ఈ రోజు 2024 నవంబర్ 11 నాడు బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్ మూల్‌వాసీ బచావో మంచ్ కి చెందిన మేము ప్రజల పక్షం వహించే మేధావులు, లాయర్లు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.
2024 నవంబర్ 8 వతేదీ నాడు జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో సాధారణ గ్రామస్తుడు జోగా కుంజామ్ మరణించాడు. రేఖా పల్లి గ్రామ పంచాయతి నివాసి అయిన జోగా కుంజామ్ తన పొలం పనికి ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్ళాడు. అప్పుడే బీజాపూర్ నుంచి ఎస్‌టిఎఫ్, సిఆర్‌పిఎఫ్, డిఆర్‌జి, బస్తర్ ఫైటర్స్, కోబ్రా సైనికులు నక్సలైట్ ఆపరేషన్ పేరు మీద వెళ్ళి జోగా కుంజామ్ ను చంపి తీసుకువచ్చారు. అతను నక్సలైటు కాదు. ఆ కామ్రేడ్ జైలుకు వెళ్ళి వచ్చి ఒక సంవత్సరం పూర్తి కాలేదు. పెళ్లి అయింది. భార్య పేరు శ్రీమతి భీమే కుంజామ్, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు వున్నారు. అతని తల్లి హుర్టే కుంజామ్, తండ్రి లింగా కుంజామ్. జోగా కుంజామ్‌కు నలుగురు అన్నదమ్ములు వున్నారు.
ఇలా ప్రతీ రోజూ పోలీసులు మా ఆదివాసీ అన్నదమ్ములను చంపడాన్ని ఎంత కాలం చూస్తూ ఊరుకోవాలి?
జోగా కుంజామ్ హత్యపై న్యాయ విచారణను వీలైనంత త్వరగా జరపాలి. నష్టపరిహారాన్ని యివ్వాలి.
అమరుడి కుటుంబానికి ఒక కోటి రూపాయలు నష్టపరిహారాన్ని యివ్వాలి. అందుకోసం మేం తీవ్ర ఆందోళన చేపడతాం.
దేశ ప్రజలందరూ మాకు మద్దతుగా నిలబడాలని బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్ మూల్‌వాసీ బచావో మంచ్ తరఫున అప్పీల్ చేస్తున్నాం.
మీ అందరికీ భూమ్ కాల్ జోహార్
-వినీత్
మూల్‌వాసీ బచావో మంచ్,
ఉసూర్ బ్లాక్,
బీజాపూర్ జిల్లా,
ఛత్తీస్‌ఘడ్

నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
Surrender Does Not Guarantee Freedom: The Story of Maoist Leader Dunna Keshava Rao alias Azad
మీ వేళ్లతో మీ రక్తబంధువుల కళ్లను పొడవకండి – ఆదివాసీ పోలీసులకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం
5 రాష్ట్రాల బంద్ – మావోయిస్టు పార్టీ పిలుపు 