తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు. కేరళలో విప్లవ ప్రజాసంఘాల కార్యకర్త. కేరళ సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు రూపేష్, షైనా దంపతుల కూతురు. తల్లితండ్రులిద్దరూ విప్లవకార్యాచరణలో అఙాతంలో ఉంటే.. ఆమె , చెల్లెలితో కలిసి అమ్మమ్మ దగ్గర పెరిగింది. విప్లవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. కేరళలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో ముందు భాగాన నిలబడింది.

2015 లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ పోలీసులు దాడి చేసి రూపేష్, షైనాలను అరెస్టు చేశారు అప్పటినుండి జైల్లో ఉన్న వాళ్ళిదరిపై ఇప్పటి వరకూ ఏకేసూ నిరూపణ కాలేదు. అయితే మళయాళం డైరెక్టర్ లియో జోస్ నిర్మించిన అంగమలై డైరీస్ అనే సినిమాలో మావోయిస్టు పార్టీ నాయకురాలు షైనాను క్రిమినల్ గా చూయించారు. షైనా ఫోటోను చూయించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమి ఆ డైరెక్టర్ పై పోరాటానికి దిగింది.

ఆ సినిమాలో ఓ పోలీస్ స్టేషన్ లో విలన్ ల ఫోటోల పక్కన షైనా ఫోటోను ఉంచి మోస్ట్ వాంటెడ్ అని చూయించారు. ఈ సినిమా మొత్తంలో ఇలా మూడు సార్లు చూయించారని అమి తన ఫేస్ బుక్ లో వాపోయింది. తన తల్లి తన జీవితాన్నంతా పేదప్రజల కోసం కమ్యూనిస్టు విప్లవం కోస‍ం ధారపోసిందని అలాంటి ఆమెను ఆ సినిమా డైరెక్టర్ ఈ విధంగా చూయించడం అన్యాయమని ఆమె అభిప్రాయపడింది. ఆమెపై 20 కేసులున్నాయని అయితే ఆమె ఈ దోపిడి వ్యవస్థను కూలదోసి సమసమాజం స్థాపించేందుకు పోరాడిందని అమిరూప్ గుర్తు చేసింది. కోర్టు కూడా షైనాను ఇప్పటి వరకు నిందితురాలిగానే చూస్తుందని, ఆమెపై ఏ నేరమూ నిరూపణ కాలేదని అటువంటప్పుడు కామ్రేడ్ షైనాను క్రిమినల్ అని ఎలా అంటారని అమి ప్రశ్నించింది.

ఈ విషయంపై అంగమలై డైరీస్ డైరెక్టర్ లియో జోస్ కు అమిరూప్ లాయర్ లైజూ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లో ఆ సినిమాలోని షైనాను క్రిమినల్ గా చూయించిన భాగాలను తొలిగించాలని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. సినిమా డైరెక్టర్ తాను చేసిన పనికి క్షమాపణ చెప్పాలని అమిరూప్ షైనా డిమాడ్ చేసింది. దీనిపై లీగల్ గానే కాకుండా ఆందోలణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని అమి స్పష్టం చేసింది.

Keywords : kerala, amiroop, shyna, maoists, police, film, Angamaly Diaries, Director Lijo Jose Pallisery
(2024-04-14 17:50:25)



No. of visitors : 4976

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తన