GSTకి వ్యతిరేకంగా వ్యాపారుల నిరసనలు... బీజేపీ ఉక్కుపాదం

GSTకి

జీఎస్టీపై దేశవ్యాప్తంగా వ్యాపారుల నిరసనలు పెల్లుబుకుతున్నాయి. జిఎస్టిని నిరసిస్తూ గుజరాత్ అట్టుడుకుతోంది. వ్యాపారుల నిరసనలపై బీజేపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. పోలీసులతో లాఠీచార్జ్ లో అనేకమంది వ్యాపారులు గాయాలపాలయ్యారు. దాంతో గురువారం దుకాణాలను మూసేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అనుమతినివ్వకపోవడంతో శనివారానికి ర్యాలీని వాయిదావేశారు. సూరత్‌ జిఎస్‌టి సంఘర్ష్‌ సమితి పిలుపుతో సూరత్‌లో వేలాదిమంది వస్త్ర వ్యాపారులు రోడ్డుమీదకొచ్చారు. రింగ్‌రోడ్డు వద్ద శనివారం ఈ నిరసన చేపట్టారు. మూలుగుతున్న నక్కపై తాటి పండు పడ్టట్టు.. కష్టకాలంలో ఉన్న తమ‌పై జిఎస్‌టి పిడుగులా వచ్చి పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

జౌళి పరిశ్రమ ఇప్పటికే దివాలా తీసిందని, ఇప్పుడు ఐదు శాతం జిఎస్‌టితో మా కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి దాపురించిందని వ్యాపారులు ఆవెదన చెందుతున్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టడంతో గత వారం రోజులుగా వ్యాపారులు నిరసనలను ఉధృతం చేశారు. ఈ ర్యాలీలో వేలాదిమంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి ʹజిఎస్‌టిని ఎత్తివేయండి..కూడు, గుడ్డు, ఇళ్లు కల్పించండని వ్యాపారాలు నినాదాలు చేశారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మోడీ సర్కారును వారు హెచ్చరించారు. వాస్తవానికి రింగ్‌రోడ్డు నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు సుమారుగా ఏడు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించేందుకు వస్త్ర వ్యాపారులు అనుమతి కోరారు. కానీ కేవలం రింగ్‌ రోడ్డులో ఉన్న వస్త్ర దుకాణ సముదాయాల పరిధిలోనే ర్యాలీ నిర్వహించాలని పోలీసులు షరతులు పెట్టారు. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ర్యాలీకి భారీ మద్దతు లభించింది. ఎంబ్రాయిడరీ వర్కర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలకుపైగా నిర్వహించిన ర్యాలీ ముగిసిన తరువాత జిల్లా కలెక్టర్‌ను కలసి వస్త్ర వ్యాపారుల సంఘం నేతలు మెమోరాండంను అందజేశారు. ర్యాలీ విజయవంతం కావడానికి టెక్స్‌టైల్‌ యువ విభాగమే ప్రధాన కారణమని సూరత్‌ జిఎస్‌టి సంఘర్ష్‌ సమితి అధ్యక్షులు తారాచంద్‌ కసాత్‌ వెల్లడించారు

Keywords : GST, gujarat, cloth murchents, rally, police, lathicharge
(2024-03-25 21:52:37)



No. of visitors : 747

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


GSTకి