(సీనియర్ జర్నలిస్టు నాగారెడ్డి సుబ్బారెడ్డి రాసిన వ్యాసం)
ఆయనో సిద్దార్థుడు. సత్యాన్వేషణ కోసం అర్ధరాత్రి నిద్రలో ఉన్న కుమారుడు రాహులుడిని, భార్య యశోదర ను వదలి వెళ్లిన గౌతమబుద్ధుడికి ఈయనకు పెద్ద తేడా ఏమి లేదు. ఈయన మూడేళ్ళ లోపు బిడ్డలు క్రాంతి నీ, రామకృష్ణను, భార్య సరోజను వదలి అసమ సమాజపు అంతు చూసి చదును చేసేందుకు వెళ్ళాడు. సమసమాజం అవసరం గురించి ఆయనకు లోతుగా అధ్యయనం చేసేంత చదువులేని వాడు, చర్చలతో జ్ఞానం ఆర్జించేంత మేధస్సు పదును లేని వాడు.. కానీ తన చుట్టూ ఉన్న పర్యావరణమే ఆయనకు గురువైంది. ఏందిది అని తనకు తాను వేసుకున్న ప్రశ్న తనకు సహాధ్యాయి అయి దారి చూపింది. తనకోసం, తన కుటుంబం కోసం అన్నది వదలి సమాజ మార్పు లోనే తన కుటుంబ స్థితి మార్పు ఉంటదని అర్థం చేసుకున్నాడు. తన ఊరికి మూడు కిలోమీటర్లు కూడా లేని నల్లమలలో రెగిన అలజడి తనలోనువు అలజడి రేపింది. అడవి వైపు తన నడకను సాగేలా చేసింది. ఆయనే సుగులూరి చిన్నన్న.నల్లమలలో నీ రోళ్ల పెంట కొండల్లో పుట్టిన రెండు కొండ వాగులు సిద్దాపురం చెరువు లో కలుసుకుని భవనాసి గా ఆత్మకూరు, పాముల పాడు కొత్త పల్లె మండలాలను చుట్టి కృష్ణమ్మ లో కలిసే నది కానీ నది అయిన ఈ వాగు పేరుతో ఏర్పడిన పీపుల్స్ వార్ దళం చిన్నన్న కు సాయుధ పాఠాలు నేర్పింది.తన తొలి మార్గ దర్శి లింగ మూర్తి @ కృష్ణన్న సాన పెట్టిన వజ్రం చిన్నన్న. నల్లమల ఉద్యమానికి అందించిన ఎందరో మడమ తిప్పినా మొక్కవోనీ ఉద్యమ దీక్షతో చిన్నన్న ప్రపంచ విప్లవానికి వేగుచుక్కలా కనిపిస్తున్న దండకారణ్యం చేరుకున్నాడు. అక్కడ విజయ్ గా తన ప్రస్థానం సాగించాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటి సభ్యుడయ్యాడు. రహస్య ఉద్యమానికి సాంకేతిక జాగ్రత్తలే ఊపిరి. ఏమాత్రం టెక్నీకల్ పొరపాట్లు చేస్తే ఈ అసిధారా వ్రతం లో పీక తెగడం ఖాయం. కానీ చిన్నన్న ఎపుడు ఆ లైన్ ను ఏమారే వాడు కాదు. కానీ ఆయన మరణం వెనుక రహస్యం పార్టి నే బయట పెట్టాల్సి ఉంది. ఎవరినో కలవడానికి వెళ్లి శత్రువుకు చిక్కాడా లేక నిజంగానే ఎదురు కాసల్పులు జరిగాయా తెలియాలి. 30 ఎళ్ల ఉద్యమ జీవితంలో ఏనాడు తాను శత్రువు చేతికి చిక్కలేదు. చిక్కిన ఒకే సారి మరణం ఆయన్ని కౌగిలించుకుంది.
Ps: ఆయన భవనాసి దళం లో ఉన్న సమయంలో ఆ దళం ఏరియా లోనే ఉండే స్వంత ఉరు వడ్ల రామాపు రానికి వఛ్చిన సందర్బంలో జరిగిన విషయం ఇది. ఆయన తండ్రి దానమయ్య కొడుకును చూడ్డానికి దళం వద్దకు వచ్చాడు. మాటల సమాధార్భంలో తనకు కళ్ళు కనపడడం లేదని ఆపరేషన్ చేయించమని అడిగాడు. ఎందుకు చిన్నన్న చాలా సౌమ్యంగా తాను ఉద్యమానికి వెళ్లాను కానీ ఉద్యోగానికి కాదని చెబుతూ ఇంకా తనకు మరో ముగ్గురు కొడుకులున్నారు కాబట్టి వారితో చెప్పి చేయించుకో మన్నాడు. తాను తన ఒక కుటుంబం అను భవించే కష్టాలు తీరడానికి ఉద్యమంలోకి వెళ్ళ లేదని. మొత్తం సమాజపు రుగ్మతను తొలగించే మార్గం వెతుకుతూ వెళ్లానని చెప్పాడు. అంతటి నిబద్దత కలిగిన యోధుడు చిన్నన్న. ఈ విషయాన్ని సాకుగా తీసుకునీ అప్పటి కర్నూలు ఎస్పీ నడిగట్టు సంజయ్ గ్రామానికి వచ్చి చిన్నన్న తండ్రికి ఆపరేషన్ చేయిస్తున్నట్లు చెప్పాడు, చేయించాడు. మావోయిస్టులు ఎంత దుర్మార్గంగా ఉంటారో చూడండని గ్రామస్తుల ముందు విషం కక్కాడు.