Menu

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్ర‌మాలు

anadmin 4 weeks ago 0 156

“భారతదేశంలో ఆపరేషన్ కాగర్‌ను ఆపండి, మారణహోమాన్ని అంతం చేయండి” అనే నినాదంతో ఈ నెల 13న టర్కీలో ర్యాలీ జరగనుంది. ఇస్తాంబుల్ లోని భారత కాన్సులేట్ ముందు పార్టిజాన్ సహా పలు సంస్థలు ప్రదర్శనకు పిలుపునిచ్చాయి.

ఆపరేషన్ కాగర్ పేరుతో భారత్ లో జరుగుతున్న‌ హత్యలు, లైంగిక హింస, ప్రజల గ్రామాలను ఖాళీ చేయించడాన్ని ఈ సందర్భంగా పార్టిజాన్ ఖండించింది. స్థానిక ప్రజల హక్కులను కాలరాయడం ద్వారా వారి భూములను స్వాధీనం చేసుకొని లాభదాయకమైన ఖనిజ వనరులను దోచుకోవడానికే భారత పాలకులు మావోయిస్టులను హత్యలు చేస్తున్నారని పార్టిజాన్ ఆరోపించింది.

భారత పాలకుల హింసకు వ్యతిరేకంగా, టర్కీలోని విప్లవ సంస్థలు ఇస్తాంబుల్‌లోని భారత కాన్సులేట్ ముందు ర్యాలీకి పిలుపునిచ్చాయి.

అదే విదంగా ఈ వారం జర్మనీలోని బ్రెమెన్ నగరం బ్లాక్‌డిక్ పరిసరాల్లో, ఆపరేషన్ కాగర్ ను నిరసిస్తూ, భారతదేశంలోని ఆదివాసీ జనాభాపై దాడులను ఖండిస్తూ ప్రధాన వీధి, ట్రామ్ లైన్ వెంట బ్యానర్లు వెలిశాయి.

” భారత రాజ్యం ప్రజలపై చేశ్తున్న‌ నేరాలను ఎక్కువ మంది భారతీయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు తెలియజేయడం కోసం బ్యానర్లు హిందీలోకి అనువదించబడ్డాయి. ఉత్తర జర్మనీలోని అతిపెద్ద హిందూ దేవాలయం సమీపంలో కూడా ఈ బ్యానర్లు వేలాడదీయబడ్డాయి.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad