భారతదేశంలో శ్రామిక వర్గాన్ని, ప్రకృతి వనరులను కొద్దిమంది పరాన్నభుక్కులు దోచుకొంటూ ఉన్నంత కాలం యుద్ధ స్థితి ఉనికిలో ఉందని, ఉంటుందని ప్రకటిద్దాం.
- షహీద్ భగత్ సింగ్
2024 జనవరిలో ప్రారంభించిన ఆపరేషన్ కాగర్ అనేది మధ్య భారతదేశంలోని ఆదివాసీలు, ఖనిజ వనరులపై జరుగుతున్న యుద్ధం.150-200 మందికి పైగా మావోయిస్టులు, 100-150 మంది అమాయక ఆదివాసీలు మరణించినప్పటికీ, ప్రధాన స్రవంతి మీడియా మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మావోయిస్టు నాయకుల హత్యలు రిపోర్టు అవుతున్నాయి కానీ, అమాయక ఆదివాసీల హత్యలను లెక్కచేయడం లేదు.
2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలన్న అమిత్ షా పిలుపులో వెనుక ఉన్న విస్తృతమైన ఆర్థిక అంశం ఎప్పుడూ రిపోర్టు కాలేదు. మధ్య భారతదేశంలో సమృద్ధిగా ఉన్న ఖనిజాల నిల్వల కోసం అదానీ, వేదాంత, టాటా మొదలైనవారు ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి రాజ్య బలగాలను ఉపయోగిస్తారు. మహారాష్ట్రలోని గడ్‌చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లలో ఇప్పటికే గనుల తవ్వకాలు, అటవీ నిర్మూలన జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. వనరుల దోపిడీని సులభతరం చేయడానికి బస్తర్ ఇప్పుడు భారీ సైనిక జోన్‌గా తయారైంది.
వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నామని ప్రధాని మోదీ చెప్పుకొంటున్నప్పటికీ, గనుల తవ్వకం, అటవీ నిర్మూలన వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అడ్డూ అదుపూ లేని అభివృద్ధి కార్యకలాపాలతో, ప్రభుత్వం అడవుల అసలైన సంరక్షకులను నిర్వాసితులను చేస్తోంది.
ఆపరేషన్ కగార్ భారత రాజ్యాంగం (ఆర్టికల్ 21), అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం (ఆర్టికల్ 3, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్; ఆర్టికల్ 6, ఐసిసిపిఆర్), స్టానిక ప్రజల ప్రజల హక్కులపైన యుఎన్ డిక్లరేషన్ ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది. ఇవి ఆదివాసీలపైన జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామిక వ్యతిరేక దాడులు. ఇవి కార్పొరేట్ యజమానులకు అధికారం ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
మావోయిస్టులను ఎప్పుడూ గాయపరచడం లేదా పట్టుకోవడం జరగదు; రివార్డుల కోసం వారిని చట్టాతీత హత్యలు చేస్తారు.
కాల్పుల విరమణ ప్రకటించాలని, శాంతి చర్చలు ప్రారంభించాలని భారత ప్రభుత్వానికి ఇటీవల పౌర సమాజ సంస్థలు, మావోయిస్టులు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వాటిని పదేపదే తిరస్కరించింది.
మావోయిస్టులతో చర్చలు జరపడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత చూపడం గమనార్హం.
ఆపరేషన్ కగార్ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఫాసిస్ట్ యుద్ధంలో ఒక భాగం. తక్షణ లక్ష్యం మావోయిస్టులను నిర్మూలించడమే కానీ, విస్తృత లక్ష్యం ఈ సామాజిక వ్యవస్థకు ఎదురవుతున్న ప్రతిఘటనను నిర్మూలించడమే.
తప్పుడు కేసుల ద్వారా ప్రజాస్వామిక కార్యకర్తలపైన ఇటీవల జరిగిన దాడులు, మూల్‌వాసీ బచావో మంచ్ నిషేధించడం ఈ యుద్ధం కేవలం సాయుధ మావోయిస్టులను అరికట్టడం కోసం మాత్రమే కాదని చూపిస్తున్నాయి.
ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ప్రతిఘటనను నిర్మించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనకు గల బాధ్యతలో భాగం.
ఈ పరిస్థితిలో మేము భారత ప్రభుత్వాన్ని ఈ క్రింది డిమాండ్‌లు చేస్తున్నాం:
- తక్షణమే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
- తక్షణమే కాల్పుల విరమణ జరపాలి; సిపిఐ (మావోయిస్టు)తో శాంతి చర్చలు జరపాలి
- చట్టాతీత హత్యలన్నింటి పైనా స్వతంత్ర విచారణ జరపాలి
మన దేశ ప్రజలపై జరుగుతున్న ఈ యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాన్నెత్తాలని అందరినీ కోరుతున్నాం.
సంతకాలు పెట్టినవారు:
- ఆదివాసీ సంఘర్ష్ మోర్చా
- ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్
- ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్
- అంబేద్కర్ రీడింగ్ సర్కిల్
- భీమా సంఘటనెగళ మహా ఒక్కూట
- భుస్వాధీన విరోధి హోరాట సమితి (దేవనహళ్ళి)
- కలెక్టివ్
- డిఎస్ఎస్
- డిఎస్‌ఎస్ (అంబేద్కర్ వాద) 10. దళిత్ టైగర్స్
- డొమెస్టిక్ వర్కర్స్ రైట్స్ యూనియన్
- ఎద్దేళు కర్ణాటక
- డా. అంబేద్కర్ దళిత సేనె సమితి 14. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్- కర్ణాటక
- గ్రోత్ వాచ్
- ఇండియన్ సోషల్ యాక్షన్ ఫోరమ్(ఐఎన్‌ఎస్‌ఎఎఫ్)
అహాలీ - కర్ణాటక జన జాగృతి వేదికె
- కర్ణాటక జనశక్తి
- కన్నడ ప్లానెట్
- కర్ణాటక వాయిస్ ఆఫ్ పబ్లిక్
- కరావళి కర్ణాటక జనాభివృద్ధి వేదికె
- కర్నాటక రైతా సంఘ (ఎఐయుకెఎస్) 23. మూల్నివాసిగళ డా. అంబేద్కర్ సేనె
- నేషనల్ ఎలియన్స్ ఫర్ జస్టిస్,అకౌంటబిలిటీ అండ్ రైట్స్
- నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్ – కర్ణాటక
- ప్రగతిపరా కర్ణాటక కట్టడ కర్మిక మత్తు ఈథర నిర్మాణ యూనియన్
- పీపుల్స్ డెమోక్రాటిక్ ఫోరమ్
- పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్
- స్పార్క్ రీడింగ్ సర్కిల్
- స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్
- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) లిబరేషన్
వ్యక్తులు: - డా. జి. రామకృష్ణ (రచయిత) 2. శివసుందర్ (కార్యకర్త, కాలమిస్ట్)
- డా. వి. పి. నిరంజనారాధ్య (విద్యావేత్త)
- శ్రీపాద్ భట్ (విద్యావేత్త) 5. డాక్టర్ ప్రజ్వల్ శాస్త్రీ (వైద్యుడు) 6. మధు భూషణ్ (కార్యకర్త)
- డా. డు సారాస్వతి (థియేటర్ కళాకారుడు) 8. డా. సాబీహా భూమిగౌడ (విద్యావేత్త)
- విద్యా దినకర్ (కార్యకర్త) 10. డా. సువ్రత్ రాజు (ఫిజిసిస్ట్) 11. రామ్నీక్ సింగ్ (నాటక రచయిత)
కర్ణాటక పీపుల్స్ ఫోరం అగైన్స్ట్ వార్ ఆన్ ఆదివాసీస్
contact: 9448485824, 8584056936, 9900047744, 8884115925, 9886428481
(ఇంగ్లీషు ప్రకటనకు తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)