గౌరవం కోసం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, క్యాంపెయిన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR) తన సంఘీభావాన్ని తెలియజేస్తుంది.
మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, ప్రతిఘటనకు చిహ్నంగా జరుపుకుంటున్నప్పటికీ, భారతదేశంలో అనేక మంది మహిళా రాజకీయ ఖైదీలు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) వంటి క్రూరమైన చట్టాల కింద తరచుగా విచారణ లేకుండానే అనేక సంవత్సరాలుగా జైళ్లలో మగ్గుతున్నారు,
కల్పిత ఆరోపణలతో UAPA కింద మహిళా కార్యకర్తలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులను నిరంతరం నిర్బంధించడాన్ని CASR తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మహిళల్లో చాలామంది విచారణలో ఉన్నవారు, వారు తమ కేసులు ముగింపుకు రాకుండానే సంవత్సరాలు జైలులో గడిపారు.
అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన వారిలో
- సయ్యదా ఆసియా ఆండ్రాబీ, 8 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు
- సోఫీ ఫెహ్మీదా, 8 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు
- నహిదా నస్రీన్, 8 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు
- న్యాయవాది బెల్లాల పద్మ, అండర్ ట్రయల్ 2 సంవత్సరాల 9 నెలలు
- బిందా సోనా, అండర్ ట్రయల్ 2 సంవత్సరాలు
- ప్రభ, అండర్ ట్రయల్ 2 సంవత్సరాల 6 నెలలు
- సునీతా పోతం, అండర్ ట్రయల్ 1 సంవత్సరం 9 నెలలు
- షీలా మరాండి, అండర్ ట్రయల్ 4 సంవత్సరాలు 4 నెలలు
- జయీతా దాస్, అండర్ ట్రయల్ 4 సంవత్సరాలు
- నార్ల విద్య, అండర్ ట్రయల్ 8 నెలలు
- మడకం కోసి, 3 సంవత్సరాలు
- సావిత్రి, అండర్ ట్రయల్ 4 సంవత్సరాలు
- ఉన్నిమాయ, అండర్ ట్రయల్ 2 సంవత్సరాలు
- కమల, అండర్ ట్రయల్ 2 సంవత్సరాలు 8 నెలలు
- డి. దేవేంద్ర, అండర్ ట్రయల్ 3 సంవత్సరాలు 8 నెలలు
16 . సిహెచ్. శిల్ప, అండర్ ట్రయల్ 3 సంవత్సరాలు 8 నెలలు
17 . కె. శిరీష, అండర్ ట్రయల్ 2 సంవత్సరాలు 9 నెలలు
ఈ జాబితాలో లేని వారు చాలా మంది ఉన్నారు.
ఈ మహిళలు వేర్వేరు ప్రాంతాల్లో అనేక పోరాటాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళ గళాన్ని అణచడానికి అసమ్మతిని లేకుండా చేయడానికి, రాజకీయ విశ్వాసాన్ని నేరంగా పరిగణించడానికి ప్రభుత్వం UAPA ను దుర్వినియోగం చేస్తున్నది. ఈ మహిళలలో చాలామంది ఆదివాసీ, గ్రామీణ నేపథ్యాల నుంచి అట్టడుగు వర్గాల నుండి వచ్చారు. వీళ్ళందరూ అరెస్టులకు ముందు మహిళల విముక్తి కోసం అనేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. వారు లేవనెత్తిన చట్టబద్ధమైన భూమి హక్కులు, పౌర స్వేచ్ఛ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న సమస్యలను పరిష్కరించే బదులు రాజ్యం వారిని “ఉగ్రవాదులు”గా ముద్ర వేసి కఠినమైన ఉగ్రవాద నిరోధక నిబంధనల కింద జైలులో పెట్టింది. ఈ మహిళా ఖైదీల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఎక్కువ మంది విచారణలో ఉన్నారు. దోషులుగా నిరూపించే వరకు నిందితులను నిర్దోషులుగా భావించాలనే ప్రాథమిక న్యాయ సూత్రానికి ఇక్కడ తిలోదకాలిచ్చారు. UAPA కఠినమైన బెయిల్ నిబంధనల వల్ల నేరం నిరూపించబడకముందే వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంది.
జైలులో ఉన్న మహిళలు తీవ్రమైన,ఆందోళనకరమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
దీర్ఘకాలిక జైలు శిక్ష, తగినంత వైద్య సంరక్షణ లేకపోవడం, కఠినమైన జైలు పరిస్థితుల కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు చాలామంది చెప్తున్నారు. కొందరు కస్టడీలో ఉన్నప్పుడు గర్భస్రావాలు వంటి తీవ్రమైన పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది న్యాయం, సమానత్వం, మహిళల హక్కుల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించాలి. కానీ ఈ రోజు ప్రభుత్వాధిపతులు ఒకవైపు మహిళా సాధికారత గురించి ఉపన్యాసాలు ఇస్తూ మరో వైపు ఈ మహిళా రాజకీయ ఖైదీలను నిరంతరం నిర్బంధించడం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.
అసమ్మతిని నేరంగా పరిగణించడం, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద మహిళా కార్యకర్తలను నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని CASR విశ్వసిస్తుంది. UAPA కింద పెరుగుతున్న అరెస్టుల సరళి, ఈ చట్టం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కాకుండా రాజకీయ వ్యతిరేకత, మానవ హక్కుల ఉద్యమాలను, ఇతర ప్రజా అట్టడుగు ఉద్యమాలను అణచివేయడానికి ఉపయోగిస్తున్నారని అర్దమవుతున్నది.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు, CASR ఈ క్రింది డిమాండ్లను చేస్తుంది:
- UAPAతో సహా ఇతర క్రూరమైన చట్టాల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న అందరు మహిళా రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.
- తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న జైలులో ఉన్న అందరు మహిళలకు తక్షణ వైద్య చికిత్స అందించాలి.
- అసమ్మతిని, ప్రజాస్వామ్య కార్యకలాపాలను నేరంగా పరిగణించడానికి ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఆపాలి.
- అనేక సంవత్సరాలుగా విచారణలో ఉన్న ఖైదీలుగా జైలులో ఉన్న అందరి కేసులలో వేగవంతమైన, న్యాయమైన విచారణ జరపాలి.
అన్యాయంగా జైలులో మగ్గుతున్న ఈ మహిళల కోసం ప్రజాస్వామ్య సంస్థలు, మహిళా సంస్థలు, పౌర హక్కుల సంఘాలు తమ గొంతు విప్పాలని CASR పిలుపునిచ్చింది.
మహిళా రాజకీయ ఖైదీలందరిని తక్షణం విడుదల చేయాలి.
UAPA దుర్వినియోగాన్ని ఆపేయాలి.
ప్రజాస్వామ్య హక్కులను రక్షించండి.
- -రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా ప్రచారం (CASR)

‘అబద్ధపు, కల్పిత అభియోగాల పై గాదె ఇన్నయ్య అరెస్టు’
మన దేశంలో అబద్దపు కేసులు, అరెస్టులు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఇది ఒక ఉదహరణ
Condemn the actions of security forces who are committing severe repression against farmers 