బ్రిటన్ లోని ఇండియా లేబర్ సాలిడారిటీ అద్వర్యంలో ఈ నెల 16న లండన్ లో కామ్రేడ్ సాయిబాబా సంస్మరణ సభ జరగనుంది. ఈ సందర్భంగా బ్రిటన్ లోని ఇండియా లేబర్ సాలిడారిటీ విడుదల చేసిన ప్రకటన…
ప్రొఫెసర్ G.N సాయిబాబా గౌరవార్థం ప్రత్యేక స్మారక సమావేశానికి మాతో చేరండి. సాయిబాబా, స్ఫూర్తిదాయకమైన విద్యావేత్త, సామాజిక కార్యకర్త, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం తన తుధి శ్వాస వరకూ పోరాడిన యోధుడు. ప్రొఫెసర్ సాయిబాబాకు అణగారిన వర్గాల పట్ల అచంచలమైన అంకితభావాన్ని, న్యాయం పట్ల ఆయనకున్న నిబద్దతను, ప్రపంచవ్యాప్తంగా స్పూర్తిదాయకమైన ఉద్యమకారులను, మేదావులను స్మరించుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం. ఈ సంస్మరణ సభలో ప్రొఫెసర్ సాయిబాబా జీవితం, ఆయన చేసిన కృషి, రాబోయే కాలంలో ఆయన కృషిని ముందుకు తీసుకెళ్ళేందుకు ఏం చేయాలి అనే విషయాలను మనతో పంచుకునే వక్తల ప్యానెల్ ఉంటుంది. ఈ సభకు హాజరైన వారందరూ తమపై సాయిబాబా వేసిన ప్రభావాన్ని సభికులతో పంచుకోవచ్చు.
ఈవెంట్ వివరాలు:
తేదీ: 16-11-2024
సమయం: 14:00 – 16:00
స్థలం: G03 26 బెడ్‌ఫోర్డ్ వే, యూనివర్సిటీ కాలేజ్ లండన్, లండన్, WC1H 0DS

నాన్న బాటలోనే నడుస్తా…అమరుడు సాయిబాబా కూతురు మంజీరా
దామగుండం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ…. కామ్రేడ్స్ సుగుణ, సాయిబాబా సంస్మరణ సభ
సాయిబాబాకు నివాళులు అర్పించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)
సాయిబాబాది భారత ప్రభుత్వం చేసిన హత్య…కెనడాలో ప్రదర్శన
సాయిబాబాది ముమ్మాటికి హత్యే – మావోయిస్టు పార్టీ ప్రకటన 