మతం పేరుతో దాడులు,రక్షించే పేరుతో బిజినెస్... నిజాలు వెలికి తీసిన జర్నలిస్టు

మతం

(ఢిల్లీకి చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్టు ధీరేంద్ర కే. ఝా రాసిన‌ ʹషాడో ఆర్మీస్‌: ఫింజ్‌ ఆర్గనైజేషన్స్‌ అండ్‌ ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ హిందుత్వʹ అనే పుస్తకంలోని అంశాల ఆధారంగా స్క్రోల్ డాట్ ఇన్ వెబ్ సైట్ ఈ వార్తా కథనం ప్రచురించింది. ఈ పుస్తకం ఏప్రిల్‌ 28వ తేదీన మార్కెట్‌లోకి విడుదలవుతోంది)

కర్ణాటకలోని మంగళూరులోని సిటీ సెంటర్, ఫోరమ్‌ ఫిజా, బిగ్‌ బజార్‌ అనే పెద్ద మాళ్లతో పాటు అనేక అపార్ట్‌మెంట్లు, దుకాణాలకు సెక్యూరిటీ ఇచ్చే సంస్థ పేరు ʹఈశ్వరీ మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్ʹ దాని యజమాని షరాన్‌ పాంప్‌వెల్ . హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కూడా షాపింగ్ మహల్ల కు సెక్యూరిటీ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి కదా మరి మంగుళూరు లోని షరాన్ ప్రత్యేకత ఏంటి ? చాలా ప్రత్యేకత ఉంది. ఆయన సెక్యూరిటీ ఇచ్చే షాప్ ల్లో మెజారిటీ ముస్లింలవి. అందులో విచిత్రమేముంది అనే కదా మీ ప్రశ్న . అయితే చదవండి.
మంగళూరులో ఏ గొడవలు జరిగినా భజరంగ్ దళ్ కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకొని ఈ షాపుల మీదపడే వారు... షాపులను ధ్వంసం చేసేవాళ్ళు. వ్యాపారులు లక్ష‌ల రూపాయలు నష్టపోయే వాళ్ళు. కొన్ని షాపుల మీద మాత్రం దాడులు జరగకపోయేవి. ఎందుకంటే ʹఈశ్వరీ మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్ʹ ఆ షాపులకు సెక్యూరిటీ ఇచ్చేది. దాంతో షాపులవాళ్ళందరూ షరాన్‌ పాంప్‌వెల్ కు చెందిన ʹఈశ్వరీ మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్ʹ తో ఒప్పందాలు చేసుకొని వాళ్ళ షాపుల మీద దాడులు జరగకుండా కాపాడుకున్నారు. ఇప్పుడు అక్కడ షరాన్‌ పాంప్‌వెల్ కు చెందిన‌ సంస్థ కోట్ల రూపాయల టర్నోవర్ తో అతిపెద్ద సంస్థగా అవతరించింది. భజరంగ్ దళ్ కార్యకర్తలనుండి ఆ షాపులకు షరాన్‌ పాంప్‌వెల్ రక్షణ ఎలా కల్పించే వాడో తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ. ఈ షరాన్‌ పాంప్‌వెల్‌ ʹభ‌జరంగ్‌ దళ్‌ʹ దక్షణ కర్ణాటక డివిజన్‌కు కన్వీనర్. ఆయన దగ్గర పని చేసే సెక్యూరిటీ గార్డులు, సూపర్ వైజర్లు అందరూ భజరంగ్ దళ్ కార్యకర్తలే. దాదులు చేసేదీ వీళ్ళే కాపాడేదీ వీళ్ళే. ఆయన బజరంగ దళ్‌లో అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ వచ్చారో, వ్యాపారరంగంలోనూ అలాగే ఎదుగుతూ వచ్చారు.

బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను ముందుగా గొడవలకు పంపించి దాడులు చేయించడం, ఆ తర్వాత తన సంస్థ సెక్యూరిటీని తీసుకొంటే హిందూ సంస్థల నుంచి ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగవని హామీ ఇవ్వడం, సెక్యూరిటీ కాంట్రాక్టులు కుదుర్చుకోవడం ఇదీ షరాన్ బిజినెస్ సీక్రేట్. ఆయన సెక్యూరిటీ సంస్థలో పనిచేసేది ఎక్కువ మంది బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలే. కొంతమంది ముస్లింలు కూడా ఉన్నారని షరానే తెలిపారు.

ʹనేను 2005లో బజరంగ్‌ దళ్‌లో చేరాను. 2011లో మంగళూరు డివిజన్‌కు కన్వీనర్‌గా అయ్యాను. అప్పుడే నేను ఈశ్వరి మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ కంపెనీని ఏర్పాటు చేశాను. 2014లో దక్షిణ కర్ణాటక డివిజన్‌కు కన్వీనర్‌గా నియమితులయ్యాను. పదవితో పాటు నా వ్యాపారం విస్తరించింది. కేఎస్‌ రావు నగరంలోని సిటీ సెంటర్, పండేశ్వర్‌లోని ఫోరమ్‌ ఫిజా, లాల్‌ బాగ్‌ ఏరియాలోని బిగ్‌ బజార్‌కు సెక్యూరిటీ కాంట్రాక్టు నాదేʹ అని షరాన్‌ తెలిపారు.

కర్ణాటకలోని మంగళూరులో షరాన్‌ పాంప్‌వెల్‌ అనే 40 ఏళ్ల యువకుడికి ʹఈశ్వరీ మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ʹ అనే కంపెనీ ఉంది. కావాల్సిన మాల్స్‌కు, దుకాణాలకు, వ్యాపారవేత్తలకు భద్రత కల్పించడమే ఆ కంపెనీ కర్తవ్యం. మంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆయన కంపెనీకి నగరంలోని సిటీ సెంటర్, ఫోరమ్‌ ఫిజా, బిగ్‌ బజార్‌ అనే పెద్ద మాళ్లతో పాటు అనేక అపార్ట్‌మెంట్లు, దుకాణాలకు సెక్యూరిటీ కాంట్రాక్టులు ఉన్నాయి. ఇందులో పెద్ద విశేషమేముందని మనం అనుకోవచ్చు. షరాన్‌ పాంప్‌వెల్‌ విశ్వహిందూ పరిషత్‌ అనుబంధ సంస్థయిన ʹబజరంగ్‌ దళ్‌ʹ దక్షణ కర్ణాటక డివిజన్‌కు కన్వీనర్‌. ఆయన బజరంగ దళ్‌లో అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ వచ్చారో, వ్యాపారరంగంలోనూ అలాగే ఎదుగుతూ వచ్చారు. ఇందుకు ఆయన నిర్వహిస్తున్న విధులకు విడదీయలేని విరుద్ధమైన సంబంధం ఉండడమే కారణం.

బజరంగ్‌ దళ్ కన్వీనర్‌గా మాల్స్‌ మీద, దుకాణాల మీద, ముఖ్యంగా ముస్లిం వ్యాపారులకు చెందిన సంస్థల మీద దాడులు జరిపించేది షరానే, వాటికి సెక్యూరిటీ కల్పించేది ఆయనే. బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను ముందుగా గొడవలకు పంపించి దాడులు చేయించడం, దౌర్జన్యాలకు దిగడం, ఆ తర్వాత తన సంస్థ సెక్యూరిటీని తీసుకొంటే హిందూ సంస్థల నుంచి ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగవని హామీ ఇవ్వడం, సెక్యూరిటీ కాంట్రాక్టులు కుదుర్చుకోవడం షరాన్‌కు అది నుంచి అబ్బిన విద్య. ఆయన సెక్యూరిటీ సంస్థలో పనిచేసేది ఎక్కువ మంది బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలే. కొంతమంది ముస్లింలు కూడా ఉన్నారని షరానే తెలిపారు.

ʹఎవరు దాడులు చేస్తారో, ఎవరు సెక్యూరిటీ కల్పిస్తారో మాకు తెలుసు. దాడులు జరిపించే వారికే సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ ఇస్తే సేఫ్‌ గదా! మరో సంస్థకు సెక్యురిటీ కాంట్రాక్ట్‌ ఇస్తే ఇంకా ఎక్కువ దాడులు జరగొచ్చు. మా వ్యాపారం సర్వనాశనం కావడానికి ఒక్క దాడి చాలదా! గతంలో ఇలాంటి దాడులను నిలువరించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారుʹ అని సిటీ సెంటర్‌లోని ఓ ముస్లిం వ్యాపారి సమాధానమిచ్చారు.

ʹహిందుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి మా వద్ద ప్రత్యేక నిధులేమీ ఉండవు. పైగా కార్యకర్తలందరూ నిరుద్యోగ యువకులు. వారికి ఏదో ఉపాధి చూపించాలి గదా? అందుకే వారినే నేను ఎక్కువగా నా సెక్యూరిటీ సంస్థలోకి తీసుకుంటున్నాను. నా దొగ్గరికొచ్చి ఉద్యోగం అడిగిన కార్యకర్తలెవరికీ ఇంతవరకు నేను కాదనలేదు. నా దగ్గర ఎలా అయితే వారి సంఖ్య పెరుగుతుందో అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి గదా! ఎంతో కష్టపడితే గానీ వ్యాపారం ఈ స్థాయికి రాలేదుʹ అని షరాన్‌ వ్యాఖ్యానించారు.

Keywords : mangaluru, bajarangadal, rss, police, hindutva
(2024-03-11 05:59:10)



No. of visitors : 885

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మతం