సీపీఐ-మావోయిస్ట్ సీనియర్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రశాంత్ బోస్ అలియాస్ ‘కిషన్ దా’, ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో అమరుడయ్యారు.
కిషన్ దా వయసు 80 ఏళ్లకు పైనే. సెరైకేలా జైలులో ఉన్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను రిమ్స్‌కు తరలించగా, అక్కడ వైద్యుల బృందం చికిత్స ప్రారంభించింది. అయితే, ఆయన పరిస్థితి మెరుగుపడకపోవడంతో, శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్లు ప్రకటించారని అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. ఆయన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు. మావోయిస్టు వర్గాలలో ఆయన ‘మనీష్’, ‘బుద్ధ’ వంటి పలు పేర్లతో ప్రసిద్ధి చెందారు. 2021 నవంబర్ 12న సెరాయికేలా-ఖర్సవాన్ జిల్లాలోని కంద్రా టోల్ బ్రిడ్జి సమీపంలో బోస్‌ను ఆయన భార్య షీలా మారండీతో పాటు అరెస్టు చేశారు.
ఆయనపై జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాల్లో 200కు కేసులు బనాయించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా విప్లవోధ్యమంలో ఉన్న ఆయనను మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా, మేధోమథుడిగా, సిద్ధాంతకర్తగా పరిగణించేవారు. అరెస్టు అయినప్పటి నుంచి బోస్ జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ, వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారు.
*భీమా కోరేగావ్ కేసులో కూడా ప్రశాంత్ బోస్ నిందితుడు. ఈ కేసులో ఉన్న మిలింద్ బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించగా, స్టాన్ స్వామి జ్యుడిషియల్ కస్టడీలో మరణించారు; ఇప్పుడు కిషన్ దా కూడా జ్యుడిషియల్ కస్టడీలో మరణించారు.

చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ యోధుడు కామ్రేడ్ రాజు దాదా
విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా
తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్‌బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష
ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్ 