సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య

2013 సెప్టంబర్ 7 న జరిగిన ఏపీ ఎన్ జీవోల‌ ʹసమైక్యాంధ్ర సభʹ గుర్తుందా ? నిజాం కాలేజ్ విద్యార్థులకు బెదిరింపు సైగలు చాస్తూ మెడలు నరుకుతాం అని హెచ్చరికలు చేసిన గూండాలు గుర్తున్నారా ? సభ పేరుతో తెలంగాణా పై చిమ్మిన విషం గుర్తుందా ? ఆ సభలో తెలంగాణ పై తెలంగాణ ఉద్యమకారులపై , నాయకులపై చేస్తున్న దుర్మార్గపు దాడిని భరించలేక కడుపు రగిలి పోయి. జై తెలంగాణ నినాదాలు చేసిన ఉద్యమకారులు గుర్తున్నారా ? చేగో పేరుతో అందరికీ పరిచయమైన చేగొండి చంద్రశేఖర్, పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాస గౌడ్.. శ్రీశైలంలు గుర్తున్నారా... సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి.... అరెస్టయ్యి... ఉద్యోగం నుండి సస్పెండయ్యి... ఊరూరు తిరిగి తెలంగాణాను గానం చేసిన శ్రీనివాస్ గౌడ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. తెలంగాణ వచ్చాక అనేక కష్టలు పడి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగమైతే దక్కించుకున్నాడు కానీ తాను కలలు కన్న తెలంగాణను సాధించలేకపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతనిపై సాగిన వేధింపులే తెలంగాణ లో కూడా కొనసాగాయి. ఉన్నతాధికారుల తిట్లు, డ్యూటీ ఇవ్వకుండా వేధింపులు... హౌస్ అరెస్టులు... చివరకు సస్పెన్షన్ దాకా శ్రీనివాస్ పై దాడి కొనసాగింది.
ప్రస్తుతం సిద్దిపేట పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివా్‌సగౌడ్‌ అదే హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కిరణ్‌కుమార్‌ను బూతుమాటలు తిడుతూ తుపాకీతో కాల్చి చంపుతానంటూ బెదిరించాడనే ఆరోపణలతో శ్రీనివాస్ గౌడ్ ను సస్పెండ్ చేశారు. అయితే కిరణ్‌ వాదన అయితే దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అసలు శ్రీనివాస్ గౌడ్‌ ఎవరో తనకు తెలియదని కిరణ్ అంటున్నాడు.
దీనిపై శ్రీనివాసగౌడ్ తన ఫేస్బుక్ టైమ్ లైన్ పై పెట్టిన పోస్టు...

ʹʹతెలంగాణ పోలీస్ శ్రీనివాస్ గౌడ్ సస్పెండ్
తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించి,40 వేల మందికి భయపడని నా గొంతు,ఈరోజు తెలంగాణ రాష్ట్రం ని సాధించుకున్నాక న్యాయం పై,ధర్మం వైపు నిలబడితే సస్పెండ్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కొంత మంది అధికారుల విజ్ఞతకే వదిలివేస్తున్న.నన్ను సస్పెండ్ చేయడానికి కారణాలు........
1)head quarters లో wepon తో కాక్ చేసిండు,ఒక out sourcing employee పై aim చేసి చంపుతా అని దుర్బాషలాడిండు..(ఇది పచ్చి అబద్ధం.పైన ఆ వ్యక్తితో రాయించి తీసుకొచ్చిన లెటర్.మరి దీనికి సమాధానం వాళ్లే చెప్పాలి)
2)un discipline.ఉద్యోగం సక్కగా చెయ్యడు.(ఉద్యోగం సక్కగా చెయ్యకపోతే,మా GD Roster ఉంటది దయచేసి ఆ GD Roster క్షుణ్ణంగా పరిశీలించాలి.లేనిచో మీ పై ఉన్నత అధికారులకు నేను ఫిర్యాదు చేస్తాను)
3)కుకునూర్ పల్లి SI Sir హత్య/ఆత్మహత్య అనే విషయాన్ని fb లో పోస్ట్ పెట్టిన.ఇది వాస్తవం...మరి ఆ పోస్ట్ లో తప్పేముందో వాళ్ళకే అర్ధం కావాలి..ఒక అధికారి చనిపోతే పూర్తి వివరాలు ప్రజలకు,ప్రభుత్వానికి తెలియజేసి మన వ్యవస్థ పై నమ్మకం ను కలిగించాలి కానీ అనుమానాలను కలిగించి ప్రభుత్వానికి చెడు పేరు తేవద్దు అనే ఉద్దేశ్యం తో పెట్టిన పోస్ట్...
4)నేను తప్పు చేస్తే పై అధికారుల వద్దకి తీసుకెళ్లి విచారణ చేసి నా వ్యక్తిత్వంని,నా యొక్క behaviour ని తెలుసుకొని నా పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.కానీ ఇలా సస్పెండ్ చేస్తే మంచి వాడు కాస్త చెడ్డవాడిగా మారే ప్రమాదం ఉంటుంది..
5)Tv 9 లో ప్రసారమైన కుకునూర్ పల్లి దందా లో సిద్దిపేట సీపీ సర్ నుండి మొదలు పెడితే కొంతమంది అధికారుల వరకు లంచాలు,అవినీతి సాక్షాలతో బయటపెట్టడం జరిగింది.మరి వాళ్ల పై చర్యలు ఉండవా?
6)CI భూమయ్య సర్ ఈ సీపీ గారి వేధింపులకు అతడి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నా కూడా సీపీ గారి పై చర్యలు ఎందుకు తీసుకోలేదు...
7)AR Hqrs లో Ri గారి అక్రమాలకు అంతే లేదు...అతడిపై చాలా సార్లు పై అధికారులకు తెలియజేసిన కానీ ఇట్లాంటి వ్యక్తి ని వదిలి నిజాయితితో,న్యాయంగా,ధర్మం గా బతికే నాలాంటి వాళ్లపై అక్రమ అరెస్టులు,బట్టకాల్చి మీదవేసే చర్యలు,అబద్ధాలు ఆడడం మంచిది కాదు..
నేను న్యాయ పోరాటానికి సిద్ధం...
జై తెలంగాణ,జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్.ʹʹ

ఇదీ తెలంగాణ కోసం తపించిన శ్రీనివాస్ గౌడ్ వేదన... ఆయనతో ఫోన్ లో మాట్లాడినప్పుడు... హరీష్ రావు, కేసీఆర్ తనకు న్యాయం చేస్తారని, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేయరని అన్నాడు. ఇప్పటికీ ఆయన అధికారులనే తప్పుపడుతున్నాడు కానీ భయంతోనో భక్తితోనో నాయకుల తప్పు మాత్రం ఏమీ లేదంటున్నాడు. ఇంకా వాళ్ళలో తెలంగాణ వాదం ఉందని, ప్రజలకోసం పాటుపడతారనే భ్రమల్లోనే ఉన్నట్టున్నాడు. అందరిని కొంత కాలం మోసం చేయవచ్చు...కొందరిని ఎల్ల కాలం మోసం చేయవచ్చు... కానీ అ‍ందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు.

Keywords : telangana, srinivas goud, srisailam, police,
(2024-04-24 19:04:45)



No. of visitors : 7209

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సమైక్య