Menu

మీ వేళ్లతో మీ రక్తబంధువుల కళ్లను పొడవకండి – ఆదివాసీ పోలీసులకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి

anadmin 2 weeks ago 0 353

డీ.ఆర్.జీ., బస్తర్ ఫైటర్స్, దంతేశ్వరీ టైగర్స్, ఎస్.టి.ఎఫ్. వంటి బలగాల్లో, కేంద్ర పారామిలిటరీ, కమాండో బలగాల్లో ఆదివాసీ పోలీసులారా! మీ వేళ్లతో మీ రక్తబంధువుల కళ్లను పొడవకండి! మీ జాతి అస్తిత్వాన్ని రూపుమాపే
ఆపరేషన్ కగార్ హత్యాకాండల్లో మీరు భాగం కాకండి!

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు మోదీ-అమిత్ షా-విష్ణుదేవ్ సాయి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బస్తర్ లో ఆదివాసులపై సాగిస్తున్న జాతి నిర్మూలనా యుద్ధం ఆదివాసుల జాతిని చిన్నాభిన్నం చేసి, కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీలు పరిచేందుకే!

పీడిత వర్గాలకు చెందిన పోలీసు మిత్రులారా!
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు మోదీ-అమిత్ షా ల నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ఉద్యమాన్ని, మీ ఆదివాసీ రక్తబంధువుల అస్తిత్వాన్ని రూపుమాపే జాతి నిర్మూలనా యుద్ధాన్ని- ‘అంతిమ యుద్ధాన్ని’ కొనసాగిస్తున్నది. ఇందుకోసం వేలాది డీ.ఆర్.జీ., బస్తర్ ఫైటర్స్, దంతేశ్వరీ టైగర్స్, ఎస్.టీ.ఎఫ్. వంటి స్థానిక బలగాలను ముందుంచి, కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించి, వందలాది పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసింది. మొబైల్ టవర్లు, రోడ్లు, రైలు మార్గాలు, వంతెనలు నిర్మించింది. మీ ఆదివాసీ రక్తబంధువులనే ఇన్ఫార్మర్లుగా, కోవర్టులుగా, విప్లవ ద్రోహులుగా మార్చి రహస్య నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. దండకారణ్యాన్ని దిగ్బంధించింది. నేడు బస్తర్ లో ప్రభుత్వ సాయుధ బలగాల పాశవిక హత్యాకాండల్లో మీ ఆదివాసీ రక్తబంధువుల నెత్తురు వరదలా పారుతోంది. ‘లో
ప్రభుత్వ ఆదేశాలతో మీరు మీ చేతులతోనే మీ తల్లిదండ్రుల, అన్నదమ్ముల ఆస్తులను, పంటలను ధ్వంసం చేస్తున్నారు. వారు ఎవరు కనపడినా కాల్చి చంపుతున్నారు. మీ తల్లులపై, అక్క-చెల్లెళ్లపై అత్యాచారం/సామూహిక అత్యాచారం చేసి కాల్చిచంపుతున్నారు. మీ తోబుట్టువులను, బంధువులను పోలీసు బలగాలకు గైడ్లును, ఇన్ఫార్మర్లును తయారు చేయడంలో, డీ.ఆర్.జీ. వంటి బలగాల్లో చేర్పించడంలో మీరే ముందుంటున్నారు. మిమ్మల్ని ముందుభాగాన మోహరించి మీ ఆదివాసీ ప్రజలపై హత్యాకాండలు చేయిస్తున్నారు. మీ వేళ్లతోనే మీ రక్తబంధువుల కళ్లను పొడుస్తున్నారు. ఆదివాసులను ఎస్.పీ.ఓ.లుగా మార్చుకుని, తమ ఆదివాసులపై తామే దాడులు చేసి మారుణకాండ సృష్టించడం భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధమని, ఎస్.పీ.ఓ.ల నియమాకం చట్టపరంగా చెల్లదని, సల్వాజుడుంను, ఎస్.పీ.ఓ. వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టు 2009లోనే స్పష్టంగా తీర్పు వెలువరించినప్పటికీ కోయ కమాండోలు, బస్తరియా బెటాలియన్, డీ.ఆర్.జీ., బస్తర్ ఫైటర్స్, దంతేశ్వరీ ఫైటర్స్, చివరికి భారతసైన్యం లోకి కూడా ఆదివాసులను భర్తీ చేసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తీర్పుని బహిరంగంగా ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. గెరిల్లాను గెరిల్లాగా ఎదుర్కోవాలనే అమెరికా సామ్రాజ్యవాదుల ఎల్.ఐ.సీ. నీతికి కొనసాగింపుగానే ఆదివాసులను ఆదివాసులతోనే ఎదుర్కోవాలనే నీతిని అవి అమలు చేస్తున్నాయి. ఈ వాస్తవాన్ని మీరు గుర్తించండి.
ఎన్ కౌంటర్లన్నీ క్రూరమైన హత్యాకాండలేనని మీకు తెలుసు. మీరే అందుకు ప్రత్యక్ష సాక్షులు. ఇది ఏ రకమైన న్యాయం? ఈ అత్యాచారాలను, హత్యలను ఏ చట్టం కింద మోదీ-అమిత్ షా ముఠా సాగిస్తోంది? భారతదేశంలో కేంద్రంలో గానీ, దండకారణ్యం విస్తరించి వున్న ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గానీ అసలు రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలు ఉన్నాయా, దేశంలో చట్టబద్ధ పాలనా ఉన్నదా? ఆపరేషన్ కగార్ లో ఇప్పటి వరకు 376 మంది మావోయిస్టులను నిర్మూలించామని హోంమంత్రి అమిత్ షా నిసిగ్గుగా ప్రకటించాడు. ఈ హత్యాకాండలను సాయుధంగా ప్రతిఘటించడం ద్వారా జీవించే హక్కు, ఆదివాసీ ప్రజల అస్తిత్వాన్ని కాపాడే హక్కు మీ తోడ బుట్టిన ఆదివాసీ విప్లవకారులకు లేదా? ఆయుధాలు పట్టుకున్న విప్లవకారులను పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపే అధికారం, నిరాయుధులుగా వున్నవారిని పట్టుకుని కాల్చిచంపే అధికారం, మీ తల్లులు, అక్క-చెల్లెళ్లపై మీ ద్వారానే అత్యాచారాలు చేయించే అధికారం మోదీ-అమిత్ షా ముఠాకు ఏ చట్టం ఇచ్చింది? ఈ ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వలేరు. కానీ ఏదోక ఒక రోజు మీ రక్తబంధువులు మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతారని గుర్తుంచుకోండి.
దేశ అభివృద్ధికి, ఆదివాసుల అభివృద్ధికి మావోయిస్టులు ఆటంకంగా వున్నారనే పేరుతో ఈ హత్యాకాండలను మోదీ-అమిత్ షా లు సమర్థించుకోజూస్తున్నారు. అభివృద్ధి అంటే బహుళజాతి కంపెనీల, అదానీ, అంబానీ వంటి మన దేశ దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, భూస్వాముల అభివృద్ధేనా? “వికసిత్ భారత్” లక్ష్యం వీరిని బిలియనీర్లుగా అభివృద్ధి చేయడమేనా? దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న పేదరికానికీ, నిరుద్యోగానికీ, మహిళలపై, ముస్లిములపై, దళితులపై, ఆదివాసులపై మత పరమైన, కులపరమైన ఘర్షణలకు మావోయిస్టులే కారణమా? నిజానికి మోదీ అనుసరించే సామ్రాజ్యవాద, వారి దళారీ అనుకూల, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాల ఫలితంగానే దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆదివాసుల విస్థాపన, కుల-మత ఘర్షణలు, ముస్లిములపై, దళితులపై, ఆదివాసులపై సంఘ్ పరివార్ శక్తుల పాశవిక గుంపు హత్యలు, మహిళలపై అత్యాచారాలు, కశ్మీర్, మణిపుర్ వంటి పీడిత జాతులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి.
మోదీ-అమిత్ షా ముఠా దేశాన్ని “వికసిత్ భారత్”గా మార్చే పేరుతో సామ్రాజ్యవాదుల, వారి దళారీల బందిపోటు దోపిడీకి బలి చేసేందుకు, దేశంలో ఇతర మతాల ప్రజలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. చట్టసభలను, న్యాయ వ్యవస్థను, ప్రభుత్వ యంత్రాంగాన్ని బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో దాదాపు నింపివేసింది. అదే భావజాలంతో దేశ ప్రజలను మత ప్రాతిపదికపై నిలువునా చీల్చి, వారి మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నది. ఏ బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలమైతే పీడిత ప్రజలను అత్యంత వెనకబాటుతనానికి గురి చేసిందో, వారిని ఆ భావజాలపు పట్టులోకి తెచ్చుకోవడం ద్వారా వారు తమ సమస్యలపై పోరాడకుండా చేయడం, వారిని నుంచి ఓటు బ్యాంకును రాబట్టుకోవడం అత్యంత విరోధభాసమైన అంశం. ఈ క్రమంలో బీజేపీ అనేక పీడిత సామాజిక సెక్షన్ల కొద్ది మంది ముఖ్యమైన నాయకత్వ శక్తులను అవినీతికి గురి చేయడం ద్వారా, ముస్లిం మైనారిటీలను

ఒక మూలకు నెట్టివేయడం ద్వారా ఒకదాని వెంట మరొకటిగా జరిగిన ఎన్నికల్లో అనేక విజయాలు సాధించింది. ఇలా బీజేపీ సాధించిన మంద బలంతోనే దేశాన్ని సామ్రాజ్యవాద, దళారీ పెట్టుబడిదారీ, భూస్వామ్య దోపిడీ దొంగలకు అప్పగించింది.
మోదీ పాలనలో సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు ప్రతీ సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు దోచుకుపోతున్నాయి. దేశం బిలియనీర్ల రాజ్యంగా మారింది. 80 కోట్లకు పైగా నిరుపేద ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వ రేషన్ బియ్యంతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ఆకలి సూచిలో మన దేశం 105వ స్థానంలో ఉంది. దేశ అప్పులు పెరిగిపోయాయి. రూపాయి విలువ ఘోరంగా పడిపోయింది. సామ్రాజ్యవాద దాడితో లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఇలా భారతదేశంలో ప్రతి రంగాన్ని దోపిడీ వర్గాలు దోచుకుతింటున్నాయి. దీంతో నేడు “భారతమాత సర్వం కోల్పోతూ నగ్నంగా నిలబడి” ఉండగా, ఈ దోపిడీ, పీడన, అణచివేతలను ప్రశ్నించే, ప్రతిఘటించే వారందరిపై మీ పోలీసు బలగాలు, హిందుత్వ ఫాసిస్టు సంఘ పరివార్ శక్తులు హత్యాకాండలు సాగిస్తూ “భారతమాతకు జై”, “జై శ్రీరాం” అంటూ నినాదాలు ఇస్తున్నాయి. ఒకవైపు “భారతమాతను వివస్త్రను చేసి, మరోవైపు మీ చేత “భారతమాతకు జై” అనిపించడం మోదీ-షా ముఠా హిందుత్వ ఫాసిస్టు రాజనీతి తప్ప మరొకటి కాదని అర్థం చేసుకోండి. ఈ హిందుత్వ శక్తులు కుల వ్యవస్థను అమలు చేసే ప్రమాదకరమైన ఎజెండాతో “వికసిత్ భారత్” పేరుతో దేశాన్ని హిందు రాజ్యంగా మారుస్తున్నాయి. ఏ మతానికి సంబంధంలేని ఆదివాసీ జాతిని హిందూ మతంలో భాగం చేసి, మీ జాతిని కులవ్యవస్థలో కింది మెట్టుకు దిగజార్చాలని చూస్తున్నాయి. మోదీ-షా ముఠా ప్రజా వ్యతిరేక విధానాలు, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు దేశంలో కోట్లాది ప్రజలను భూమి, కూడు-గూడు-గుడ్డల నుంచి మాత్రమే కాకుండా విద్య, వైద్యం, న్యాయం సైతం ప్రజల్ని వంచితులను చేస్తున్నాయి. హిందూ రాజ్యం స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాలకు మాత్రమే కాకుండా దేశ ఐక్యతకు కూడా అత్యంత ప్రమాదకరమైంది. అందువల్ల హిందు రాజ్య స్థాపనను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మీరు గుర్తించండి.
ఒక ప్రజా సముదాయం – వారు ఆదివాసులు కావచ్చు, ఏ పీడిత సామాజిక సముదాయానికి చెందినవారైనా కావచ్చు – దోపిడీ, పీడన, అణచివేత, వివక్షలకు గురైనప్పుడు, వారి భద్రత, స్వేచ్ఛ, విద్య-వైద్యం, ఆత్మగౌరవం, చివరికి వారి జీవితాలు ధ్వంసమైపోతున్నప్పుడు తిరగబడి ప్రతిఘటించే హక్కు వారి జన్మహక్కు. వారి ప్రతిఘటన ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఈ న్యాయమైన ప్రతిఘటనను నెత్తుటి ఏరుల్లో ముంచెత్తే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. జల్-జంగల్-జమీన్-ఇజ్జత్-అధికార్ కోసం మీ రక్తబంధువులైన ఆదివాసులు సాగిస్తున్న ఈ న్యాయమైన ప్రతిఘటనా యుద్ధాన్ని అర్థం చేసుకోండి, దానికి మద్దతునీయండి. మీ ఆదివాసీ జాతి అస్తిత్వాన్ని రూపుమాపే ఆపరేషన్ కగార్ హత్యాకాండలో పాలు పంచుకోవడం ఇక నుంచైనా ఆపండి. మీ తుపాకులను ఫాసిస్టు మోదీ-అమిత్ షా ముఠాపై ఎక్కుపెట్టండి. అప్పుడు మీ రక్తబంధువులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, క్షమిస్తారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించడం సరైంది కాదని సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ మీకు విజ్ఞప్తి చేస్తోంది.

కేంద్ర కమిటీ,
భాకపా (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad