Menu

సమాజాన్ని భయాందోళనకు గురిచేసేందుకే గాదె ఇన్నయ్య అరెస్టు -భారత్ బచావో

anadmin 3 weeks ago 0 129

Date: 22-12-2025
భారత్ బచావో జాతీయ నాయకుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం ద్వారా ప్రశ్నించే గొంతులను, సమాజాన్ని భయాందోళనకు గురిచేసే ప్రయతాన్ని ఖండిద్దాం @ భారత్ బచావో. .

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రా రెడ్డి అలియాస్ వికల్ప్ అంతిమ యాత్ర సందర్భంగా, భారత ప్రభుత్వ సమగ్రతను దెబ్బతీసే విధంగా, నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యక్రమాలను, సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా ప్రసంగించారని ఆరోపణలతో, కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఆదేశంపై, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్. ఐ .ఏ., ది: 21- 12-2025న భారత్ బచావో జాతీయ నాయకుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. భారత్ బచావో దీనిని తీవ్రంగా ఖండిస్తోంది.

భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు, పౌరులకు కల్పించబడిన భావ ప్రకటన స్వేచ్ఛ. ను, ప్రభుత్వాల రాజ్యాంగ ఉల్లంఘనలనపై విమర్శించే హక్కును అణచివేసే చర్యలను విరమించు కోవాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది.

రాజ్యాంగ వ్యతిరేకులతో సైతం రాజ్యాంగము అనుమతించిన, చట్టబద్ధ పద్ధతులతోనే వ్యవహరించడం అనేదే ప్రజాస్వామ్యం యొక్క మౌళిక సూత్రమని ఈ సందర్భంగా గుర్తుచేస్తుంది.

ఒక షెల్టర్ లో, నిరాయుధంగా దొరికిన నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు కాతా రామచంద్రారెడ్డి@వికల్ప్ ను చట్టబద్ధ పద్ధతుల్లో శిక్షించే అవకాశం ఉండినప్పటికిని, చిత్రవధకు గురిచేసి ఎన్కౌంటర్ చేయడం పట్ల ఆవేదనతో కూడిన ఆగ్రహంతో, గాదె ఇన్నారెడ్డి మాట్లాడిన మాటలను భారత ప్రభుత్వం మీద చేసిన కుట్రగా పేర్కొంటూ కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలను పరిహసించడమే అవుతుంది.

సమాజం పట్ల, అట్టడుగు ప్రజల పట్ల మానవీయమైన హృదయం కలిగిన గాదె ఇన్నారెడ్డి, గతంలో పీపుల్స్ వార్ కార్యకర్తగా పనిచేసినప్పటికీని, గత మూడు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ రాజకీయ పార్టీలతో, నాయకులతో కలిసి పోరాడిన ప్రజాస్వామికవాది. మా ఇల్లు ఆశ్రమం పేరిట వందలాదిమంది నిరుపేద, అనాధ పిల్లలను అక్కున చేర్చుకుని, వారిని ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహిస్తూ నిరంతరం శ్రమిస్తున్న మానవతావాది.

లౌకికవాదము, ప్రజాస్వామ్యము, సమాఖ్య తత్వాల పునాదిగా పనిచేసే రాజ్యాంగబద్ధ పాలన కోసం ఉద్యమిస్తున్న గాదె ఇన్నారెడ్డి పై నమోదు చేసిన కేసును బేషరతుగా ఉపసంహరించు కోవాలని, అతనిని వెంటనే విడుదల చేయాలని భారత్ బచావో డిమాండ్ చేస్తుంది.

ఆ దిశగా రాజకీయ పార్టీలు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని భారత్ బచావో
విజ్ఞప్తి చేస్తుంది.

డాక్టర్ ఎం. ఎఫ్ గోపీనాథ్, భారత్ బచావో వైస్ చైర్మన్.
జంజర్ల రమేష్ బాబు, జాతీయ కౌన్సిల్ సభ్యులు.
గోపు సోమయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యులు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad