Menu

దండకారణ్యంలో మారణహోమానికి నిరసనగా ‘ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక’ ప్రదర్శన‌

anadmin 4 weeks ago 0 194

దండకారణ్యంలో ఖనిజ సంపదను బడా పెట్టుబడిదారుల పరం చేయడం కోసం, కగార్ ఆపరేషన్ పేరిట ఆదివాసులపై, మావోయిస్టు పార్టీ నాయకులపై, కార్యకర్తలపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా సోమవారంనాడు సికిందరాబాద్ లో ప్రదర్శన జరిగింది. రేతి ఫైల్ బస్సు స్టాండ్ నుండి చిలకలగూడా బస్సు స్టాప్ వరకు ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.

ఈ మేరకు ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక కన్వీనర్ వంగల సంతోష్ విడుదల చేసిన ప్రకటన:

దండకారణ్యం లోని ఖనిజ సంపద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాసిపిఐ (మావోయిస్టు), ఆదివాసుల పై ఆపరేషన్ కగార్ పేరా జరుగుతున్న నరమేధానికి నిరసనగా ఈరోజు (15-12-2025నాడు )సికింద్రాబాద్ లోని రేతి ఫైల్ బస్సు స్టాండ్ నుండి చిలకలగూడా బస్సు స్టాప్ వరకు ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలోప్రజాసంఘాల ఉమ్మడివేదికకన్వినర్స్ వంగల సంతోష్,పల్స యాదగిరి, రైతుకూలీ సంఘం (RCS)రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెల్తురు సదానందం, AIFTU రాష్ట్ర అధ్యక్షులు T. రత్నకుమార్, Y. మల్లేష్,మాతంగి రాయమల్లు,PDSU ( విజృం భణ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్, k మహేష్, POW స్త్రీవిముక్తి నాయకురాలు గంగా, S. లావణ్య రాజేశ్వరి,రమ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, కళాకారులు రాకేష్, అరుంధతి, సౌజన్య, మౌనిక, హారిక,AIFTU నాయకులు,రాజేశ్వరి, G రాములు, M పోచమల్లు, కుర్తె లింగం, వెంకట లక్ష్మి, అనసూర్య, రైతుకూలీ సంఘం నాయకులు బొమ్మకంటి కొమురయ్య, యుగేందర్, చిత్తరి స్వామి, తదితరులతోపాటు 79మంది పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ…
రాజ్యాంగ పరిధినిమించి కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ను కేంద్రం నుండి భర్తరప్ చేయాలి. లొంగండి లేదా చావండి అంటూ తేదీలు నిర్ణయించడం జీవించే హక్కును హరించడమే.కేంద్ర హోం మంత్రి అమిత్ షా వాఖ్యనాలను సుమోటో గా తీసుకోని BNS 103ప్రకారం అరెస్ట్ చేసివిచారించి శిక్షించాలన్నారు.చతీష్గడ్, ఝార్కండ్, బీహార్, ఈశన్యా రాష్ట్రాల్లో, కాశ్మీర్ లలో జరుగుతున్నఅణిచివేత, సామ్రజ్యవాదుల సంపద పెంచడానికే.భారతదేశం లో ని ఖనిజసంపద ను వేదాంత్, జిందాల్, SR, మిట్టల్, డీ బీర్, అదాని, అంబాని లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజేప్పే కుట్రలను వక్తలు ఖండించారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, అడవుల్లోని సాయుధ పోలీస్ బలగాలను వెనక్కి రప్పించాలనిడిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తు నియంత్రత్వం గా వ్యవహరిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను భర్తరప్ చేసేంత వరకు ప్రజాస్వామికవాదులు, పిడిత ప్రజలు ఆందోళన పోరాటాలను ఉదృతం చేయాలని కోరారు.
ఉద్యమాభివందనలతో
వంగల సంతోష్
కన్వీనర్
ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad