Menu

ఎన్ కౌంటర్ల పేరిట హత్యాకాండ చేస్తున్నారు – 10 వామపక్ష పార్టీల‌ మండిపాటు

anadmin 4 days ago 0 181

వామపక్షాల మీడియా ప్రకటన‌

కగార్ పేరిట బూటకపు ఎన్ కౌంటర్ల హత్యాకాండను ఆపాలి
అరెస్టు చేసిన మావోయిస్టులందరినీ బహిరంగంగా ప్రకటించాలి
అటవి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి ఆదివాసీలను నిర్వాసితులను చేసే విధానాలను రద్దు చేయాలి.

2024 సంవత్సరం ప్రారంభం నుండి కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలనే గాక, ఆదివాసీలను సైతం బూటకపు ఎన్ కౌంటర్ల పేరిట హత్యాకాండను కేంద్రంలోని ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్-బిజెపిల నాయకత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతంలో అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సహా కొంతమందిని పట్టుకొని, రోజుకు బూటకపు ఎన్ కౌంటర్ పేరు మీద కాల్చి చంపుతున్నారు. నవంబర్ 18న ఉదయం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన హిడ్మాతో సహా, 6గురిని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడివిలో, నవంబర్ 19న ఉదయం 7గురుని రంపచోడవరంలో కాల్చి చంపారు. ఈ విధంగా పట్టుకున్న వారందరిని అరెస్టు ప్రకటించకుండా, ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం రాజ్యాంగాన్ని, చట్టాలను అవహేళన చేయడమే. ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కులను కాలరాయడమే. మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్టు దమనకాండలో భాగమే ఈ బూటకపు ఎన్కౌంటర్లు.

కగార్ పేరిట సాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్ల హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాము. బూటకపు ఎన్ కౌంటర్ల హత్యాకాండని నిలిపివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆదివాసీలను నిర్వాసితులను చేసే విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

జాన్ వెస్లీ, సిపి(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే
సూర్యం, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ,రాష్ట్రకార్యదర్శి
పోటు రంగారావు సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్, రాష్ట్ర కార్యదర్శి
సిహెచ్ మురహరి,సీపీయూఎస్ఐ (సి),రాష్ట్ర కార్యదర్శి
గాదగోనినొ రవి, రాష్ట్ర కార్యదర్శి,ఎంసిపిఐ(యు)

జానకి రాములు,రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, రాష్ట్ర కార్యదర్శి
ప్రసాదన్న, సిపిఐ (ఎం.ఎల్),రాష్ట్ర కార్యదర్శి
మామిండ్ల రమేష్ రాజా, రాష్ట్ర కార్యదర్శి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్
ఫార్వర్డ్ బ్లాక్

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad