కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నేతృత్వంలోని భారత విప్లవానికి మద్దతుని ప్రకటిస్తూ, అమరుడు, కామ్రేడ్ బసవరాజ్ @ నంబళ్ళ కేశవరావు గౌరవార్థం, యాంటీ-ఇంపీరియలిస్ట్ లీగ్ (ఎఐఎల్- సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్) నిర్వహించిన ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ ఎబిసి పాలిస్టా ( యుఎఫ్‌ఎబిసి) కి చెందిన శాంటో ఆండ్రే క్యాంపస్‌లో ఆగస్టు 7న జరిగిన ఒక కార్యక్రమానికి ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు హాజరయ్యారు.
భారత కమ్యూనిస్టుల దృఢ నియంత్రణలో ఉన్న మధ్య-తూర్పు భారతదేశంలోని రెడ్ కారిడార్ అని పిలిచే ప్రాంతంలో గెరిల్లాలు, సిపిఐ (మావోయిస్ట్) నేతృత్వంలోని ప్రజల దైనందిన జీవితాలను వర్ణించే ఒక రిపోర్టును ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.
బ్రెజిల్, భారతదేశం వంటి సామ్రాజ్యవాద, అర్ధ-భూస్వామ్య దోపిడీ ద్వారా అణచివేతకు గురవుతున్న దేశాలలో నూతన ప్రజాస్వామిక విప్లవ అవసరాన్ని గురించి ఎఐఎల్, విద్యార్థి ఉద్యమం “డాన్ ఆఫ్ ది పీపుల్” ల ప్రతినిధులు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విప్లవ పోరాటాలను రక్షించే అంతర్జాతీయ విధిని గురించి నొక్కి చెప్పారు.
దేశంలోని విస్తారమైన జాతీయ సంపదను, ముఖ్యంగా అరుదైన-భూమి వనరులను దోచుకొనే లక్ష్యంతో అమెరికా బ్రెజిల్‌పై విధించిన ఆంక్షలను ఉదాహరణగా చూపిస్తూ ప్రపంచంలోని పీడిత ప్రజలపైన అమలవుతున్న సామ్రాజ్యవాద దురాక్రమణలను విస్తృతంగా ఖండించారు,
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజల నుండి ఉత్సాహభరితమైన మద్దతు లభించింది; వారు ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఎఎన్‌డి మద్దతు కమిటీ హాజరై , ఎఎన్‌డి చారిత్రాత్మక జనరల్ డైరెక్టర్ కామ్రేడ్ ఫౌస్టో అర్రుడా గౌరవార్థం తీసుకువచ్చిన ఒక ప్రత్యేక సంచికను, ఇతర ప్రచురణలను ప్రదర్శనకు పెట్టారు. స్వతంత్ర విద్యార్థులు తయారు చేసిన సైద్ధాంతిక, విప్లవకర అంశాలతో ఉన్న పుస్తకాలను గొప్ప ఉత్సాహంతో కొన్నారు.
anovademocracia.com ; redherald.org సౌజన్యంతో…
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి