కరపత్రం
బహిరంగ సభ
తేది: 24-08-2025
సమయం: ఉ. 10.00 నుండి సా॥ 5.00 వరకు
స్థలం: అంబేడ్కర్ భవన్, వరంగల్.
అధ్యక్షతః ప్రా. గడ్డం లక్ష్మణ్ వేదిక కోఆర్డినేటర్, సిఎల్సి అధ్యక్షులు
వక్తలు:
మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి అధ్యక్షులు. నాయుని రాజేందర్ రెడ్డి ఎంఎల్ఎ హన్మకొండ
దాస్యం వినయ్ భాస్కర్, బిఆర్ఎస్ మాజీ
ఎంఎల్ఎ
జాన్ వెస్లీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
కూనమనేని సాంబశివరావు, సిపిఐఎంఎల్ఏ
జె.వి. చలపతిరావు న్యూ డెమోక్రసి
పోటు రంగారావు, మాస్ లైన్
మల్లెపల్లి ప్రభాకర్, సిపిఐ, ఎంఎల్, సిపి
కె. విశ్వనాధ్, సిపిఐ, ఎంఎల్ న్యూడెమోక్రసి ప్రొఫెసర్ హరగోపాల్
ప్రొఫెసర్ నరసింహ రెడ్డి
గోదం గణేష్, తుడుం దెబ్బ
సోనీ హారీ ఆదివాసి హక్కుల కార్యకర్త బేలబాటియా న్యాయవాది సామాజిక కార్యకర్త
అభినవ్ బూరం, కుల నిర్మూలన పోరాట సమితి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి
ప్రొఫెసర్ (రిటైర్డ్) కె.వెంకటనారాయణకెయు ఎన్. నారాయణ రావు, పౌరహక్కుల సంఘం, ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, తుడుం దెబ్బ టి. రత్న కుమార్, ఎఐఎన్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
సభ తరం అంబేద్కర్ భవన్ నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు ఊరేగింపు ఉంటుంది. ప్రజాకళామందలి అరుణోదయ, ఆదివాసి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు కలవు.
రాజ్యాంగ బద్దంగా పాలించవలసిన ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో రాజ్యాంగంపై విశ్వాసం కోల్పోయిన ఉద్యమకారులు పోరాటాలను తీవ్ర స్థాయిలో కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వాలు ఉద్యమ అణచివేతనే చూశారు తప్ప ఉద్యమ మూలాలను ఇప్పటికీ చూడడం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా చట్టసభల్లో అంకెలు ఎటువైపు మొగ్గినా ఏ చట్టాలు చేసినా రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. చరిత్రలో ఆదివాసీలు తరతరాలుగా పోరాటాల చేస్తూ అనేక చట్టాలను సాధించుకున్నారు. వాటి అమలు కోసం కూడా పోరాటాలు చేయాల్సిన స్థితిలో నుంచే బలమైన ఆదివాసీల పోరాటాలు మధ్యభారతంలో కొనసాగుతున్నాయి. వాటిపై అణచివేతకు మావోయిస్టు పార్టీని సాకుగా చూపెట్టి మధ్య భారతాన్ని యుద్ధ ప్రాంతంగా మార్చారు. బస్తరు సాయుధ బలగాలతో నింపేసారు.
దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసులు జీవించే హక్కు పూర్తిగా ప్రమాదంలో పడింది. తరతరాలుగా దట్టమైన అడవులు, కొండలతో, జంతువులతో గడిపే ఆదివాసీల సాంస్కృతిక జీవన వ్యవస్థ వారసత్వం ధ్వంసం చేయబడుతున్నది. వారి స్వయంపాలన, స్వయం నిర్ణయ హక్కు హరించబడటమే గాక సామ్రాజ్యవాద ముసుగులో జరిగే విధ్వంసకర అభివృద్ధిలో దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఆదివాసీల జీవించే హక్కు నిరంతరాయంగా వేటాడబడుతున్నది. రాజ్యాంగం పేర్కొన్న ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి జీవించే హక్కు కూడా జరుగుతున్న ఆపరేషన్ కగార్లో పూర్తిగా అణచివేతకు గురవుతున్నది.
నేడు కేవలం కార్పొరేట్లకు ఖనిజ సంపదను అప్పజెప్పడం కోసం ఆపరేషన్ కగారు ప్రారంభించి ఆదివాసీల హననాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ అభివృద్ధి జపాన్ని పాటిస్తున్నది. ఎప్పుడూ కూడా కార్పొరేట్ల పెట్టుబడిదార్ల అభివృద్ధి దేశ అభివృద్ధిగా పరిగణించబడదు. ప్రభుత్వాలు అభివృద్ధి జరగాలంటే ప్రజలు కొంత ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదని చెబుతున్నాయి. కానీ వాస్తవాచరణలో ఇవన్నీ ప్రజా వ్యతిరేక చర్యలే. ప్రధానంగా ఆదివాసుల జీవన విధ్వంస చర్యలేనన్నది గుర్తించాలి. దండకారణ్యంలో 70 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉండడం ఆదివాసీల నేరం కాదు కదా, దాన్ని వెలికి తీయాలంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యామ్నాయ విధానాలను ఆదివాసీలకు చేకూరుస్తూ ఆ వైపుగా ప్రభుత్వ విధానాలు కొనసాగాలి.
మధ్య భారతంలో నగ్జల్బరీ, తేబాగ, వాయిలార్ సాయుధ రైతాంగ పోరాటం, శ్రీకాకుళం, ఆదివాసులు గిరిజన సాయుధ, ప్రతిఘటనా పోరాటాలు కావచ్చు పాలకులు ఆదివాసుల వైపు దృష్టి సారించడానికి, కొన్ని చర్యలు తీసుకోవడానికి దోహదం చేశాయి. ఆదివాసుల హక్కులు, వారి సంక్షేమంకై పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మధ్యభారతంలో మావోయిస్టు ఆదివాసీ పోరాటాలు బలంగా కొనసాగుతున్నాయి. గత మూడున్నర దశాబ్దాలుగా మధ్యభారతాన్ని ప్రభుత్వాలు యుద్ధభూమిగా మార్చేశాయి. అనేక నిర్బంధ ఆపరేషన్ల తరువాత నేడు 2024 నుండి ఆపరేషన్ కగార్ పేరుతో పచ్చి హత్యాకాండను మోడీ అమిత్ షా ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. దేశంలో ఎమర్జెన్సీకి ముందు ఎమర్జెన్సీకి తరువాత ఏర్పడ్డ అన్ని హక్కుల సంఘాలు కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఎన్ కౌంటర్ సంఘటన పై నిజనిర్ధారణ చేసి ప్రజలకు సత్యాలు విప్పి చెప్పడానికి సత్యశోధనకై ఎంతో మంది ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఆపరేషన్ కగార్లోని ప్రత్యేకత ఏ హక్కుల సంఘానికి కూడా బస్తర్లో పర్యటించకుండా, నిజాలు బయటికి రాకుండా అణచివేతకు గురి చేసి నరసంహారాన్ని కొనసాగిస్తున్న స్థితి ఉన్నది. ఇప్పటి వరకు 70 ఎన్ కౌంటర్లలో 600 లకు పైగా మావోయిస్టుల ఆదివాసీల హత్యాకాండ కొనసాగించింది. కాని ఏ ఒక్క ఎన్ కౌంటర్ హత్యాకాండపై చత్తీస్ఘడ్లో ఏ హక్కుల సంఘం సత్యశోధన చేయలేకపోయింది. ఇది ప్రజాస్వామ్యంలో హక్కుల సంఘాల పరిస్థితి.
ఆదివాసీలు పోరాటాలు చేసి సాధించుకున్న ఆదివాసీలకు చెందిన 1996 పేసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, 5వ, 6వ షెడ్యుల్ల అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలు బీర్సా ముండా కాలం నుండి పోరాడి సాధించుకున్న ఆదివాసీ హక్కులన్నింటిని సవరణల పేరుతో బలహీన పరుస్తూ కొన్ని అయితే పూర్తిగా అమలుకు నోచుకోలేని స్థితిని కల్పిస్తున్నాయి. వాటి అమలు కోసం ఉద్యమిస్తే నక్సలైట్స్లో నిర్బంధాలకు గురి చేస్తూ కాల్చి చంపి ఎన్ కౌంటర్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 8 వేల మంది ఎన్ కౌంటర్ పేర హత్యగావించబడ్డాయి. ఏ ఎన్ కౌంటర్పై విచారణ జరగలేదు. ఉద్యమ రాష్ట్రాలలో పోలీసులే రాజకీయ నాయకుల పాత్రను పోషిస్తున్నారు.
నేడు జరుగుతున్న కగార్ యుద్ధం ఆగడంలేదు. పాలకుల యుద్ధనీతిలో మార్పులేదు. ఒక వైపు మావోయిస్టు పార్టీ 5 నెలలుగా 10 ప్రకటనలతో శాంతి చర్చల కోసం మేధావులతో, అఖిల భారత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో శాంతి కమిటీలను ఏర్పరచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చంపేస్తాం, నిర్మూలిస్తాం అనే భాషనే తప్ప ప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు. ఎప్పుడైనా సరే ఉ ద్యమాలు ఎంత బలంగా కొనసాగినా అందులో సామాజిక, రాజకీయ, సాంఘిక, న్యాయ అంశాలు లేకపోతే ఆ ఉద్యమాలు ఎక్కువ కాలం కొనసాగలేవు. ఇలా కొనసాగుతున్న ఉద్యమాలను కార్పొరేట్ల కోసం నిర్మూలించాలనుకోవడం మోడీ-అమిత్ల అప్రజాస్వామిక నియంతృత్వ విధానమే కొనసాగుతున్నది. శాంతి చర్చలకు మెజారిటీ ప్రజానీకం, అన్ని ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు జరపాలని | కోరుతున్నప్పటికి హత్యలకే ప్రాధాన్య ఇస్తున్నది. వెంటనే కాల్పుల విరమణను ప్రకటించి, శాంతి చర్చలు జరపద్వారా తన ప్రజాస్వామిక ఆచరణను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూళ్ళలోని నియమాలను పటిష్టంగా అమలు చేస్తే, ఆదివాసీల స్థితిగతులు, ఆయా ప్రాంతాలు ఆర్థిక సామాజిక అంశాల్లో, ఏదో ఒక మేరకు మెరుగుపడు తాయనడంలో రెండో మాటకు తావు లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కార్యచరణే గాడి తప్పింది. షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ స్థితిగతుల్ని సమీక్షించి, ప్రత్యేక చర్యలు చేపట్టే అధికారాలు గవర్నరుకు, రాష్ట్రపతికి ఉన్నాయి. కాని మోడీ ప్రభుత్వం గుప్పెట్లో పాలనా వ్యవస్థలన్ని బంధీ అయిపోయి ఉన్నాయి. ఆదివాసీలపై కగార్ హత్యాకాండకు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణ పాటించాలని అఖిల భారత స్థాయిలో ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మేము నిర్మూలిస్తాం అనే భాషతప్ప ఒక ప్రజాస్వామికమైన భాషను మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. వారి ఆచరణ అంతాకూడా నియంతృత్వ ఫాసిస్టు అప్రజస్వామిక విదానాలతో కొనసాగుతున్న ప్రజాస్వామిక విలువలు ఆదివాసీ చట్టాలు దళితుల ఆత్మ గౌరవ సమస్యలు, వారికి పోరాటాలుగా కనిపించి వాటిని అణచివేయడానికే ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి తప్ప శాంతి చర్చలతో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే | ప్రజాస్వామ్యం యొక్క కర్తవ్యంగా భావించడంలో విఫలమవుతున్నది. ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం శాంతి. చర్చలను కాల్పుల విరమణను ప్రకటించడం కోసం ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
డిమాండ్స్: 1) మధ్యభారతంలో ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం,
2) 1996 పేసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి,
3) బస్తర్లో ఏర్పాటు చేసిన వందలాది సాయుద బలగాల క్యాంపులను వెంటనే ఎత్తివేయాలి, ఆపరేషన్ కగారు వెంటనే ఆపివేయాలి,
4) శాంతి చర్చలను కొనసాగించాలి,
5) ఎన్ కౌంటర్ పేరుతో అణచివేస్తున్న ఆదివాసీల, ఉద్యమకారుల జీవించే హక్కును రక్షించాలి. కాల్పుల విరమణను ప్రకటించాలి.
సభ్య సంఘాలు : 1. పౌరహక్కుల సంఘం, 2. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ, 2. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ – (ఎస్.వి.), 3. అఖిల భారత కిసాన్ మజ్దూర్ సంఘ్, 4. తెలంగాణ రైతాంగ సమితి, 5. మానవ హక్కుల వేదిక 6. అమరుల బంధుమిత్రుల సంఘం 7. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, 8 తుడుందెబ్బ 9. తెలంగాణ అంబేడ్కర్ సంఘం 10. తెలంగాణ ప్రజాఫ్రంట్, 11. సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్, 12. సామాజిక తెలంగాణ ఫ్రంట్, 13. విస్థాపన్ విరోద్ జన వికాస్ ఆందోళన్ 14. దళిత్ లిబరేషన్ ఫ్రంట్ 15. కుల నిర్మూలన పోరాట సమితి
- చైతన్య మహిళా సంఘం 17. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్, 18. పిడిఎస్ యు, 19. పిడిఎస్ యు, 20. పిడిఎస్ యు 21. ప్రజా కళామండలి 22. అవామి మజ్లిస్ అమల్ 23. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 24. రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఒయు 25. గోండ్వాన సంఘర్షణ సమితి, 26. విరసం 27. ప్రొ. సమున్నత, 28. ఎబికెఎస్ఎస్, 29. లంబాడ హక్కుల పోరాట సమితి, 30. టిపిజాక్, 31. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, 32. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, 33. డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్, 34. నిర్బంధ వ్యతిరేక వేదిక, 35. దక్షిణ భారత రాజకీయ సమాఖ్య, 36. తెలంగాణ కార్మిక సంఘం, 37. తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య, 38. ఎస్.టి.ఎఫ్., 39. గిరిజన సామాజిక వేదిక, 40. ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ, 41. ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరమ్, 42. ప్రొ. కె. లక్ష్మీనారాయణ, 43. ప్రొ. జి. విజయ్, 44. ప్రొ. వాగేషన్, 45. నందిగం కృష్ణారావ్, 46. తెలంగాణ విద్యావంతుల వేదిక, 47. లతీఫ్ మహమ్మద్ ఖాన్, 48. రచన ముద్రబోయిన, 49. తాషి చోడప్, 50. సి.పి.ఐ.ఎం.ఎల్. 51. గిరిజన హక్కుల సంఘం. 52. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసి (చంద్రన్న)
తేది: 20-08-2025
ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక