బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్‌ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !


బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్‌ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !

బాలికల

ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులతో పాలకులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, వాళ్ళను పోలీసులు దారుణంగా అణిచివేస్తున్నారని, తీవ్ర చిత్రహింసలపాల్జేస్తున్నారని వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ ఫేస్‌బుక్‌ పోస్టు చేసిన‌ రాయ్‌పూర్‌ జైలు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ వర్షా డొంగ్రే మే 2వ తేదీ నుండి కనిపించడం లేదు. ఆమెను ఎవరు మాయంచేశారు.. అసలు ఆమె సురక్షితంగా ఉందా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్ తో నిజాలను బహిర్గత పర్చిందనే అక్కసుతో ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది, అసలు వర్షా డొంగ్రే తన ఫేస్ బుక్ లో ఏం రాసింది ?
సుకుమా జిల్లాలో ఏప్రిల్‌ 24వ తేదీన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టుల‌ దాడి తర్వాత ఆమె హిందీలో ఈ పోస్టు చేశారు. ఆ పోస్టులో ఏముందంటే..

ʹఅందరూ ఒకసారి ఆత్మపరిశోధన చేసుకుంటే నిజం నిగ్గు తేలుతుందని నమ్ముతాను. నక్సల్ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నక్సల్స్‌, జవాన్లు ఇద్దరూ.. భారతీయులే. వీరిలో ఎవరూ ప్రాణాలు కోల్పోయినా దేశం మొత్తం బాధపడుతుంది. ఆదివాసి ప్రాంతాల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని భూమిని సొంతం చేసుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టేందుకు వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. గ్రామాలను తగలబెడుతున్నారు. ఆదివాసి మహిళలను మానభంగం చేస్తున్నారు. పులుల ప్రాజెక్టుల పేరుతో రాజ్యాంగంలో ఐదో షెడ్యూలు ఆదివాసీలను తమ భూముల నుంచి పంపించడాన్ని నిరోధిస్తున్నా.. దాన్ని ఉల్లంఘిస్తూ బలవంతంగా ఆదివాసులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. నక్సలిజాన్ని రూపుమాపుతున్నామనే పేరుతో అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే ఖనిజసంపద కోసం.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ, తమ సొంత గూటిని వదులుకునేందుకు ఇష్టపడని అడవిబిడ్డలు ఆ ప్రాంతాన్ని వదిలేందుకు ఒప్పుకోకుండా ప్రభుత్వ బలగాల దాష్టీకానికి బలవుతున్నారు. పోలీసు బలగాల చేతుల్లో నలిగిపోతున్న తమ కూతుళ్లను, కాలిపోతున్న తమ గుడిసెలను కాపాడుకోలేకపోతున్నారు. నిరక్షరాస్యత వల్ల తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు ఎవరు న్యాయం చేస్తారు?.
సీబీఐ, సుప్రీం కోర్టులు ఆదివాసీలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి వ్యాఖ్యానిస్తాయంతే. ఇంకా ఎవరైనా మానవహక్కుల కార్యకర్తో లేక ఓ విలేకరో సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. ఆదివాసీ ప్రాంతాల్లో అంతా బావుంటే.. ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది? నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్లేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించడం లేదు. 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్‌లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్‌ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్‌ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను.
ఒకరిని హింసించేందుకు మన రాజ్యాంగం ఒప్పుకోదు. రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు (రాజ్యాంగంలోని ఐదు షెడ్యూలు పంచాయితీ రాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్డ్‌ ఏరియా-1996ను తెలుపుతుంది. దీన్ని రాష్ట్రపతి సూచించిన ప్రాంతాల్లో అమలు చేస్తారు) ను వెంటనే అమలు చేయాలి. ఆదివాసీలు ప్రకృతిలో ఒక భాగం. మనం ప్రకృతిని సంరక్షించాలే తప్ప నాశనం చేయకూడదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ రెండు పార్శ్వాలను అర్ధం చేసుకోవాలి. రైతులు, జవానులు సోదరుల లాంటి వారు. వీరు ఇరువురు ఒకరినొకరు చంపుకోవడం అభివృద్ధికి, శాంతికి ఆటకం కలుగజేయడమే.
రాజ్యాంగం అందరికీ కోసం. అందరికీ న్యాయం జరగాలి. నేను కూడా వ్యవస్ధ బాధితురాలినే. కానీ, అన్యాయాన్ని ఎదిరించి నిలిచాను. కుట్రలతో నన్ను బలిపశువును చేయాలని చూశారు. నాకు లంచాలు ఇవ్వజూపారు. కానీ, నిజమే గెలిచింది. మనకు ఇంకా సమయం ఉంది. సత్యం వైపు మనం నిలబడకపోతే.. పెట్టుబడీదారులు మన దేశం నుంచి మానవత్వాన్ని నశింపజేస్తారు. అన్యాయం ఎక్కడ జరిగినా సహించనని మనకు మనమే మాట ఇచ్చుకుందాం. రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత్‌ వర్ధిల్లాలి.ʹ

ఫేస్ బుక్ లో ఈ పోస్టు చేసిన రెండు రోజుల్లోనే ఆమె దానిని తొలగించింది. అంటే అప్పటికే ఆమెపై తీవ్ర ఒత్తిడి ప్రారంభమైంది. మరో వైపు ఆమె నిజాలను నిర్భయంగా బహిర్గతపర్చడం రాష్ట్ర ప్రభుత్వానిధి నేతలకు, పోలీసులకు.. ముఖ్యంగా మావోయిస్టులపై సైన్యందాడికి సిద్దమైన కేంధ్రానికి మింగుడు పడలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆమె మాయమయ్యింది.

Keywords : chattisgarh, adivasi, raipur, maoists, naxals, police, girls
(2017-11-18 09:45:09)



No. of visitors : 4179

Suggested Posts


సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడానికేనని సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై...

A week after Sukma encounter, Maoists release photographs of modern weapons Possessed from CRPF

A week after the Sukma encounter, which killed 12 personnel of Central Reserve Police Force (CRPF), the Maoist Party released a press statement carrying an image of assembled modern weapons they looted from the dead CRPF personnel....

I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongre

varsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai...

పాలకుల గ్రీన్ హంట్... ‍ఎదిరిస్తూ పోరాడుతున్న ఆదివాసులు.. డాక్యుమెంటరీ

పోలీసులు, అర్ద మిలటరీ బలగాలు మరో దేశం మీద దాడి చేసిన విధంగా ఈ దేశ ప్రజలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న దాడి అత్యంత తీవ్రమైనదే కాక దుర్మార్గమైనది. గ్రీన్ హంట్ పేరుతో పాలకులు చేస్తున్న దాడిని ప్రజల సహకారంతో విప్లవకారులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు.

26 CRPF personnel killed in Maoist encounter in Chhattisgarh

In the deadliest ambush by Maoists since April 2010, 26 personnel of the Central Reserve Police Force died and six were injured in Chhattisgarhʹs Sukma this afternoon. The well-planned massacre started around 1 pm, when the men from the 74 Battalion were sanitizing the area for a group of construction workers building a road....

Sukma Police offers reward for Naxal attack perpetrators

Sukma District Police on Friday released posters declaring they would reward anyone who could provide information on the Naxalites who were behind the recent attack on a platoon of...

Anti-Naxal forces stab 13-year old boy to death with bayonets after branding him as Maoist

A 13-year-old Somaru Pottam was allegedly stabbed to death by security forces engaged in anti-Naxalite operations in Bastar region of Chhattisgarh. Father of the Adivasi boy, Kumma Pottam, has filed a petition in the Chhattisgarh High Court seeking justice.....

పోలీసుల అరాచకాలు‍ - గ్రామంపై దాడి,బాలికపై అత్యాచారం

ఏప్రెల్ 1 వతేదీన ఉదయం 4 గంటల‌కు తమ గ్రామం పై పోలీసులు దాడి చేశారని, ఆ కుటుంభం తెలిపింది. ఇంట్లోకి హటాత్తుగా దూసుకొచ్చిన పోలీసులు అడ్డువచ్చిన వాళ్ళపై దాడి చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

The Maoists are extend their movement to new areas

The Maoists are trying to extend their "movement" to new areas and they stepped up their activities along the shared borders of....

రాజ్య నిర్భందంలో ʹనిజ నిర్దారణʹ - వరవరరావు

ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా, మెటపల్ గ్రామస్తుడు ఆదివాసి కుమ్మా పొట్టం తన పదమూడేళ్ల కొడుకు సోమారు పొట్టంను పోలీసులు డిసెంబర్ 16న పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్పూర్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు....

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు
more..


బాలికల