(మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురికి NIA నోటీసులు పంపడాన్ని క్యాంపెయిన్ అగెనెస్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR) ఖండించింది. CASR ప్రకటన పూర్తి కింద…)
తెలంగాణలో పది మందికి పైగా కార్యకర్తలు, మాజీ విద్యార్థి నాయకులు, పౌర హక్కుల నాయకులు, కవులు, రచయితలు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, స్థానిక సీపీఐ, కాంగ్రెస్ నాయకులకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), హైదరాబాద్ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని క్యాంపెయిన్ అగెనెస్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR) తీవ్రంగా ఖండిస్తోంది.
FIR నంబర్ RC-04/2025కి సంబంధించినవి, ఇది గత సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురైనట్లు ఆరోపణలున్న CPI (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిపై NIA కేసు ( FIR నంబర్ RC-04/2025) నమోదు చేసింది. తెలంగాణలో ప్రజాస్వామ్య గొంతులను అణిచివేయడానికి, పౌర సమాజాన్ని భయపెట్టడానికే కేసుల పేరుతో NIA పలువురికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో, భారత్ బచావో నాయకుడు, సామాజిక కార్యకర్త ఇన్నయ్యను ఇప్పటికే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద అరెస్టు చేశారు. ఆయన వరంగల్ జిల్లాలో పిల్లల కోసం అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా మానవతా, సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. కేసుల పేరుతో నోటీసులు జారీ చేయడం, ఇన్నయ్యను అరెస్టు చేయడం, చట్టబద్ధమైన సామాజిక, రాజకీయ, మానవతా కార్యకలాపాలను నేరంగా పరిగణించడం ఉగ్రవాద నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడమే. గత 15 సంవత్సరాలుగా ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఉంటున్న పిల్లలకు, పనిచేస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేశారు. మానవతా దృక్పదంతో ఆశ్రమానికి విరాళాలు ఇస్తున్న దాతలను కూడా లక్ష్యంగా చేసుకుని, ప్రజలలో భయాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ఈ నోటీసులు జారీ చేస్తున్నారు.
అంత్యక్రియలకు హాజరుకావడం నేరమా?
చనిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలుపలికే హక్కును భారత సుప్రీంకోర్టు అనేకమార్లు సమర్థించింది. ఆశ్రయ్ అధికార్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా గౌరవప్రదమైన దహన సంస్కారాల హక్కును కోర్టు గుర్తించింది.
అంత్యక్రియలకు హాజరైనందుకే కాదు, రాంచందర్ రెడ్డి ఎన్ కౌంటర్ బూటకమని మాట్లాడినందుకే ఇన్నయ్యతో సహా మిగతావారిని NIA టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నది.
ఈ సామూహిక నోటీసుల జారీ కేవలం బెదిరింపు వ్యూహం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఆదివాసీ, దళిత, అణగారిన వర్గాలలో పనిచేసే కార్యకర్తలలో భయాన్ని సృష్టించడానికి ఉద్దేశించినది.
మాజీ విద్యార్థి నాయకులు, కవులు, ఉపాధ్యాయులు, రాజకీయ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలను అణచివేయడానికే. దర్యాప్తు సంస్థలు ఛత్తీస్‌గఢ్‌లో బూకటపు ఎన్‌కౌంటర్‌ల ఆరోపణలకు జవాబు చెప్పడానికి బదులు ప్రశ్నించే వారిని నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారు.
అంత్యక్రియలకు హాజరు కావడం ఉగ్రవాదం కాదు. ఎన్‌కౌంటర్ హత్యను ప్రశ్నించడం నేరమూ, దేశద్రోహం కాదు. దుఃఖం, సంఘీభావం, అసమ్మతిని నేరంగా పరిగణించే ప్రయత్నం ప్రజాస్వామ్య సంక్షోభాన్ని బహిర్గతం చేస్తుంది. NIA నోటీసుల నేపథ్యంలో CASR తెలంగాణ కార్యకర్తలకు అండగా నిలుస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా చట్టాన్ని ఆయుధంగా ఉపయోగించడాన్ని ప్రతిఘటిస్తోంది.
డిమాండ్లు
- FIR నంబర్ RC-04/2025లో జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
- ఈ కేసులో ఇన్నయ్యతో సహా UAPA కింద అరెస్టు చేయబడిన వారందరినీ వెంటనే విడుదల చేయాలి.
- ఛత్తీస్‌గఢ్‌లో రామచంద్రారెడ్డి బూటకపు ఎన్‌కౌంటర్ హత్యపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి.
- పౌర సమాజ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి UAPAని దుర్వినియోగం చేయడం ఆపాలి.

మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్
పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష
ఈ నెల 24, 25వ తేదీల్లో విరసం 30వ మహాసభలు
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
బీజేపీ బాటలో ఆప్… దళితులకు భూమి కోసం పోరాడుతున్న ముకేశ్ మలౌద్ అక్రమ అరెస్ట్ 