Menu

మావోయిస్టుల గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారు ?

anadmin 2 months ago 0 291

ఇండియా టుడే ఛానల్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంత భాగం…తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి చేశారు

యాంకర్: గృహామంత్రి అమిత్ షా మొదట ర్యాలీలో చెప్పారు – ఉపరాష్ట్రపతి పదవి కోసం నిలబెట్టిన ప్రతిపక్షాల క్యాండిడేట్ సుదర్శనరెడ్డి సుప్రీం కోర్టులో ఇచ్చిన ఒక ఆర్డర్‌తో సల్వాజుడుమ్‌ను రద్దుచేయడం వల్ల నక్సలిజం ఈ రోజు వరకు బతికి ఉంది. ఇంత ఎక్కువ సమయాన్ని తీసుకుని ఉండేది కాదు. త్వరగా అంతమైపోయి ఉండేది అని. అంటే అతన్ని దోషిగా నిలబెడుతున్నారు. ఆ ఒక్క ఆర్డర్ వల్ల నక్సలిజం అంతం కాలేకపోయింది.

రేవంత్ రెడ్డి: అమిత్ షా, బిజెపిల ఆలోచనా విధానం ఇదే. “మా సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోతే వారి మీద తూటా పేల్చేయండి” ఇది వాళ్ళ సిద్ధాంతం. ఆ బెంచి మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్కడే లేడు. ఇంత మంది జడ్జిలు తీర్పు నిస్తే.. మీరు జడ్జిమెంట్‌ను ఎలాగయినా పోస్ట్ మార్టం చేయండి.. కానీ జడ్జి మీద మీరు ఆరోపణలు చేయలేరు. అలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకం(Which is unconstitutional ).. గృహమంత్రి అయి ఉండి ఇలాంటి ఆరోపణ ఎవరిపైనా అయినా చేయడం అతనికి తగినది కాదు. ఎందుకంటే అమిత్ షా గారూ, మీరు ఈ దేశానికి గృహమంత్రి.. శాంతి భద్రతలను కాపాడేవారు మీరు… శాంతి భద్రతలను ఉల్లంఘించడానికి మీరు లేరు.. లెఫ్ట్ ఐడియాలజీ, రాడికల్ ఐడియాలజీ లేదా నక్సలైట్ల సిద్ధాంతం ఎప్పటి వరకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా చూస్తారో మీరు ఏమీ చేయలేరు. చేయకూడదు కూడా. వాళ్ళతో చర్చలు జరపండి. టెర్రరిస్టులతో మీరు చర్చలు జరుపుతున్నారు.. పాకిస్తాన్ నుంచి యుద్ధం వస్తే ఎవరో చెబితే మీరు యుద్ధం ఆపేస్తున్నారు.. పాకిస్తాన్ దూరి కాల్పులు జరిపితే మీరు ఆ పాకిస్తాన్ వాళ్ళను క్షమించేశారు.. ఇక్కడ మన అన్నలే, నక్సలైట్లు ఎవరు? పిడబ్ల్యూజి సెంట్రల్ కమిటీ సభ్యులు 21 మందిలో 18 మంది తెలంగాణకు చెందిన వారు. తెలుగు మాట్లాడేవారు. వాళ్ళ కుటుంబం కూడా మన కుటుంబమే. మన అన్నదమ్ములే. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. కొన్ని పద్దతుల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళకు అర్థం చేయించు.. సరెండర్ చేయించు..

యాంకర్: గృహమంత్రి.. అంటున్నాడు.. వాళ్ళని ఖతం చేసేయాలని ..

రేవంత్ రెడ్డి : అది అతని అవగాహన(that is his perception). ఈ ఆలోచనా విధానం ఎప్పటికీ అంతమయ్యేది కాదు. ఎందుకంటే ఎప్పటివరకు పేదలు ఉంటారో అప్పటి వరకు ఉంటుంది. ఒత్తిడి రాజకీయాలతో (ప్రెషర్ పాలిటిక్స్) ఏమైనా చేయాలని ప్రయత్నిస్తే ఒక్కొక్కప్పుడు అగ్రెసివ్‌గా (దూకుడుగాను) ఉంటారు, ఒకప్పుడు సబ్మిసివ్‌గాను (అణకువగానూ) ఉంటారు తప్ప వారిని భారత దేశం లోంచి నిర్మూలించడం అంత సులభం కాదు. ఇది కోవిడ్ లేదా ఏదైనా వైరస్ కాదు (This is not Covid or any other virus). ఇది ఒక సిద్ధాంతం (This is an ideology).

యాంకర్: ముఖ్యమంత్రి గారూ .. మీరు మావోయిజాన్ని డిఫెండ్ చేస్తున్నారు అని ప్రభుత్వం అనవచ్చు..

రేవంత్ రెడ్డి: మేం డిఫెండ్ చేయడం లేదు

యాంకర్: మావోయిస్టు ఆలోచనని..

రేవంత్ రెడ్డి: ఆ ఆలోచనను కూడా మీరు అర్థం చేసుకోండి.. ఇందిరాగాంధి అగ్రికల్చర్ సీలింగ్ చట్టం తీసుకు వచ్చింది. నక్సలైట్లు ఏమన్నారు? పేదవాళ్ళకు భూములు పంచండి అని.. భూమిని పంచడానికి మేం చట్టం చేశాం… వేలఎకరాల భూమి జమీందార్లు, జాగీర్దార్ల కొన్ని కుటుంబాల చేతుల్లో ఉంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుని పంచింది. మేం పోడుభూమిని.. 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసులకు భూమిని పంచాం. అందుకని నక్సలైట్ల సిద్ధాంతం..

యాంకర్: మూల సిద్ధాంతం..

రేవంత్ రెడ్డి: హా.. మూల సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ చేసింది. అందుకని నక్సలైట్ల గురించిన చర్చ తక్కువైంది. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వడం, ప్రతి ఒక్కరి సంక్షేమం చూడడం..
యాంకర్: ప్రాధమికంగా మీరు అనేది సిద్ధాంతం ఎక్కడికీ పోదు..ఇప్పుడు కొంత తగ్గవచ్చు ..

రేవంతరెడ్డి: అప్పుడప్పుడూ.. హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ నిర్మూలించలేరు అనే నేను చెప్పేది.. అది నా స్టేట్మెంట్. అది కోవిడ్ లేదా ఏదైనా వైరస్ కాదు ఇంజెక్షన్ ఇస్తే పూర్తిగా తగ్గిపోవడానికి. అలా అనడం సరి కాదు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad