హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావు

హిందూ

(వీక్షణం మాసపత్రిక మే సంచికలో ప్రచురించబడినది)

హిందూ మతోన్మాదం భారతావనిలో పెచ్చురిల్లుతోంది. అంబేడ్కర్ స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఆర్ఎస్ఎస్ లౌకికవాదానికి శత్రువని చెబుతూనే వచ్చాడు. గాంధీ అన్యాపదేశంగా ఆర్ఎస్ఎస్ పట్ల ఉదాసీనత వహించాడు. చివరకు గాంధీనే ఆర్ఎస్ఎస్ శక్తులు కబళించారుు. ఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు. ఇవాళ యూపిలో కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది యోగి ఆదిత్యనాథ్ బౌద్ధం పునాదులు తొలిచివేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ముస్లింలను బిజెపి ప్రత్యక్షంగా శత్రువులుగా ప్రకటించింది. అంతర్గతంగా దళితుల అణచివేతను ప్రకటించింది.

అంబేడ్కర్ పిలుపు
ఈ సమయంలో అంబేడ్కర్ ఎందుకు దళితులను బౌద్ధం తీసుకోమన్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన చారిత్రక అంశం ముందుకొచ్చింది. అందుకే ఆయన బౌద్ధంలోకి దళితులు ఎందుకు రావాలో చెప్పేక్రమంలో దళితులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం హిందూమతంలో లేవని ఇలా ప్రకటించాడు.

మత మార్పిడిని రెండు కోణాలలో పరిశీలించాలి. సామాజిక, మతపరమైన, భౌతిక, తాత్విక కోణాలు. కోణమేదైనా ఏ ఆలోచనా మార్గమైనా, మొదటగా అర్థం చేసుకోవలసిన విషయం ఒకటుంది. అస్పృశ్యత స్వభావం, దానిని ఆచరిస్తున్న తీరు. అది అర్థం చేసుకోకుండా మత మార్పిడిపై నా ప్రకటన వెనుక ఉన్న అర్థాన్ని మీరు గ్రహించలేరు. అస్పృశ్యత, వాస్తవ జీవితంలో దాని ఆచరణపై స్పష్టమైన అవగాహన కోసం, మీపై జరిగిన అత్యాచార ఘటనలను గుర్తు చేసుకోమంటాను.

మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే హక్కును కోరినప్పుడు లేదా ఊరి బావి నుంచి నీరు తోడుకునే హక్కును లేదా గుర్రంపై పెళ్లికొడుకుతో ఊరేగింపు తీసుకెళ్లడం వంటి చిన్న కారణాల వల్ల అగ్రవర్ణ హిందువుల చేతిలో తన్నులు తిన్న ఘటనల వంటివి జ్ఞాపకం తెచ్చుకోమంటాను.

మీ కళ్ల ముందే జరిగే అటువంటి ఘటనల గురించి మీకు తెలుసు. అగ్రవర్ణ హిందువులు అస్పృశ్యులపై అత్యాచారాలు చేసేందుకు కారాణాలు ఇంకా అనేకం ఉన్నారుు. వీటిని వెల్లడిస్తే హిందుస్థాన్ ఆవల ఉన్న ప్రజలు నిశ్చేష్టులవుతారు. మంచిరకం దుస్తులు ధరించినందుకు అస్పృశ్యులను కొడతారు. కంచువంటి లోహాలతో చేసిన సామాగ్రిని ఉపయోగించినందుకు వారిని చాలాసార్లు కొరడాతో శిక్షించిన సందర్భా లున్నారుు. వ్యవసాయం చేసినందుకు వారి ఇళ్లు తగులబెట్టారు. జంధ్యం వేసుకున్నందుకు హింసించారు.

మృతజీవులను తీసుకువెళ్లేందుకు తిరస్కరించినందుకు, గ్రామ వీధులలో చెప్పులు వేసుకు తిరిగినందుకు లేదా అగ్రవర్ణ హిందువులకు వంగి సలాం కొట్టనందుకు, బహిర్భూమికి వెళ్లేటప్పుడు కంచుపాత్రలో నీరు తీసుకువెళ్లినందుకు వారు తన్నులు తిన్నారు. ఈ మత హింసల నుండి బయటపడాలంటే మీరు హిందూ మతం నుండి బయటపడండి అని, బౌద్ధంలోకి రండి అని పిలుస్తున్నాను అని అంబేడ్కర్ అన్నాడు.

హిందూ మతోన్మాది యోగి

ఈరోజు ఇక్కడ హిందూ మతోన్మాది యోగి ఆదిత్యనాథ్నకు యూపి ముఖ్యమంత్రిగా చేయడం వల్ల బిజెపి తన ఆర్ఎస్ఎస్ అజెండాను ముందుకు తెచ్చినట్లర్యుుంది. ఇక అస్పృశ్యతను స్వాతంత్య్రానికి ముందు దశలో కొనసాగిస్తారు. దళితులు తమ సహజాహారమైన గోమాంసాన్ని తినడాన్ని ఆదిత్యనాథ్ రావడమే నిషేధించడాన్ని బట్టి అతని కక్ష్య, కార్పణ్యం అంతా దళితులమీదేనని అర్థమైంది. దళితులు ఏ ఆహారం అరుునా తీసుకోవడం వారి హక్కు. వారికి ఏది బలం చేకూరుస్తుందో వారు ఆ ఆహారాన్ని తీసుకుంటారు. గోమాంస స్వీకారాన్ని నిషేధించటానికి ఆదిత్యనాథ్యోగి ఎవరూ?

నిజానికి ఆదిత్యనాథ్ హిందూవాదే కాక ఠాగూర్ల నాయకుడు. గోరఖ్పూర్ పట్టణంలో 52 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న గోరఖ్పూర్ మఠానికి అధిపతి. 2007లో గోరఖ్పూర్లో జరిగిన మత ఘర్షణలలో అరెస్ట్ అరుు జైలులో ఉన్నాడు. 2014 నుంచి గోరఖ్పూర్ మఠానికి అధిపతి కూడా. 1998 నుండి 2014 వరకు ఐదుసార్లు ఎంపిగా గెలిచాడు. ఇతను కరుడుగట్టిన ముస్లిం దళిత వ్యతిరేఖి.

ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్సింగ్. 1972 జూన్ 5వ తేదీన పుట్టాడు. ఈయన బిజెపి ఎంపి మహంతి అవైద్యనాథ్ కుమారుడు. తండ్రి ఈయన కంటే కూడా ఘనుడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన అనేక మత వివాధాల్లో ఆయన ముద్దారుు. సాక్ష్యాత్తు బాబ్రీ మసీదు ముద్దారుుల్లో ఈయన తండ్రి ఒకడు. ఇంతవరకు ఏ ఎంపి కూడా ఈయన ఉన్నటువంటి మతఘర్షణ కేసుల్లో లేడు.

మహరాజ్గంజ్ జిల్లా రుకియానా గ్రామంలో శ్మశాన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారంటూ 1997లో ఆయనపైన అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యారుు. 2007లో గోరక్పూర్లో జరిగిన మత ఘర్షణల్లో ఆదిత్యనాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.

ఇలా చెప్పుకుంటూపోతే ఆయనపై ఎన్నో కేసులు. ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారమే 147, 148, 153ఏ, 295, 297, 336, 435, 506, ఐపిసి సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదైనారుు. 2007లో తనను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు బిజెపి అండగా నిలబడలేదన్న కోపంతో ఆ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపికి పోటీగా ఉత్తరప్రదేశ్లో హిందూ యువవాహిని సంస్థను కూడా ఆయన ఏర్పాటు చేశారు.

హిందూ సాయుధ సేనకు నాయకుడు యోగి

సామాజిక, సాంస్కృతిక రంగాల్లో యువతకు శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ఉద్దేశ్యమని ప్రకటించినప్పటికీ ఆచరణలో ఆయుధాల వినియోగంలో కూడా యువతకు శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలున్నారుు. ఆదిత్యనాథ్ సంఘపరివార్ అజెండాను ఇక ముందుకు తీసుకొస్తార నడంలో ఎటువంటి ఆశంక లేదు. ఇక బ్రాహ్మణాధిపత్యం దేశంలో కొనసాగాలని చూస్తున్నారు. మొత్తం పాఠ్య గ్రంథాల్లో కూడా హిందూ వాదాన్నే ముందుకు తీసుకొస్తారు. ఈ విషయం మీద మహాత్మాఫూలే తన గులాంగిరిలో ఎప్పుడో వాదించాడు.

మహాత్మాఫూలే విశ్లేషణ

ముఖ్యంగా బానిసలకు బోధించే విద్య బానిసత్వాన్ని ప్రేరేపిస్తుంది. మీరు మాకు సాంఘికంగా లోబడి ఉండాలని బ్రాహ్మణులు బోధిస్తున్నారు. ఈ విషయాన్ని మహాత్మాఫూలే బ్రాహ్మణ విద్య నిర్మాణంలో ఉన్న బానిసత్వాన్ని ఇలా తెలిపారు. బ్రాహ్మలు గెలిచాక ఓడిపోరుున ఆదిమవాసులకి జ్ఞానం అనే వెలుతురు లేకుండా చేసి నిత్యాంధకారంలో ఉంచడం చేత వాళ్ల పాచిక పారింది. వాళ్ల ఉద్దేశాలు నెరవేర్చుకున్నారు. విజేతల మోసాల్నీ, దుర్మార్గాలనీ అణగదొక్కబడినవాళ్లు అర్థం చేసుకోలేక పోయారు. ఓడిపోరుునవాళ్లని అణగదొక్కడానికి, యుగయుగాల పర్యంతం వాళ్లని బానిసత్వంలో నిలిపి ఉంచుకోవడానికీ ఆర్యులు చాలా కపట గ్రంథాల్ని తయారుచేసి అవన్నీ ఎకాఎకీన దేవుడి ముఖంలోంచి ఊడిపడ్డ ప్రకాశిత వాక్యాలని చెప్పుకొన్నారు. ఈ పచ్చి అబద్ధాన్ని దిగమింగేలాగ బీదల్నీ అజ్ఞానుల్నీ వొప్పించారు.

ఓడిపోరుున వాళ్లు తమ రాజ్యం దొంగిలించిన వాళ్లకి విశ్వాసంతో దాస్యం చెయ్యాలనీ, అప్పుడే దేవుడికి ప్రీతి అనీ, దేవుడు దళిత ప్రజల్ని సృష్టించడంలో ఉద్దేశం దోపిడీదార్లని విశ్వాసంతో కొలవడం కోసమేననీ, ఈశ్వరాజ్ఞ ప్రకారం ఈ ఫలాన్నే భక్తితో కోరుకోవాలనీ, ఏవేవో కల్లబొల్లి కథలు వాళ్ల పవిత్ర గ్రంథాల్లో రాసుకొన్నారు. వాళ్లు కపట మత గ్రంథాల్లో ఈ కట్టు కథల్ని వర్ణించి చెప్పారు.

ఈ కృతక గ్రంథాల్ని పైపైన తిప్పి చూసినా, వీటికి దైవ మూలం ఉందనే పుక్కిటి పురాణాల్ని పటాపంచలు చేసెయ్యవచ్చు. చమత్కారులైన మన బ్రాహ్మణ సోదరులకి కూడా (వీరిని సోదరులనడానికి మనకి సిగ్గుగా ఉంది) ఈ కృత్రిమ మతగ్రంథ రచనలు అపకీర్తి తెస్తారుు. అండ పిండ బ్రహ్మాండాల సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, అఖిల ప్రాణుల యెడలా సమాన ప్రేమా, ఆదరణా కల్గినవాడు ఆయనకి కూడా ఇది తిరస్కారమే అని పూలే తన పుస్తకంలో వివరించారు.

మహాత్మాఫూలే విద్యలో కల్పనాత్మకమైన భావాల్ని ప్రచారం చేయడాన్ని ఖండించాడు. విద్య విజ్ఞానాత్మకమైంది. ప్రపంచ దేశాలన్నింటిలో విద్య వల్ల మానవులు చైతన్యవంతమయ్యారు. తమకున్న మూఢనమ్మకాలను పోగొట్టుకున్నారు. కానీ భారతదేశంలో విద్య మనిషిని మార్చలేకపో తున్నది. దేవుడు, దెయ్యం అనే భావాన్ని దాటితేకాని విద్య తలకెక్కదు. ఇక్కడ ఆ భావాల్ని పెంచి పోషించేదిగా విద్య ఉందని మహాత్మాఫూలే ఆనాడే చెప్పాడు.

శూద్రులను బానిసలుగా మార్చిన హిందూవాదం

ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బిజెపి శూద్రుల చేతే శూద్రుల కంట్లో పొడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ యోగికి అర్థం కాని విషయమేమిటంటే స్మృతుల్లో శూద్ర బానిసత్వాన్ని గురించి ఇలా చెప్పబడింది. అతీవ తృషితో విప్ర:న శూద్ర స్యోదకం పిబేత్|| శూద్రహస్తేన యో భుంక్తే పానీయం నాపిబేత్క్వచిత్ అహోరాత్రోషితో భూత్వా పంచగవ్యేన శుద్ధ్యతి అంటే ఎంత ఆకలి వేసినా, ఎంత దప్పిక వేసినా బ్రాహ్మణుడు శూద్రుని చేత అన్నమును గాని, పానీయమును గాని స్వీకరించకూడదు. స్వీకరిస్తే అతడు ఒక పగలు, ఒక రాత్రి ఉపవాసం ఉండి, తర్వాత పంచగవ్యముచేత శుద్ధి పొందాలి.

ఆదిత్యనాథ్ యోగి శూద్రుడే. ఎన్నో దేవాలయాలకు వెళ్లటానికి అతడు అనర్హుడు. బ్రాహ్మణులకు భోజనం వడ్డించటానికి అనర్హుడు. కాని ఆయన బ్రాహ్మణులు ఇచ్చిన కరవాలాన్ని పూని శూద్ర, అతిశూద్రుల మీద దాడులకు ఉరుకుతున్నాడు. నిజానికి పరాశరుడు ఆయన స్మృతిలో శూద్రుల గురించి ఏం చెప్తున్నాడో చూడండి. శూద్రాన్నం శూద్రసంపర్కం శూద్రేణతు సహాసనం శూద్రాత్ జ్ఞానాగమ: కశ్చిత్ జ్వలంత మపి పాతయేత్ (పరాశర స్మృతి) కాబట్టి, శూద్రుని అన్నం, శూద్రుని సంపర్కం, శూద్రుని పక్క కూర్చోవటం, శూద్రుని వద్ద విద్య అభ్యసించటం అనే ఈ నాలుగు బ్రాహ్మణుడు చేయకూడనివి. ఆదిత్యనాథ్ యోగికే కాకుండా నరేంద్రమోడీకి కూడా ఈ సూత్రాలన్నీ వర్తిస్తారుు. వాళ్లు తమను బానిసత్వానికి గురిచేసే సిద్ధాంతాలనే తలకెత్తుకు మోస్తున్నారు. మరి వీరు గోమాంస విక్రయాన్ని నిషేధిస్తున్నారు. పరాశరుడు బ్రాహ్మణులకు పాలమ్మడాన్ని నిషేధించాడు. సముద్ర యానాన్ని నిషేధించాడు.

త్య్రహేణ శూద్రోభవతి బ్రాహ్మణ: క్షీరవిక్రయాత్ - (స్మృతి ముక్తాఫలే, అహ్నిక కాండే, విష్ణుపురాణేచ) అంటే మూడు పూటలు పాలు అమ్మినంత మాత్రాన, బ్రాహ్మణుడు శూద్రుడు అవుతున్నాడు. సముద్ర యానగమనమ్ బ్రాహ్మణస్య నశాస్యతే సంభవేద్యదిమోషేన పునస్సంస్కార మర్హతి (ప.స్మృ) అంటే మూడు వందల అరవై ఐదు దినములలో ఎప్పుడు సముద్ర ప్రయాణం బ్రాహ్మణుడు చేయకూడదు.

ఇప్పుడు బ్రాహ్మణులు తమ వృత్తుల్లో లేరు. పాలు అమ్ముతున్నారు. సముద్రయానం చేస్తున్నారు. మరి శూద్రులకు ఎందుకు నియమాలు పెట్టారు. అతిశూద్రులకు ఎందుకు నియమాలు పెట్టారు. ఆ నియమాలను ఇప్పటికీ ఎందుకు ఆచరిస్తున్నారు? నరేంద్రమోడీ, ఆదిత్యనాథ్యోగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ద్వేషంతో దేశాన్ని పాలించలేరు. మనం ఒకసారి పరిశీలిస్తే ఉత్తర్ప్రదేశ్ మంత్రిమండలిలో ఒక్క ముస్లిం కూడా లేడు. ఎన్నికల్లో నాలుగు వందల మూడు స్థానాల్లో ఒక్కస్థానం కూడా ముస్లింకు ఇవ్వలేదు. ఇది రాజ్యాంగబద్ధమైన నిర్ణయమేనా?

అంటే మోడీ, యోగి ఇద్దరూ శూద్రులే అరుునా హిందూవాదం చేతిలో పదును గల ఆయుధాలుగా మారిపోయారు. బ్రాహ్మణులు శూద్రులకే నీతులు చెప్తారు. శాస్త్రాలను తప్పకుండా ఆచరించాలని చెప్తారు. కానీ వారు ఆచరించరు. నటన, నాట్య వృత్తులను ఒక చండాలురకు మాత్రమే నిర్ధేశించారు. మరిబ్రాహ్మణులు నటనను ఎందుకు వృత్తిగా చేసుకుని బ్రతుకుతున్నారు. ఈ విషయాన్ని కొప్పరపు సుబ్బారావు తన శాస్త్ర దాస్యంలో ఇలా ఉట్టంకించారు.

రజక శ్చర్మ కారశ్చ నటోబురుడ వీవచ

కైవర్త మేదభిల్లాశ్చ సప్తై తేంత్యజా: స్మృతా: - (మితా)

చండాలా ద్వివిధా: అంతరా బాహ్యాశ్చ:

అంతరాపి ద్వివిధా: తత్రప్రధమే ఆద్యా:

రజకశ్చర్మ కారశ్చ నటోబురుడ ఏవచ - (హేమా)

ఏతే విప్రై ర్వర్జ్యా: ప్రయత్నత: - (తత్రైవ)

ఈ శ్లోముల అభిప్రాయాలను బట్టి చూడగా మన శాస్త్రములు నటవృత్తిని చండాలురకు మాత్రమే నిర్ధేశించినవి. అందువల్లనే ఆ నట వృత్తి బ్రాహ్మణులకు ʹవర్జ్యా: ప్రయత్నత:ʹ అని శాసించుచున్నవి. మరి చండాలురకే తగిన ఆ నాట్య వృత్తిని అవలంభించి జీవయాత్ర చేస్తున్న వందలకొలది నేటి బ్రాహ్మణ నటీనటలకు ఎవరు చండాల సమానులుగా పరిగణింపబడవలసినదేనా? (శాస్త్ర దాస్యం, కొప్పరపు సుబ్బారావు)

కొప్పరపు సుబ్బారావుగారు తన శాస్త్రదాస్యంలో బ్రాహ్మణులను ఈ విషయంపై నిలదీస్తున్నారు. వాళ్లు ఏం సమాధానం చెప్తారు?

లౌకిక శక్తులు ఐక్యం అవ్వాలి

వీళ్లిద్దరు మహాత్మాఫూలేను, అంబేడ్కర్ను జపిస్తూనే ముస్లింలకు, దళితులకు వ్యతిరేకంగా పరిపాలన చేయాలని చూస్తున్నారు. సెక్యులర్ స్టేట్లో రాజ్యాంగమే ప్రధానమైన గ్రంథం. రాజ్యాంగ సూత్రాలను అనుసరించినప్పుడే వీరు భారతదేశాన్ని పరిపాలించగలుగుతారు. భారతదేశ భౌగోళిక పరిస్థితులను బట్టి అనేక మతాలు భారతదేశానికి వచ్చారుు. భారతదేశ చరిత్ర రచించిన ప్రతి ఒక్కరు ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని చెప్పారు.

హిందూవాదం కూడా భారతీయం కాదు. వేదాలు అభారతీయమని చెప్పారు. హిందూ, బౌద్ధ, జైన, ముస్లిం, జోరాష్టియన్, సిక్కు అనేక మతాలు ఇక్కడ ఉన్నారుు. ఏ మతమైనా మానవత్వాన్ని ప్రబోధిస్తేనే నిలబడుతుంది. మత నాయకులు రాజ్యాన్ని పాలించలేరు. రాజ్యాన్ని పాలించాలంటే రాజ్యాంగం తెలిసి ఉండాలి.

రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య, లౌకికవాద, సామ్యవాద సిద్ధాంతాల పునాదుల మీద నిర్మించబడింది. ఈ పునాదులు అర్థం కాకుండా మోడీ, యోగి భారతదేశ పాలకులు కాలేరు. ఒకవేళ అరుునా పాక్షికమైన సమాజాన్నే వాళ్లు పాలించగలుగుతారు.

ఇప్పుడు లౌకికవాద శక్తుల ఐక్యపోరాటానికి అనువైన సమయం.. అంతిమ విజయం రాజ్యాంగ శక్తులదే..
-డా. కత్తి పద్మారావు
(రచయిత సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షులు, నవ్యాంధ్రపార్టీ)
(వీక్షణం మాసపత్రిక మే సంచికలో ప్రచురించబడినది)

Keywords : ambedkar, rss, katti padmarao, buddism, hindutva
(2024-04-27 01:26:48)



No. of visitors : 4014

Suggested Posts


గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !

ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు....

బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రంగు

ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది....

బీఫ్‌ తినడం నేరం కాదు - మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

గో మాంసంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్‌ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది...

HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మ‌తోన్మాద గుండాల అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కార‌ణ‌మైన సుశీల్ కుమార్, బీజేపీ నాయ‌కుడైనా అత‌ని సోద‌రుడు మ‌రో ముప్పై మందితో క‌లిసి నిన్నరాత్రి యూనివ‌ర్సిటీలో విద్యార్థుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త వారం ప‌ది రోజులుగా

ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్త‌మ్ రెడ్డి

నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి!

ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?

వ‌ర్త‌మాన సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రైన అవ‌గాహ‌నను అందిస్తూ, ప్ర‌జ‌ల ప‌క్షాన గొంతును వినిపించే లామ‌కాన్, ముగ్గురు ప్ర‌ముఖ ఉద్య‌కారుల‌ను ఒకే వేదిక‌మీదికి తీసుకువ‌స్తోంది. ఆగ‌స్టు 15 సాయంత్రం 7 గంట‌ల‌కు లామ‌కాన్‌లో నిర్వ‌హించే.....

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ బాకీ హై

22 రాష్ట్రాలు, 44 ప‌ట్ట‌ణాలు, 50 ప్ర‌ద‌ర్శ‌న‌లు... ఇది బాహుబ‌లి సినిమా కాదు... మ‌తోన్మాద రాజ‌కీయాల్నిన‌గ్నంగా నిల‌బెట్టిన డాక్యుమెంట‌రీ చిత్రం. వ‌ర్త‌మాన చ‌రిత్ర‌కు సాక్ష్యం.....

మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !

మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు.....

వాళ్ళు హంతకులు : మనుషులనే కాదు గోవులనూ చంపుతారు.

ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌ జిల్లాలోని జమూల్‌ నగర్‌ నిగమ్‌ గ్రామానికి చెందిన బీజేపీ నేత హరీశ్‌ వర్మ ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఏడు సంవత్సరాలుగా రాజ్‌పూర్‌ గ్రామంలో ఓ గోశాలను నడుపుతున్నారు. అయితే ఆయన సొమ్మును దిగమింగి ఆ ఆవులను ఊరి మీదికి వదిలేస్తాడనే ఆరోపణలు

BJP may lose Gujarat if polls are held today: RSS internal survey

BJP may not do well and lose Gujarat if elections are held in state in the present circumstances, a fresh internal survey conducted by partyʹs ideological mentor RSS has concluded...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హిందూ