Menu

బూట‌కపు ఎన్ కౌంటర్లను ఆపేయండి, మావోయిస్టులతో చర్చించండి -మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

anadmin 2 months ago 0 167

-హిడ్మా ఎన్కౌంటర్ బూటకం
–సజీవంగా పట్టుకున్న చంపినట్టు ఆనవాళ్లు –లొంగిపొమ్మని చెబుతూ వచ్చేవారిని చంపేయడం ఏ రాజనీతి
— బి జె పి పాలిత రాష్ట్రల్లో లొంగిపోనందుకే హిడ్మా ను చంపినట్టు అనుమానాలు.
–ఎన్కౌంటర్ పై విచారణ జరపాలి
— అదుపులో వున్నవారిని విడుదల చేయాలి.
అందోల్ మాజీ ఎం ఎల్ యే క్రాంతి కిరణ్ డిమాండ్.

మావోయిస్టు పార్టీ నేత హిడ్మ ను సజీవంగా పట్టుకుని ఎన్కౌంటర్ లో కాల్చిచంపారని అందోల్ మాజీ ఎం ఎల్ యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. గత కొంత కాలంగా తీవ్రమైన నిర్భంధం, ఎన్కౌంటర్లు, పోలీస్ బలగాల ఒత్తిడివళ్ళ ఇతర ప్రాంతంలో తాళదాచుకున్న వారిని క్రూరంగా చంపారని అర్థం అవుతుందని ఆరోపించారు.
అమిత్ షా తో పాటు పోలీస్ బలగాల ఒత్తిడి వల్ల కొందరు చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల ముందులొంగిపోయారు. ఇంకొందరు తెలంగాణాలో లొంగిపోయారు. మిగిలిన వాళ్ళు వేరే రాష్ట్రల్లో లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సమాచారం తెలుసుకుని సజీవంగా దొరికిన హిడ్మా ను ఎన్కౌంటర్ లో చంపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సజీవంగా దొరుకుతున్న వారిని ఎన్కౌంటర్ లలో చంపుతుంటే మీ విధానాన్ని నిరంకుశ విధానం అనకుండా ఉండలేము అని ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కేంద్రాన్ని నీలదీశారు. మావోయిస్టు లను సామాజిక, ఆర్ధిక సమస్య గా గుర్తించకుండా హింసాత్మక సమస్యగానే భావిస్తే అది అనాలోచితమే అవుతుంది అని ఆయన అన్నారు. వ్యక్తుల నిర్మూలనతోనే దేశంలో శాంతి స్థాపనజరుగుతుంది అని భావిస్తే అది మీ మూర్ఖత్వం అవుతుంది పార్టీ కార్యదర్శి బసవరాజు అనంతరం జరిగిన ఎన్కౌంటర్ లు, నిన్న జరిగిన హిడ్మా, ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మావోయిస్టులను నిర్మూలించి శాంతిని స్థాపిస్తాం అని చెబుతున్న మీ మాటల్లో నిజాయితీ లేదని అనిపిస్తోంది. మీ తీరు మరో అంతర్గత పోరాటానికి దారితీస్తుంది అని లోకజ్ఞానం వున్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. నిజంగానే దేశంలో శాంతిని స్థాపించాలంటే మిగిలిన వారితోనైనా చర్చించండి . దానికి సానుకూల వాతావరణం కల్పించండి. మీ సాయుధబలగాలకు దొరికిన వారిని చంపకండి, లొంగిపోయేవారికి రక్షణ కల్పించండి అని ఆయన అమిత్ షా ను కోరారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad