టర్కీలోని మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ TKP/ML కార్యకర్తలు తమ పార్టీ అధికార పత్రిక పార్టిజాన్ పేరుతో ఇస్తాంబుల్ గోడలపై హిడ్మాకు లాల్ సలామ్ లు చెప్తూ వాల్ రైటింగ్ చేశారు. “లొంగుబాట్లు, ద్రోహం జరుగుతున్నప్పటికీ, భారత ప్రజలు కొనసాగిస్తున్న ప్రజా యుద్ధాన్ని మేము మా ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతాము; మావోయిస్టు అమరవీరుల పోరాటాన్ని, ముఖ్యంగా కామ్రేడ్ హిడ్మా పోరాటాన్ని మేము మా పోరాటంగా స్వీకరిస్తాము. వారిని మేము ఎల్లవేళలా గౌరవంగా గుర్తుంచుకుంటాము!” అని టర్కీ రాజధాని ఇస్తాంబుల్ గోడలపై రాశారు.
హిడ్మాతో సహా మావోయిస్టు అమరవీరుల జ్ఞాపకార్థం ఇస్తాంబుల్‌లోని వివిధ ప్రాంతాలలో విస్తృత ప్రచారం, ఆందోళన కార్యకలాపాలు జరిగాయి. వివిధ ప్రదేశాలలో బ్యానర్లు ప్రదర్శించారు; గోడలపై రాతలు రాశారు- “హిడ్మా మా హృదయాల్లో జీవించే ఉంటాడు. ప్రజా యుద్ధం ముందుకు సాగుతోంది”, “హిడ్మాకు రెడ్ సెల్యూట్! హిడ్మాకు రెడ్ సెల్యూట్!”, “భారతదేశ గొప్ప విప్లవ కమాండర్ హిడ్మా అమరుడు”, “హిడ్మాతో సహా అమరవీరులైన సహచరులందరికీ వేలాది రెడ్ సెల్యూట్. ”హిడ్మా భారతదేశం, ప్రపంచంలోని అన్ని పీడిత ప్రజల హృదయాల్లో స్పృహలో ఎప్పటికీ జీవించే ఉంటాడు.” అని బ్యానర్లపై, గోడలపై రాశారు.






ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత
కొందరి ద్రోహం వల్లనే హిడ్మా దొరికాడు;15న పట్టుకొని 19న చంపేశారు – మావోయిస్టు పార్టీ ప్రకటన
దేశ వ్యాప్త నిరసనలకు న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు
ఎన్ కౌంటర్ల పేరిట హత్యాకాండ చేస్తున్నారు – 10 వామపక్ష పార్టీల మండిపాటు
బూటకపు ఎన్ కౌంటర్లను ఆపేయండి, మావోయిస్టులతో చర్చించండి -మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
హిడ్మా ఎన్ కౌంటర్ ఫేక్, విచారణ జరపాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు 