ʹరాముడికి వ‌ర్తించే న్యాయం ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించ‌దాʹ


ʹరాముడికి వ‌ర్తించే న్యాయం ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించ‌దాʹ

ʹరాముడికి

జి.ఎన్‌. సాయిబాబ‌.... యూనివ‌ర్సిటీ అధ్యాప‌కుడు. ఆలోచ‌నా ప‌రుడు. హ‌క్కుల కోసం గ‌ళ‌మెత్తిన ఉద్య‌మ‌కారుడు. దండ‌కార‌ణ్యం మొద‌లు ఢిల్లీ వ‌ర‌కు... తెలంగాణ మొద‌లు క‌శ్మీర్ వ‌ర‌కు... ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు త‌న గొంతు నిచ్చాడు.
అడ‌వి మీద హ‌క్కు ఆదివాసీల‌దే అని నిన‌దించాడు. సామ్రాజ్య‌వాద దోపిడీని ప్ర‌శ్నించాడు. ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్‌కెద‌రుకు నిలిచాడు. రాజ్యానికి కంట‌గింప‌య్యాడు. ఇంకేముందీ.... మ‌రో మ‌నిషి సాయం లేకుండా క‌ద‌ల‌లేని 90 శాతం విక‌లాంగుడైన సాయిబాబ దేశ‌ద్రోహి అయ్యాడు. మావోయిస్టు అయ్యాడు. ఇప్ప‌డు నాగ్‌పూర్ జైల్లో జీవిత ఖైదు అయ్యాడు. మూడు చ‌క్రాల కుర్చీని చీక‌టి గ‌ది మింగేసింది.
ప్ర‌స్థుతం... రక్తపోటు, గుండెలో ఇన్ఫెక్షన్‌, చేతి కండ‌రాలు దెబ్బ‌ తిన‌డం, వెన్నెముక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జైలు అధికారులు ఎలాంటి వైద్య స‌హ‌కారం అందించ‌క‌పోవ‌డంతో సాయిబాబ ప‌రిస్థితి రోజు రోజుకూ విష‌మిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న ప్రొఫెస‌ర్ సాయిబాబ‌ను కాపాడుకోవ్స‌లిన అవ‌స‌రం ప్ర‌జాస్వామిక వాదులంద‌రిపైన ఉంది.

ఈ నేప‌థ్యంలో ప్రొఫెస‌ర్ జి.ఎన్‌. సాయిబాబ స‌హ‌చ‌రి వ‌సంత‌కుమారి ఈ నెల 17 ఉస్మానియా విద్యార్థుల‌తో సంభాషించారు. జైలులో సాయిబాబ ప‌రిస్థితిని వివ‌రించ‌డంతో పాటు, సాయిబాబ, అత‌ని స‌హ‌చ‌రుల విడుద‌ల కోసం చేయ‌వ‌లిసిన కృషిని గురించి చ‌ర్చించారు. అంతేకాదు... సాయిబాబ త‌న జీవితమంతా ఏ రాజ‌కీయాల‌నైతే ప్ర‌చారం చేశారో.. ఏ ప్ర‌జ‌ల కోస‌మైతే ఉద్య‌మించారో ఆ ప్ర‌జ‌ల ప‌క్షాన త‌న గొంతును వినింపిచారు వ‌సంత‌. విద్యార్థుల‌తోA S Vasantha Kumari జ‌రిపిన సంభాష‌ణ సంక్షిప్తంగా.
-క్రాంతి టేకుల‌

"సాయిబాబ‌ను క‌లిసేందుకు ఈనెల 13న నాగ్‌పూర్ సెంట్ర‌ల్ జైలుకు వెళ్లాను. జాలీ ములాఖ‌త్‌. కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశం ల‌భించింది. రెండు వైపులా మ‌స‌క‌బారిన అద్దాలు. వాటి గుండా చూస్తే అవ‌త‌లి వైపు మ‌నుషులు అంతంత మాత్రంగానే క‌నిపిస్తారు. మాట్లాడేది స‌రిగ్గా వినిపించ‌దు కూడా. సాయిబాబ చాలా బ‌ల‌హీనంగా ఉన్నారు. చేతులు కూడా క‌ద‌ప‌లేని స్థితిలో. 2014లోనే చేతి న‌రాలు దెబ్బ తిన్నాయి. క్ర‌మంగా శ‌రీరంలోని అవ‌య‌వాల‌న్నీ ఒక్కొక్క‌టి దెబ్బ‌తింటున్నాయి.

గ‌డ్చిరోలి సెష‌న్ కోర్టుకు తీసుకురావ‌డానికి ముందు వ‌ర‌కూ ఆసుప్ర‌తిలోనే ఉన్నాడు. చికిత్స న‌డుస్తున్నందున కోర్టుకు హాజ‌రు కాలేన‌ని జ‌డ్జికి విన్న‌వించుకున్న‌ప్ప‌టికీ.. రెండు గంట‌ల కోసం వ‌చ్చివెళ్లాల‌ని సూచించారు జ‌డ్జీ. అలా రెండు గంట‌ల కోస‌మ‌ని వెళ్లిన వ్య‌క్తికి జీవిత ఖైదు విధించి తిరిగి జైలుకు త‌ర‌లించారు. తీర్పు సంద‌ర్భంగా కోర్టు హాలులో భారీగా మోహ‌రించిన‌ పోలీసుల‌ను, ఆవ‌ర‌ణ‌లో సిద్ధంగా ఉంచిన మైనింగ్ ప్రూఫ్ వాహ‌నాల‌ను చూస్తే సాయిబాబ‌పై శిక్ష ముందే ఖ‌రారైన‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

గ‌డ్చిరోలి సెష‌న్ కోర్టు ఇచ్చిన‌ 827 పేజీల తీర్పులో సాయిబాబ ఇంట్లో దొరికిన ఎల‌క్ట్రానిక్ డివైజ్‌ల్లో మావోయిస్టు పార్టీ ప‌త్రాలు ఉన్నాయంటూ పేర్కొంది. ఒక యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ స‌మ‌కాలీన రాజ‌కీయాల‌ను అధ్య‌య‌నం చేయ‌డం నేర‌మా? ఆయా పార్టీల వైఖ‌రిని తెలుసుకోవ‌డం త‌ప్పా? అయినా... మావోయిస్టు రాజ‌కీయాలు క‌లిగి ఉండ‌డం నేరం కాద‌ని స్వ‌యంగా సుప్రీం కోర్టే చెప్పింది. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా సాయిబాబ‌, అత‌ని స‌హ‌చ‌రుల‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ శిక్ష విధించింది కోర్టు. ప్ర‌భుత్వ విధానాల‌ను నిల‌దీసిన వాళ్ల‌ను జైల్ల‌లో బంధించి గొంతునొక్కాల‌నుకుంటున్న రాజ్యం కుట్ర‌ల‌ను ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవ‌చ్చు.
అడ‌వి నుంచి ఆదివాసీల‌ను గెంటివేసి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు ఖ‌నిజ సంప‌ద‌ను అప్ప‌గించాల‌ని చూస్తోంది. అడ‌విలోనే పుట్టి అడ‌విలోనే పెరిగి, అడ‌వినే జీవ‌నాధారంగా చేసుకున్న ఆదివాసీల‌ను గెంటివేసే హ‌క్కు ప్ర‌భుత్వాల‌కు ఎక్క‌డిది. రామ‌జ‌న్మ‌భూమి పేరుజెప్పి వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌గ‌ల బాబ్రీ మ‌సీదును కూల్చేశారు క‌దా? రాముడికి వ‌ర్తించే న్యాయం ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించ‌దా?
అస‌లు ఆదివాసీలు ఎలాంటి అభివృద్థిని కోరుకుంటున్నారో.. ఎప్పుడైనా ఈ ప్ర‌భుత్వాలు తెల‌సుకునే ప్ర‌య‌త్నం చేశాయా? ఇప్ప‌టికీ వేలాది మంది ఆదివాసీలు విష జ్వ‌రాలతో మ‌ర‌ణిస్తున్నారు. చాలా జాతులు అంత‌రించిపోయాయి. వాళ్ల‌కు క‌నీసం విద్య‌, వైద్యం లాంటి స‌దుపాయాలు కూడా అందించ‌లేదు. పైగా అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌నే సాకుతో వాళ్ల‌పై యుద్ధం చేస్తోంది ప్ర‌భుత్వం. ఈ యుద్ధాన్ని వ్య‌తిరేకించినందుకే సాయిబాబ వంటి వాళ్ల‌ను జైళ్ల‌లో నిర్భందిస్తోంది.
ప్ర‌భుత్వ విధానాల‌ను నిల‌దీసిన వాళ్ల‌ను జైల్ల‌లో బంధించి గొంతునొక్కాల‌నుకుంటున్న రాజ్యం కుట్ర‌ల‌ను ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవ‌చ్చు. అడ‌వి హ‌క్కు మాదే అంటున్న ఆదివాసీల‌ను సైతం అలా జైళ్ల‌లో నిర్భందిస్తోంది. జ‌ల్ జంగ‌ల్ జ‌మీన్ నినాదాల‌తో వంద‌ల ఏళ్లుగా ఆదివాసీలు పోరాడుతున్నారు. ఈ పోరాటాల‌ను అణ‌చివేయ‌డం కోసం ప్ర‌భుత్వం వాళ్ల‌ను మావోయిస్టులుగా, అభివృద్ధి నిరోధ‌కులుగా చిత్రీక‌రిస్తోంది. అడ‌వి నుంచి ఆదివాసీల‌ను గెంటివేసి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు ఖ‌నిజ సంప‌ద‌ను అప్ప‌గించాల‌ని చూస్తోంది. అడ‌విలోనే పుట్టి అడ‌విలోనే పెరిగి, అడ‌వినే జీవ‌నాధారంగా చేసుకున్న ఆదివాసీల‌ను గెంటివేసే హ‌క్కు ప్ర‌భుత్వాల‌కు ఎక్క‌డిది. రామ‌జ‌న్మ‌భూమి పేరుజెప్పి వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌గ‌ల బాబ్రీ మ‌సీదును కూల్చేశారు క‌దా? రాముడికి వ‌ర్తించే న్యాయం ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించ‌దా?
అస‌లు ఆదివాసీలు ఎలాంటి అభివృద్థిని కోరుకుంటున్నారో.. ఎప్పుడైనా ఈ ప్ర‌భుత్వాలు తెల‌సుకునే ప్ర‌య‌త్నం చేశాయా? ఇప్ప‌టికీ వేలాది మంది ఆదివాసీలు విష జ్వ‌రాలతో మ‌ర‌ణిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా జాతులు అంత‌రించిపోయాయి. వాళ్ల‌కు క‌నీసం విద్య‌, వైద్యం లాంటి స‌దుపాయాలు కూడా అందించ‌లేదు. పైగా అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌నే సాకుతో వాళ్ల‌పై యుద్ధం చేస్తోంది ప్ర‌భుత్వం. ఈ యుద్ధాన్ని వ్య‌తిరేకించినందుకే సాయిబాబ వంటి వాళ్ల‌ను జైళ్ల‌లో నిర్భందిస్తోంది.
ఏకంగా... మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి సాయిబాబ మాస్ట‌ర్ మైండ్ అని, అత‌ని కార‌ణంగా 82 నుంచి రాష్ర్టంలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు. సుక్మా దాడికి కూడా అత‌డే కార‌ణం అన్నాడు. విన‌డానికే హాస్యాస్ప‌దం. ఒక‌వేళ న‌క్స‌వ‌ల్లే అభివృద్ధి జ‌ర‌గ‌ట్లేద‌నేది నిజ‌మే అయితే.. న‌క్స‌లైట్ల ప్ర‌భావం లేని ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ది జ‌రుగుతోంది? 2015 - 16 వార్షిక సంవ‌త్స‌రం ఆరునెల‌ల్లోనే విద‌ర్భ‌లో 1200 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మ‌రి దానికి ఎవ‌రు బాధ్యులు. ఆ హ‌త్య‌ల‌కు ఎవ‌రికి శిక్ష విధించాలి?
ఇప్పుడు కూడా జైలులో సాయిబాబ‌కు ఎలాంటి వైద్య సేవ‌లూ అందించ‌డం లేదు. క‌నీసం మందులు కూడా తీసుకోవ‌డంలేదు. త‌ప్ప‌ని స‌రి వాడాల్సిన మందులు కూడా జైలు డాక్ట‌ర్ వ‌ద్దే ఆగిపోతున్నాయి. లైఫ్ సేవింగ్ మెడిసిన్ అంద‌డంలేదు. జైలులో ఆహారం జీర్ణం అవ్వ‌డంలేదు. వాంతులు. గ‌త నెల రెండు సార్లు సృహ‌ త‌ప్పి ప‌డిపోయారు. ఇలాగే కొన‌సాగితే... కోమాలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంటుంది. అండా సెల్ నుంచి జైల‌ర్‌కి స‌మాచారం వెల్ల‌డానికి క‌నీసం 12 మంది గార్డుల‌ను దాటి వెళ్లాలి. అప్పుడు కూడా జైల‌ర్ డాక్ట‌ర్ కి స‌మాచారం ఇవ్వాల‌నుకుంటే త‌ప్ప వైద్యం అందే ప్ర‌స‌క్తి లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న సాయిబాబ‌ను కాపాడుకోవాలంటే... అత‌ని విడుద‌ల కోసం అంద‌రం ప్ర‌య‌త్నం చేయాలి.
సాయిబాబ మాత్ర‌మే కాదు, సాయిబాబ‌తో పాటు జీవితఖైదు అనుభ‌విస్తున్న అత‌ని స‌హ‌చ‌రులు, సుక్మా జైలులో ఉన్న టీడీఎఫ్ స‌భ్యులు అంద‌రి విడుద‌ల కోసం కృషి చేయాలి. అనివార్యంగా రాజ‌కీయ ఖైదీలుగా మారిన వేలాది మంది ఆదివాసీలు జైలు జీవితం గ‌డుపుతున్నారు. అలాంటి వారంద‌రి విడుద‌ల కోసం ప్ర‌జాస్వామిక వాదులుగా మ‌నం పోరాడాల్సిన అవ‌స‌రం ఉంది. అన్ని రూపాల్లో ప్ర‌చారం నిర్వ‌హించాలి"
- వ‌సంత కుమారి (జి.ఎన్ .సాయిబాబ స‌హ‌చ‌రి)

Keywords : gn saibaba, vasanta kumari, delhi university, maoist
(2019-09-19 11:24:49)



No. of visitors : 1205

Suggested Posts


సాయిబాబాను చంపేస్తారేమో !

సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి...

A Complaint lodged to NHRC for deteriorating health of Dr. G.N. Saibaba by Defend in India

Most humbly this is to bring to your notice that I came to know from the wife of Professor Saibaba that on 22nd February 2017, Prof. G. N. Saibaba was admitted in ICU of a hospital for a mild chest pain and breathlessness and a severe pain in abdomen....

Prof. G N Saibabaʹs emotional letter from jail to his wife

Now you are the lone fighter fighting for my freedom. Donʹt get disheartened in these dark days we should not lose our hopes and dreams for the darkness canʹt permanently overshadow the light. These are not empty words.....

Saibabaʹs health worsening - Delegation seeks NHRC intervention

A delegation headed by Delhi University professor G N Saibabaʹs wife, Vasantha Kumari, on Thursday sought the intervention of the National Human Rights Commission to ensure proper medical care for the jailed academic. The condition of Saibaba...

iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba

Now it is 47.5 degrees C. On 25th May at around 11.15 am I suffered severe chest pain, syncope attack and high-level dehydration together all at the same time. I was sitting at my table and had just started eating. I hardly took two spoonfuls of rice into my mouth.

Freedom and Justice for GN Saibaba!

The Popular Resistance – Left Anti-imperialist Cooperation condemns this decision of the Indian court. We send our unequivocal support to GN Saibaba, his comrades and the movement of support that grows in India....

RELEASE G.N. SAIBABA IMMEDIATELY - TVV

When judiciary itself starts bypassing its role, then it points towards a dying democracy. It is ironic that even while holding these six people are so dangerous that they should be incarcerated for major part of their lives, the judgment fails to point out...

ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా

47.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నడుమ అండా సెల్ లో ఉండలేకపోతున్నాను. గతనెల 25 వ తేదీన ఉదయం సుమారు 11.15 గంటల ప్రాంతంలో ఛాతీలో తీవ్రమైన నొప్పితో పాటు డీహైడ్రేషన్ ఒకేసారి చుట్టుముట్టాయి. ఆ సమయంలో నేను నా టేబుల్ దగ్గర కూర్చొని రెండు చెంచాల అన్నం నోట్లో పెట్టుకున్నానో

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
more..


ʹరాముడికి