Menu

పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్‌బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష‌

anadmin 12 hours ago 0 155

బీహార్‌లోని పాట్నా సెంట్రల్ జైల్‌లో దాదాపు మూడేళ్లుగా ఉన్న 74 ఏళ్ల CPI(మావోయిస్టు) పోలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ప్రమోద్ మిశ్రా, జనవరి 26 నుంచి ఆమరణ నిరాహాదీక్ష‌ (ఫాస్ట్ అంటు డెత్) చేపట్టారు. జైలులోని అమానవీయ పరిస్థితులు, రాజకీయ ఖైదీలపై అణచివేతకు నిరసనగా ఆయన ఈ ఆందోళన ప్రారంభించారు. ఆహారం స్వల్పంగా, నాసిరకంగా ఉండటం, సబ్బు, నూనె వంటి రోజువారీ అవసరాలు సరిగా లేకపోవటం, కుటుంబ సభ్యులు, వకీళ్ళ‌తో మాట్లాడే టెలిఫోన్ సౌకర్యం లేకపోవటం వంటి సమస్యలు ఉన్నాయి.

క్యాంపెయిన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR) – AIRSO, AISF, APCR, CRPP, DSU వంటి సంఘాల కూటమి – ప్రమోద్ మిశ్రాకు పూర్తి సంఘీభావం తెలిపింది. ప్రకటనలో పెట్టిన డిమాండ్లు: అందరు ఖైదీలకు తగిన ఆహారం, స్నాక్స్, రోజువారీ వస్తువులు అందించాలి; కుటుంబం, వకీళ్ళ‌తో టెలిఫోన్ సౌకర్యం కల్పించాలి; మిశ్రా వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచి స్వతంత్ర వైద్య చికిత్స అందాలి. “74 ఏళ్ళ‌ వయసున్న ఆయన పట్ల జైలు అధికారులుది ఇలా ప్రవర్తించడం అంటే ఆయనను నెమ్మదిగా హత్య చేయడం వంటిది” అని CASR విమర్శించింది.

ఫాదర్ స్టాన్ స్వామీ (84 ఏళ్లు) నీళ్ళు తాగడానికి సప్పర్ కోరి, అది కూడా దొరకక‌ మరణించారు; 90% వికలాంగుడైన‌ ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబా జైల్లో సరైన వైద్యం అందక శరీరం పూర్తిగా దెబ్బతిని విడుదల తర్వాత మరణించారు; CPI(మావోయిస్టు) నాయకుడు విజయ్ కుమార్ ఆర్యా సరైన ఆహారం డిమాండ్ చేసినందుకు అతన్ని హింసలపాలు చేసి బుక్సార్ జైలుకు బదిలీ చేశారు. బీహార్ జైళ్లలో ఆహార లోపం, వైద్య సౌకర్యాలు లేకపోవటం, రాజకీయ బందీలపై వివక్ష సాధారణం. జైళ్లు ‘టార్చర్ హౌస్‌లు’, ‘వధశాలలు’గా మారాయని ఆరోపణలు ఉన్నాయి.

ప్రజాస్వామిక శక్తులు, సివిల్ రైట్స్ సంస్థలు జైలు పరిస్థితులపై స్పందించాలని CASR పిలుపునిచ్చింది. బీహార్ ప్రభుత్వం, జైలు అధికారులు మిశ్రా ఆరోగ్యం, జైలు పరిస్థితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. “అణచివేతతో పోరాటాన్ని అంతం చేయలేం. గౌరవం, న్యాయం కోసం పోరాటం కొనసాగుతుంది” అని CASR పేర్కొంది.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad