ఢిల్లీ యీనివర్సీటీ మాజీ ప్రొఫెసర్, సామాజిక కార్యకర్త డాక్టర్ సాయిబాబా మర్ణానికి భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అధికారంలో ఉన్నవాళ్ళే అతన్ని హత్య చేశారని కెనడాలో సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. సాయిబాబా కు నివాళులు అర్పిస్తూ కెనడా సర్రేలోని హాలండ్ పార్క్ వద్ద కార్యకర్తలు క్యాండిల్ లైట్ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. “సాయిబాబాకు లాంగ్ లైవ్” అని రాసి ఉన్న బోర్డులను పట్టుకుని భారత అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ నిర్వహించి సాయిబాబా మృతికి నివాళులు అర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా వక్తలు భారత ప్రభుత్వంపై మండిపడ్డారు. పదేళ్ళపాటు సాయిబాబాను అన్యాయంగా జైల్లో ఉంచి అనేకరకాల చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. పదేళ్ళ జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసిందని, అందువల్లే ఆయన మరణించారని కార్యకర్తలు అన్నారు.

నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం
5 రాష్ట్రాల బంద్ – మావోయిస్టు పార్టీ పిలుపు
ఈ నెల 24న కగార్ కు వ్యతిరేకంగా వరంగల్ లో బహిరంగసభ
ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి - కర్ణాటక పీపుల్స్ ఫోరం అగైన్స్ట్ వార్ ఆన్ ఆదివాసీస్ 