ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజపూరితంగా సాగుతున్న నక్సల్బరీ వారోత్సవాలు


ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజపూరితంగా సాగుతున్న నక్సల్బరీ వారోత్సవాలు

ఈ దేశ విముక్తి సరైన మార్గం చూపిన... ఈ దేశపు తూర్పు వాకిట అరుణారుణ సంతకం చేసిన... కమ్యూనిజం ముసుగేసుకొని, ఎన్నికల‌ పందులదొడ్లో మునిగి ఈ దేశపు పాలక వర్గాల తొత్తులుగా, భానిసలుగా మారిన రివిజనిజం నడ్డి విరగొడుతూ.. వసంత కాల మేఘ గర్జన చేస్తూ..నక్సల్బరీ ఉద్యమ నెలబాలుడు పుట్టి ఇవ్వాల్టికి 50 ఏండ్లు. పాలకులే ప్రకటించినట్టు 17 రాష్ట్రాలలో, 250 జిల్లాలలో పీడితుల గుండెల్లో అరుణ పతాకమై ఎగురుతున్న, దోపిడి వర్గాల గుండెల్లో భూకంపాలు సృష్టిస్తున్న నక్సల్బరీ ఇవ్వాళ్ళ ఆజానుబాహుడు... అనంత బలసంపన్నుడు... వేలాదిమంది అమర వీరవనితల, వీరుల త్యాగాలతో మరింత పదునెక్కిన ఈ నక్సల్బరీ బాట వైపు ప్రపంచ పీడిత ప్రజలు ఆశగా చూస్తున్నారు. 50 ఏండ్ల నక్సల్బరీ వారోత్సవాల వేళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బహిరంగ సభలు సమావేశాలు జరుగుతున్నాయి. కెనడా, లండన్, ఇటలీ, బాంగ్లాదేశ్ తో సహా అనేక దేశాల్లో మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలు, సంఘాలు భారత విప్లవానికి వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రతినపూనాయి. ఇటు దేశంలో బీహార్ మొదలుకొని కేరళ వరకు పట్టణాల్లొ, పల్లెల్లో, అడవుల్లో వేలాది సభలు జరిగాయి... ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా...

తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో, చత్తీస్ గడ్ లో వందలాది సభలు జరిగినట్టు తెలిసింది. నక్సలబరీ వారోత్సవాలను విజయవంత చేయాలని కోరుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ పట్టణ‌, మైదాన ప్రాంతాల్లో కూడా పోస్టర్లు, బ్యానర్లతో ప్తచారం నిర్వహిస్తోంది. తెలంగాణ లోని భద్రాచలం పట్టణంలో , చర్ల లో పోస్టర్లు అంటించారు. చర్లకు దగ్గర్లోని తాలిపేరు వంతెన పరిసర ప్రాంతాల్లో అనేక బ్యానర్లు కట్టారు.
ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా కలిమెల, పొడియా, చిత్ర కొండ కటాఫ్ ఏరియా తదితర ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు అంటి‍చారు. వేలాది కరపత్రాలు పంచిపెట్టారు. వందలాది ఆదివాసీ గ్రామాల్లో సభలు , సమావేశాలు నిర్వహించారు. వేలాదిమంది ఆదివాసులు 50 ఏండ్ల నక్సలబరీ వర్దిల్లాలంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ సభలను అడ్డుకోవడానికి బీఎస్ ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎసోజీ, డీబీఎఫ్ దళాలు గ్రామాలపై దాడులు నిర్వహిస్తున్నాయి. ఒక వైపు పోలీసు దాడుల మధ్యనే ఆదివాసులు నక్సల్బరీ వారోత్సవాలను జరుపుకుంటున్నారు.
కొందమాల్, గంజాం, రాయగడ, గజపతి జిల్లాల్లో కూడా మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు అంటించారు.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ , విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పోలీసు పదఘట్టనల మధ్యనే ఆదివాసులు నక్సల్బరీ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అనేక గ్రామాల్లో సభలు జరుగుతున్నాయి. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా చిం తూరు ఏరియాలో మావోయిస్టు పార్టీ విస్త్రుతంగా పోస్టర్లను అంటించింది. మరో వైపు మావోయిస్టులకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా పోలీసులు కొయ్యూరు, కేడీ పేట, చింతపల్లి, అరుకు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు
పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను విస్తృ తం చేశారు. గ్రేహౌండ్స్, జిల్లా స్పెషల్‌ పార్టీ, ఏపీఎస్పీ బలగాలు బృందాలుగా విడిపోయి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఈ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

చత్తీస్ గడ్ లో క్రాంతికారీ జనతన సర్కార్ అద్వర్యంలో వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీలు జరిగాయి.
విప్లవ రచయితల సంఘం అద్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విఙాన కేంద్రంలో 50 ఏండ్ల నక్సల్బరీ బహిరంగ సభ జరిగింది. విప్లవ రచయితల సంఘం సభ్యుడు, ఆర్డీఎఫ్ జాతీయ అధ్యక్షుడు వరవరరావు, విరసం కార్యదర్శి వరలక్ష్మి, విరసం సభ్యులు, కళ్యాణ రావు, కాశిం, చైతన్య మహిళా సమాఖ్య నాయకురాలు దేవేంద్ర, అమరుల బందు మిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, పౌరహక్కుల సంఘం కార్యదర్శి నారాయణ రావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యదర్శి నలమాస కృష్ణ, డీటీఎఫ్ నాయకుడు కృష్ణప్ప, విద్యార్థి నాయకులు కోట శ్రీనివాస్, సాయన్న, పృథ్వి , మద్దిలేటి, చిర్రా రవి తదితరులు ప్రసంగించారు.
శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో అమరవీరుల స్మారక కమిటి అద్వర్యంలో గ్రామంలో ఊరేగింపు , బహిరంగ సభ జరిగాయి. అమరురాలు తెలుకల సరస్వతి అక్క దండాసమ్మ, పోతనపల్లి పారమ్మ కూతురు నిర్మల జెండా ఆవిష్కరించగా దాసరి శ్రీరాములు ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సభలో సీనియర్ జర్నలిస్టు, వీక్షణం ఎడిటర్, రచయిత, ఎన్. వేణు గోపాల్ , విప్లవ రచయితల సంఘం సభ్యుడు బాసిత్, అమరుల బందు మితృల సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్ జోగి కోదండం, స్మారక కమిటీ కన్వీనర్ పోతనపల్లి విశ్వనాథం, దేశ భక్తి ప్రజాతంత్ర ఉద్యమం జిల్లా కార్యదర్శి పాలిన వీరాస్వామి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య కార్యదర్శి పుచ్చ ధుర్యోదన, పోతన పల్లి నారాయణ తదితరులు ప్రసంగించారు. డప్పు రమేశ్ , ప్రజాకళామండలి బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రెండు వేలమందికి పైగా హాజరైన సభ ఆద్యంతం ఉత్తేజపూరితంగా సాగింది.
సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ అద్వర్యంలో రాష్ట్రంలో, దేశంలో పలు ప్రాంతాల్లో 50ఏండ్ల నక్సల్బరీ సభలు జరిగాయి. పలు ప్రజాసంఘాలు కూడా అనేక చోట్ల 50ఏండ్ల నక్సల్బరీ వారోత్సవాలను నిర్వహించాయి

Keywords : naxalbari, maoists, naxals, struggles,
(2021-07-29 03:42:10)No. of visitors : 1719

Suggested Posts


నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...

మొదటి అయిదుగురు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతోను, ఆరుగురు పట్టణ యువకులతోను, ముగ్గురు పోర్టు ఉద్యోగులతోను, కొద్దిమంది షిప్ యార్డు కార్మికులతోను సంబంధాలు ఉండేవి. వీరిలో ముఖ్యులను నాకు పరిచయం చేసింది ప్రముఖ రచయిత రావిశ్రాస్తి కొడుకు కామ్రేడ్ నారాయణమూర్తి. కృష్ణా జిల్లాలో కామ్రేడ్ కె.ఎస్. కుడి భుజంగా పేరొందిన కామ్రేడ్ తప్పెట సుబ్బారావు నాకు షెల్టర్...

Maoists are the Real Communists - Jaison C Cooper

Itʹs 50 years and the spirit continues. Itʹs a movement that has been loved and hated by many alike. Itʹs also a movement nobody can never ignore. But has it been understood properly? Lots of blood, violence, sacrifice, nostalgia, romance and adventurism have been attached to it. There is no limit to the misunderstanding on the Naxal movement....

నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు

ఈ కాలంలో ఆయన మావద్దకు వచ్చిన ఓ రోజు తన అంగీ పక్కజేబు నుండి మడత పెట్టి ఉన్న ఓ కాగితాన్ని బయటకు తీసి మడతవిప్పి ఇది చూడండని నా చేతికిచ్చాడు. చూస్తే అది కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక రేఖా చిత్రం. ఎవరో గజిబిజిగా చేత్తో గీసి ఇచ్చిన ఓ బొమ్మ. ఆలోచించి పోల్చుకుంటే అది ఓ చేతిబాంబు బొమ్మని అర్థమైంది. అంతకు మించి ఇంకే వివరాలు అందులో లేవు.

 నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు (2)

నక్సల్బరీ ఉద్యమ ఆశయాల పట్ల, విలువలపట్ల ఎంతో గౌరవం ఉంది. అందుచేతనే నక్సల్బరీ రాజకీయంతో నేను అనుబంధం ఏర్పర్చుకుని కొనసాగిస్తున్నాను. అంతేగాక ఒక్క నక్సల్బరీ రాజకీయ పంథా మినహా, భారత దేశంలో ఇప్పటికి ఉనికిలో ఉన్న మరే ఇతర రాజకీయ పంథా భారత దేశ విప్లవాన్ని ముందుకు నడిపించలేదని రుజువైంది....

Germany, Berlin: Long live Peopleʹs War! Long live Naxalbari !

On 20 May, an international action day took place on the occasion of the 50th anniversary of the Naxalbari insurrection....

Naxalbari: its relevance for today… and for tomorrow

The stormy period of the nineteen sixties gave birth in several countries to uprisings, movements and organisations that continue to have a lasting impact to this day...

50 ఏండ్ల నక్సల్బరీ... పులకించిన బొడ్డపాడు

శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ బొడ్డపాడు. ఆ పోరాటానికి ఎంతోమంది వీరులను అందించిన గడ్డ బొడ్డపాడు. శ్రీకాకుళ సాయుధ పోరాట చరిత్రలో ఆ ఊరిది ఓ పేజీ అలాంటి గ్రామం...

Bangladesh: Celebration of 50 years of Naxalbari..

The importance and dignity of the peasant uprising of Naxalbari is immense in the communist movement of South Asia . With the influence of Chinaʹs cultural revolution in 1967, the peasantʹs movement in West Bengalʹs rural areas was the voices of the struggles...

50 Years of Naxalbari in Canada

The villages, towns, soils, furrows of fields, woods and mountains, rivulets and rivers of vast India turned red with the warm blood of these thousands of immortal martyrs which included hundreds of women comrades. In the thorny and tortuous...

Bangladesh: 50th Anniversary of Naxalbari celebrated in Dhaka

Procession and discussion meeting held at 50th anniversary of Naxalbari was held in Dhaka on 25th May. At around 3:30 pm a procession started from the Press Club to Progoti conference room, Mukti Bhawan, 2 Purana Paltan in Dhaka. The meeting and Discussion was led by Jafar Hossain, assisted by Atif Anik...

Search Engine

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ
ప్రతి మనిషి జేబులో పోలీసు!
బాలికలపై సామూహిక అత్యాచారం - బాధితులదే తప్పన్న గోవా ముఖ్యమంత్రి
kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI
పెగసస్ వ్యవహారం: పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరగకుండా అడ్డుకున్న‌ బీజేపీ
చరిత్రాకాశంలో ధ్రువనక్షత్రం
Learn From Charu Mazumdar! -Communist Workers Front, Canada
ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI
Naxalbari: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
పోలీసుల దుర్మార్గం - యువకుడి ఆత్మహత్య‌
సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !
ఢిల్లీలో సోమవారం మహిళా రైతుల ప్రదర్శన‌
UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు
పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు సహాయం చేయండి -మావోయిస్టు పార్టీ పిలుపు
భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు
దేశ రాజధానిలో రేపు రైతు పార్లమెంటు - అనుమతి ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం
మోడీని విమర్షించినందుకు జర్నలిస్టును ఉద్యోగం నుండి తీసేసిన టీవీ ఛానల్
రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!
అమ్రాబాద్ చెంచులపై ఫారెస్టు అధికారుల దాడులు - పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ‌
UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి
ఒక వైపు ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు... మరో వైపు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు
more..


ప్రపంచవ్యాప్తంగా