మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు మాడేరుమిల్లిలో జరిగిన మావోయిస్టు నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్, అంతకంటే ముందు జరిగిన ఎన్‌కౌంటర్లు మొత్తం ఫేక్ అని కూనంనేని ఆరోపించారు. బూటకపు ఎన్ కౌంటర్లతో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టబద్ధంగా విచారణ జరిపించాలని కూనంనేని అన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్రమాలు
మహాన్ భూంకాల్ నుంచి మావోయిస్టు విప్లవం దాకా – పాణి
Comrade Thota Seetharamaiah – An Unsung Hero of the Indian Revolution
కామ్రేడ్ తోట సీతారామయ్య – భారత విప్లవంలో ఓ అన్సంగ్ హీరో!
Global Solidarity Call to EndState Militarization and Extrajudicial Killings in Resource-RichAdivasi Regions in India
హిడ్మాను పట్టించింది ఆ నలుగురే – మావోయిస్టు పార్టీ ప్రకటన 