గత కొన్ని రోజులుగా యూరప్‌లో చేసిన కార్యకలాపాల వివరాలు:
భారతదేశంలో ప్రజా యుద్ధానికి మద్దతుగా ఆగస్టు 15 సాయంత్రం డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో కమ్యూనిస్ట్ యూత్ అండ్ యాంటీ-ఇంపీరియలిస్ట్ యాక్షన్ చలనచిత్ర ప్రదర్శనను, కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమం భారతదేశంలో జరుగుతున్న ప్రజాయుద్ధ చరిత్ర, నూతన ప్రజాస్వామిక విప్లవ ప్రాథమిక సూత్రాల ప్రదర్శనతో ప్రారంభమైంది. తరువాత “ఇండియాస్ రెడ్ టైడ్” సినిమా ప్రదర్శన, ఆపరేషన్ కగార్‌పైన ప్రదర్శన జరిగింది. మాస పత్రికగా డెన్మార్క్‌లో ప్రచురితమవుతున్న విప్లవ వార్తా పత్రిక అర్బెజ్‌డెర్‌పోస్టెన్ సంచికలలో వచ్చిన వ్యాసాల వివరాలు గల కరపత్రాలతో పాటు, భారతదేశంలో జరుగుతున్న ప్రజాయుద్ధంపైన కూడా కరపత్రాలను పంపిణీ చేసారు:
వియన్నా, సెయింట్ పోల్టెన్, లింజ్, ఇన్స్‌బ్రక్ నగరాల్లో జరిగిన అనేక కార్యక్రమాల గురించి ఆస్ట్రియా నుండి డై రోట్ ఫాహ్నే రిపోర్టును ఇచ్చింది.


రాజధాని వియన్నాలో కార్యక్రమం
రాజధాని వియన్నాలో, కామ్రేడ్ బసవరాజ్ స్మరణలోనూ సిపిఐ (మావోయిస్ట్)కు, ప్రజా యుద్ధానికి అభినందనలు తెలియచేయడానికి ఒక కార్యక్రమం జరిగింది. నగర వీధుల్లో పాలస్తీనాపై సమాచార పట్టికను ప్రదర్శించారు.


అనేక నగరాల్లో పదుల సంఖ్యలో గ్రాఫిటీలు, కుడ్యచిత్రాలు చేశారు. ఈ కుడ్యచిత్రాలలో పాలస్తీనాకు, భారతదేశంలో ప్రజాయుద్ధానికి మద్దతుగా నినాదాలు రాసారు.







స్పెయిన్ లోని బిల్బావో, ఎల్చేలలో గ్రాఫిటీలు, పోస్టర్లు, స్టిక్కర్లు వేసారు. బిల్బావోలో, “భారతదేశంలో ప్రజా యుద్ధం వర్థిల్లాలి! ” అనే నినాదాన్ని బాస్క్ భాషలో చిత్రీకరించారు.
ఫిన్‌లాండ్ లోని హెల్సింకి లో చేసిన కుడ్యచిత్రం గురించి పునలిప్పు రిపోర్టు చేసింది.