include 'men';
?>
సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?
కాశ్మీర్ లో యువకులు భద్రతా దళాలపై రాళ్ళు విసిరే , కాళ్ళతో తన్నుతున్న వీడియోలు అయ్యాయి. ఆ సంఘటన ఖచ్చితంగా ఖండిద్దాం. అయితే దాన్ని మాత్రమే ఖండించి ఈ దేశ ప్రజలపై సైన్యం పోలీసులు చేస్తున్న అరాచకాలను చూడకుండా వదిలేయడమే దేశ భక్తి అనిపించుకోదు కదా ! ఈ వీడియోలను చూసి సోషల్ మీడియాలో కాశ్మీరీ ప్రజలపై దాడి చేసిన దేశభక్తిని ఒలక బోసిన రాజకీయులు, గంభీర్ లాంటి క్రికెటర్లు , కాశాయ ʹదేశభక్తులుʹ అదే సైన్యం కాశ్మీరీలపై , ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై, దండకారణ్యం ఆదివాసులపై, న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న ఈ దేశ పేద ప్రజలపై చేస్తున్న దుర్మార్గ దాడుల పట్ల కనీస చలనం లేకుండా ఉండటం దేశ భక్తి అనాల్నా ? దేశమంటే గోవులు... మతోన్మాదం... కాశాయ డ్రస్సులు... పక్క దేశం పై పగ.... ఇవి కాకుండా దేశమంటే ఈ దేశ ప్రజలని... ఈ దేశాన్ని నిర్మించిన కోట్లాది ఆదివాసులు, దళితులు, బహుజనులు, మైనార్టీలు, స్త్రీలు అని నమ్మే వాళ్ళు... దేశభక్తి అంటే ఆ ప్రజలందరినీ ప్రేమించడం వాళ్ళ కోసం నిలబడటం అని నమ్మేవాళ్ళు మాత్రం ఇది చదవండి...
26 ఏండ్ల ఫరూఖ్ అహ్మద్ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ...అంటూ కేకలు పెట్టారు
ఆ వీడియోను జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే..సైనికులు 26 ఏండ్ల ఫరూఖ్ అహ్మద్ థర్ అనే యువకున్ని బంధించి పలు గ్రామాల్లో తిప్పారు. ఫరూఖ్ ఉగ్రవాది కాబట్టి సైనికులు అలా చేశారనుకుంటే పొరపాటే. అతను నిరుపేద కుటుంబానికి చెందినవాడు. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి అతనిది. ఫరూఖ్ తన గోడును ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మీడియా సంస్థతో వెలిబుచ్చాడు. ʹమా దగ్గరి బంధువు ఒకరు మృతిచెందగా, అతని అంతిమ యాత్రలో పాల్గొనేందుకు పొరుగు గ్రామానికి బయలుదేరాను. ఆ సమయంలో కొంతమంది సైనికులు తారసపడ్డారు. వెంటనే నాపై దాడి చేశారు. అనంతరం తాళ్లతో బంధించి జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. ఆ తర్వాత సీఆర్పీఎఫ్ క్యాంప్ వైపునకు జీపును తీసుకెళ్లారు. జీపు నుంచి కిందికి దించిన అనంతరం నన్ను సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో కూర్చోబెట్టారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ...అంటూ కేకలు పెట్టారుʹ అని ఫరూఖ్ అన్నారు. ఈ ఘటన తర్వాత భయబ్రాంతులకు గురైనట్టు ఫరూఖ్, అతని తల్లి మీడియాతో చెప్పారు. ʹమేం నిరుపేదలం...ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశం గానీ, ధైర్యం కానీ మాకు లేదుʹ అని అన్నారు.
Keywords : kashmir, hindutva, rss, army, attack, abdulla, jammu
(2024-03-09 03:28:35)
No. of visitors : 2556
Suggested Posts
| పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటుపాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి..... |
| మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలుభద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో.... |
| అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామాఅతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు.... |
| మానసిక సమస్యలతో కశ్మీర్ ప్రజలు - నిండిపోతున్న ఆసుపత్రులుప్రజలు మానసిక జబ్బుల భారిన పడుతున్నారు. మతిస్తిమితం కోల్పోవడం, తీవ్ర ఆందోళనకు గురవ్వడం, విపరీతంగా భయాందోళనలతో రోధిస్తూ పలువురు అపస్మారక స్తితికి చేరుకుంటున్నారు. గడిచిన 12 రోజుల్లో... మానసిక సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని SHMS ఆసుపత్రి వైద్యులు |
| కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి.. కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది. |
| కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే. |
| పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్పీఎఫ్పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్పీఎఫ్ జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు.... |
| కాశ్మీర్ లో మరో సాల్వజుడుంఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు..... |
| దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మిఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే..... |
| నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలిశ్రీనగర్లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..