటునే తెస్తుండో
వెలిశాలకే వస్తుండో
                     ||త్యాగాల||1)
దిద్దాలమ్మ ఇంటికొక్కరు
వీర తిలకమే దిద్దాలో – ||వీ||
ఇయ్యాలమ్మ ఎన్నెల కాంతులు
హారతిగానే ఇయ్యాలో – ||హ||
ఊరంతా తల్లిదండ్రులై
సల్లని దీవెనలియ్యాలో- ||స||
యువతీ యువకులు పిడికిల్లెత్తి
వీరంగమే ఆడాలో – ||వీ||
కగార్ దాడులు ఆపేదాకా
కలిసి పోరు జెయ్యాలో
                        ||త్యాగాల||2)
ఉదయించేది రవికిరణమే
విప్లవ స్వాగతమివ్వాలో ||వి||
ప్రజల కొరకే ప్రాణమిస్తామని
ఊరుకొక్కరు పుట్టాలో
సావులేని నీ ఆశయాలకు
నిత్య యవ్వనం ఉండాలో
మీ ఇంట్లో ఇద్దరూ లోకాన ఎందరు అమరులయ్యిరని చాటాలో
ఆ కాకమ్మ నీకెదురుగ వచ్చీ
కావు కావుమని పిలవాలో
                 ||త్యాగాల||3)
నిను సాదిన దండాకారణ్యం
గండాలెదురుకుంటుందో
నువు దాటిన నదులు సుడులై తిరిగి
నెత్తురు టేరులు పారాయో
మిము దల్సుకోని పక్షులన్నీ
వెక్కివెక్కి ఏడ్సినాయో
ఆ గోతికాడి గుంటనక్కలు
ఉల వెడుతూ వస్తుంటే
ఆ రేలా పూలు రాలిపడుతూ
మెడలో దండాలైనాయో
ఎర్ర పూల దండాలైనాయో
గోగుపుల దండాలైనాయో
(మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, 2004 శాంతి చర్చల ప్రతినిధి కామ్రేడ్ గణేష్ స్మృతిలో.. ఆయన పార్థివ దేహం వెలిశాలకు వస్తున్న సందర్భంగా..) 18-06-2025

 నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్						             అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ						             విప్లవ ద్రోహులు,పార్టీ విచ్చిన్నకులు, విప్లవ ప్రతిఘాతకులు -సోను, సతీష్ ముఠాపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
విప్లవ ద్రోహులు,పార్టీ విచ్చిన్నకులు, విప్లవ ప్రతిఘాతకులు -సోను, సతీష్ ముఠాపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన						             Jammu Kashmir National Students Federation statement in support of Maoist party
Jammu Kashmir National Students Federation statement in support of Maoist party						             బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న జరగబోవు బంద్ కు మావోయిస్టు పార్టీ మద్దతు
బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న జరగబోవు బంద్ కు మావోయిస్టు పార్టీ మద్దతు						             కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్						            