Menu

హిడ్మా ఎన్ కౌంటర్ బూటకం… రెండు రోజుల ముందే అరెస్టు చేసి ఈ రోజు చంపేశారు

anadmin 6 days ago 0 786

సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా, ఆయన భార్య రాజే, లక్మల్, మల్లా, దేవే, కమ్లూ లు ఆంధ్రప్రదేశ్ లోని మారేడి మిల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. అయితే హిడ్మాతో సహా మిగతా వారందరినీ రెండు రోజుల క్రితమే అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఆరుగురిని చంపేసిన పోలీసులు మరికిందరిని తమదగ్గర బంధీలుగా ఉంచుకున్నారని, వారిని కూడా హత్యచేసే ప్రమాదం ఉందని పౌరహక్కుల సంఘం తెలంగాణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గత నెల 28 నుండే హిడ్మా తో సహా మిగతా అందరూ ఏపీలో ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నారని, పక్కా సమాచారం మేరకే పోలీసులు వారిని పట్టుకొని చంపేశారని ఏపీ పౌరహక్కుల సంఘం తెలిపింది.

ఈ మేరకు పౌరహక్కుల సంఘం విడుదల చేసిన ప్రకటన;

మావోయిస్ట్ నాయకులు హిడ్మా మరియు మిగతా నాయకుల ఎన్ కౌంటర్ బూటకం.. పోలీసులు పట్టుకొని కాల్చి చంపారు…పౌర హక్కుల సంఘం ఆంద్రప్రదేశ్…

గత నెల 28వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ షెల్టర్లో వున్న హిడ్మాను అతని సహచరులను ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పట్టుకున్న ఆంధ్ర పోలీసులు మారేడుమిల్లి అడవుల్లో కి తీసుకెళ్ళి నిరాధీయుల్ని అతి కిరాతకంగా హత్యచేశారు.ఈ బూటకపు ఎన్కౌంటర్ ను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది…మరింత మందిని నిరాయుధుల్ని హత్యచేసే అవకాశం ఉంది, వెంటనే వారిని కోర్టులో ప్రవేశపెట్టాలని,ఈ హత్యలను ఆపివేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాల్సిందిగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది….. ప్రజాసంఘాలు,ప్రజాస్వామికవాదులు అందరూ ఈ క్రూరమైన హత్యాకాండలను ఖండించండి…..

వేడంగి చిట్టిబాబు, అధ్యక్షుడు
చిలుకా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి
పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్
18 నవంబర్,2025….

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad