నిత్య‌ పోలీసు దాడుల నడుమ మావోయిస్టుల నాయకత్వంలో సాగుతున్న భూపోరాటాల జైత్ర యాత్ర‌


నిత్య‌ పోలీసు దాడుల నడుమ మావోయిస్టుల నాయకత్వంలో సాగుతున్న భూపోరాటాల జైత్ర యాత్ర‌

నిత్య‌

గ్రామాలపై పోలీసుల దాడులు... ఎన్ కౌంటర్ హత్యలు.... ఏవోబీలో ఒక వైపు పోలీసులు ప్రతి చెట్టును, పుట్టను తమ తుపాకులతో జల్లెడ పడుతూ భయోత్పాతం సృష్టిస్తుండగానే... మరో వైపు ప్రజలు భూపోరాటాలు, అమరుల సంస్మరణ సభలు జరుపుకుంటూ తమ పోరాట పటిమను తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ఒడిశా లోని రాయగడ జిల్లాల సరిహద్దుల్లో పెద్దఎత్తున మోహరించిన‌ పోలీసు బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక మావోయిస్టు పార్టీ కార్యకర్త చనిపోగా మరో ఇద్దరు ఆదివాసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అధికారులు మరింత పోలీసు బలగాలను మోహరించారు. అయినప్పటికీ పార్వతీ పురం, కొమురాడ మండలాలకు సమీపంలోని కుంభారిపట్టు, కత్తుల పేట , అలమండ ప్రాంతంలో భూస్వాములైన షావుకార్ల భూముల్లో ప్రజలు ఎర్రజెండాలు పాతారు. గతంలో ప్రజల పరమైన ఈ భూములను పోలీసుల సహకారంతో షావుకార్లు తిరిగి ఆక్రమించుకున్నారని, వాళ్ళు ఆక్రమించుకున్న ఇంతకాలానికి షావుకార్లు ప్రజలకు లీజు చెల్లించి ఆ భూములను వదిలి వేయక పోతే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని సీపీఐ మావోయిస్టు పార్టీ శ్రీకాకుళ‍ం కోరాపూట్ డివిజన్ కమిటీ హెచ్చరించింది. ఆ మేరకు అనేక ప్రాంతాల్లో బ్యానర్లు , పోస్టర్లు అంటించారు. మరో వైపు ఈ భూపోరాటాలను విజయవంత చేయడం కోసం అలమండ, కుంభారిపట్టు, కత్తుల పేట లలో బహిరంగ సభలు నిర్వహించారు.

Keywords : maoists, AOB, Adivasi, odisha, vizianagaram, police, fake encounters
(2018-07-21 11:48:42)



No. of visitors : 1085

Suggested Posts


అక్టోబ‌రు దాడి త‌ర్వాత‌... AOBలో ఏం జ‌రుగుతోంది...?

ʹʹ వాళ్లు మా ప్ర‌భుత్వంపై దాడి చేశారు. అయితే శాశ్వ‌తంగా వారు న‌ష్టం క‌లిగించ‌లేరు. ఈ రోజు కను చూపు మేర‌లో కూడా పోలీసుల జాడ లేదు. మ‌ళ్లీ మా పార్టీ పూర్తిస్థాయిలో వ‌చ్చేసిందిʹʹ అని చెప్పాడు దోమ్రు....

పితృస్వామ్యంపై విల్లెత్తిన‌ విప్లవ మహిళ ‍- భారీ బహిరంగ సభ‌

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ముంచింగుపుట్టు ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా , మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ...

కామ్రేడ్... నీ నెత్తిటి బాకీ తీర్చుకుంటాం... గర్జించిన వేల గొంతులు

వార్త తెలుసుకున్న వందలాది గ్రామాలనుండి వేలాది మంది ఆదివాసులు ఆదివారం రాత్రి నుండే కొండెముల గ్రామానికి రావడం మొదలుపెట్టారు. సోమవారం ఉదయానికే ఆ గ్రామం ఎర్రజెండాలు చేబూనిన వేలాదిమందితో నిండిపోయింది. తమ ప్రియతమ నాయకుడి భౌతిక కాయాన్ని చూసిన ప్రజలు బోరుమంటు విలపించారు....

కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌

అదిగో ఆ ఎర్ర గోంగూర చెట్టుందే అదే విప్లవ యువ కిశోరం మున్నా శత్రు సేనలతో వీరోచితంగా పోరాడుతూ తన రక్తంతో ఎరుపెక్కించిన నేల. ఆ చోటంతా ఎర్ర గోంగూర మొక్కలతో అచ్చం ఎర్రపూల వనంలా విరబూసింది. ఆ జారుడు మట్టిదారి మన ప్రియతమ మహిళా నాయకురాలు భారతక్క తూటాల గాయాలతో పైకి ఎక్కలేక జారిపడ్డ బాట. ఆ కొండమలుపులోనే మిలిటరీ దిగ్గజం యాదన్న మరో తరాన్ని కాపాడడానికి శత్రు మోర్టార్

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


నిత్య‌