మావోయిస్టు నాయకుడు బర్సెదేవాను, 16 మంది ఆయన సహచరులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. వారి ప్రాణానికి హానీ తలపెట్టవద్దని, కోర్టులో ప్రవేశపెట్టాలని పౌర, ప్రజాస్వామిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రొ. హరగోపాల్ ఈ విషయంలో రేవంత్‌రెడ్డి నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కానీ ఇప్పడు పోలీసులు వారి అరెస్టు చూపకుండా లొంగిపోయినట్లు చూపడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది స్పష్టంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడమే. లొంగిపోతారా? చచ్చిపోతారా? అనే అమిత్‌షా రాజ్యాంగ వ్యతిరేక, మానవ వ్యతిరేక విధానాన్ని అనుసరించడమే. తద్వారా మావోయిస్టు ఉద్యమాన్ని బలహీన పరిచామని ప్రచారం చేసుకొనేందుకు, విప్లవాభిమానుల్లో నిరాశ, నిస్పృహలు లేవదీసేందుకు కుట్ర పూరితంగా పోలీసులు ఇట్లా వ్యవహరిస్తున్నారని అనుమానించాల్సి వస్తోంది. ఈ వైఖరిని ప్రజాస్వామిక వాదులు ఎండగట్టాలి. తక్షణం వారి ప్రాణాలకు హానీ తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలి.
బర్సె దేవాతో పాటు పదమూడు మంది మావోయిస్టులను వారితో వున్న ముగ్గురు సాధారణ పౌరులు వాహనాల్లో ఆసిఫాబాద్ వైపు వెళుతున్న క్రమంలో ఆయుధాలతో పాటు తెలంగాణ పోలీసులు 29వ తేదీ అర్థరాత్రి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వివిధ స్థాయిలకు చెందిన కార్యకర్తలు కావచ్చు. వీరికి ప్రాణహానీ తలపెట్టకుండా మీడియా ముందు హాజరు పరచాలి.

‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
బీజేపీ బాటలో ఆప్… దళితులకు భూమి కోసం పోరాడుతున్న ముకేశ్ మలౌద్ అక్రమ అరెస్ట్
తల్లికి మావోయిస్టు పార్టీ నాయకుడు పాక హనుమంతు @ గణేష్ లేఖ
ఏ మార్గాన్ని అనుసరించాలి?
‘అబద్ధపు, కల్పిత అభియోగాల పై గాదె ఇన్నయ్య అరెస్టు’
సమాజాన్ని భయాందోళనకు గురిచేసేందుకే గాదె ఇన్నయ్య అరెస్టు -భారత్ బచావో 