Menu

పాట్నా జైలు నుంచి తోటి జర్నలిస్టులకు జర్నలిస్ట్ రూపేష్ విజ్ఞప్తి

anadmin 3 months ago 0 114

డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్న సహోద్యోగులకు మరియు మీడియా సహోద్యోగులకు జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్ విజ్ఞప్తి —-

కామ్రేడ్స్, డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు, ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దాడి పెరిగింది. పాలస్తీనాలో ప్రతిరోజూ జనసమూహంపై అమెరికా, ఇజ్రాయెల్ మానవ హక్కులను కాలరాస్తోంది. ఉక్రెయిన్‌లో రష్యా కూడా అదే చేస్తోంది. నేడు ప్రపంచంలో మానవ హక్కులు ఉల్లంఘించబడని దేశం లేదని మనం చెప్పగలం. మానవ హక్కుల హననానికి వ్యతిరేకంగా పోరాటాలు లేవు.

మన దేశంలో ప్రతిరోజూ వేలాది మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు జరుగుతున్నాయి. మానవ హక్కుల కోసం గొంతు లేపుతున్న వారిని జైలులో పెట్టి నకిలీ ఎన్‌కౌంటర్లలో చంపుతున్నారు, కాబట్టి ఎవరూ మానవ హక్కుల కోసం గొంతు లేపడానికి ధైర్యం చేయడం లేదు.

నేను జూలై 17, 2022న అరెస్టై జూలై 18, 2022 నుండి జైలులో ఉన్నాను. నా సుదీర్ఘ జైలు జీవితంలో నేను గమనిస్తున్న దాన్ని బట్టి జైళ్లలో అత్యధిక మానవ హక్కుల హననం సంఘటనలు జరుగుతున్నాయని నేను చెప్పగలను. నేను ఇప్పటివరకు జార్ఖండ్, బీహార్‌లోని ఆరు జైళ్లలో ఉన్నాను. అక్కడ ఖైదీలకు జైలు మాన్యువల్ డైట్ లేదా ఇతర సౌకర్యాల ప్రకారం ఆహారం లభించడం లేదు. జైళ్లలో దారుణమైన‌ హెల్త్ సిస్టమ్ కారణంగా చాలా మంది ఖైదీలు అకాల మరణానికి గురవుతున్నారు, చాలామంది వికలాంగులు అవుతున్నారు. జైళ్లలో సామర్థ్యం కన్నా రెట్టింపు ఖైదీలను ఉంచడం వల్ల, జీవించడం, నిద్రపోవడం, స్నానం చేయడం మొదలైన వాటిలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జైలు అధికారులు జైలులో ఖైదీలపై కర్రలు జుళిపించడం, ఖైదీలతో దుర్భాషలాడడం జైలు అధికారులు వారి జన్మ హక్కుగా భావిస్తారు. అవినీతి, లంచం జైలు పరిపాలన అధికారుల నరనరాల్లో ఉన్నాయి. ఈ నరక జైలు వ్యవస్థకు వ్యతిరేకంగా ఎవరైనా ఖైదీ స్వరం పెంచితే వారిని ఇతర జైళ్లకు పంపుతారు. జైలు గేటు వద్ద వందలాది కర్రలు ఖైదీల శరీరాల మీద నాట్యం చేశ్తాయి.

కాబట్టి ఖైదీగా నేను రాబోయే డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సహోద్యోగులందరినీ మీ కార్యక్రమాలలో మా ఖైదీల గురించి స్వరం వినిపించమని అభ్యర్థిస్తున్నాను.
రూపేష్ కుమార్ సింగ్ (జర్నలిస్ట్)
హై సెక్యూరిటీ సెల్

విచారణ ఖైదీ
ఆదర్శ్ సెంట్రల్ జైలు బ్యూర్, పాట్నా.

(Ipsa Shatakshi ఫేస్ బుక్ నుండి)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad