తెలంగాణ ఉద్యమ స్పూర్తితో... గూర్ఖాలాండ్ కు మద్దతుగా ఓయూ లో ర్యాలీ

తెలంగాణ

గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్ర‌ ఉద్య‌మం తీవ్ర‌స్థాయికి చేరుకుంది. గ‌డిచిన న‌ల‌బై రోజులుగా గూర్ఖా ప్ర‌జ‌లు ప్ర‌త్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేస్తున్నారు. ప‌శ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, దూవ‌ర్స్‌, తెరాయి ప్రాంత ప్ర‌జ‌లు స్వ‌యం పాల‌న కోసం నూటా ప‌ది సంవ‌త్స‌రాలుగా పోరాడుతున్నారు. గూర్ఖాలాండ్ ప‌ట్ల బెంగాల్ రాజ‌కీయ, ఆర్థిక‌, సాంస్కృతిక ఆధిప‌త్యాన్ని దిక్క‌రిస్తున్నారు. ల‌క్ష‌లాది మంది ఆందోళ‌న కారులు వీథుల్లోకి వ‌చ్చి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. గూర్ఖాల ఉద్య‌మాన్ని అణ‌చివేసేందుకు బెంగాల్ ప్ర‌భుత్వం వేలాదిగా సాయుధ బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. గ‌డిచిన న‌ల‌బై రోజుల్లో ప‌ది మంది ఆందోళ‌న కారులు పోలీసు కాల్పుల్లో మ‌ర‌ణించారు. మరోవైపు గూర్ఖాల ఉద్య‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అందులో భాగంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 150 దేశాల్లో జూలై 30వ తేదిన గ్లోబ‌ల్ గూర్ఖాలాండ్ యూనిటీ మార్చ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. గూర్ఖాలాండ్ ప్ర‌జాస్వామిక ఉద్య‌మానికి ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఐక్య కార్యాచ‌ర‌ణ క‌మిటీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తోంది.
అధిప‌త్య బెంగాలీ ప్ర‌భుత్వం ద‌శాబ్ధాలుగా అమ‌లు చేస్తున్న వివ‌క్ష ఫ‌లితంగా గూర్ఖాలాండ్ విద్య‌, వైద్యం, ఉపాధి వంటి అన్ని మౌళిక రంగాల్లో వెన‌క‌బాటుకు గుర‌య్యింది. ఇప్పుడు.. పాఠ‌శాల స్థాయి నుంచి బెంగాలీ భాష‌ను త‌ప్ప‌ని స‌రి చేస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ తీసుకున్న నిర్ణ‌యం బెంగాలీ సాంస్కృతి ఆధిప‌త్యానికి నిద‌ర్శ‌నం. ఇది గూర్ఖాలాండ్ ప్ర‌జ‌ల ఉనికికే ప్ర‌మాదక‌రంగా ప‌రిణ‌మించ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక రాష్ట్రంలోనే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని గూర్ఖాలు భావిస్తున్నారు .

నెల‌రోజుల‌కు పైగా డార్జిలింగ్ ప్రాంతంలో పూర్తిగా జ‌న‌జీవ‌నం స్థంభించింది. ప్ర‌భుత్వం బ‌లప్ర‌యోగం ద్వారా ఉద్య‌మాన్ని అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. సిలిగురి ప్రాంతంలో గూర్ఖాల ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిఘాతుక ఆందోళ‌న‌ల‌కు తెర‌తీసింది. మ‌రోవైపు ఇంట‌ర్నెట్‌, కేబుల్ క‌నెక్ష‌న్‌, మొబైల్ క‌నెక్ష‌న్స్‌ను తొల‌గించి అణ‌చివేత చ‌ర్య‌ల‌ను తీవ్ర‌త‌రం చేసింది.

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన విద్యార్థులుగా, గూర్ఖాలాండ్ ఉద్య‌మానికి ఓయూ జేఏసీ సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తోంది. బెంగాల్ ప్ర‌భుత్వం గూర్ఖాలాండ్ ఉద్య‌మం పై అమ‌లు చేస్తున్న అణ‌చివేత విధానాల‌ను ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంట‌నే గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. 30 వ తేది ఉస్మానియాలో నిర్వ‌హించే ర్యాలీలో విద్యార్థుల‌తో పాటు న‌గ‌రంలో నివ‌సించే గూర్ఖాలు ఈ ర్యాలీ పాల్గొంటారు.

గ్లోబ‌ల్ గోర్ఖాలాండ్ యూనిటీ మార్చ్‌
----------------------------------
30 జూలై 2017, మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు
ర్యాలీ - ఎన్‌సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వ‌ర‌కు
అనంతరం ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద‌ స‌భ ఉంటుంది.

నిర్వ‌హ‌ణ :
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ (OUJAC)
తెలంగాణ గూర్ఖా ఏకతా మంచ్

(Telangana Gorkha Unity Forum)

(TVV, TVS, DSU, OURS, PDSU, PDSU(V), MSF, NSUI, ASA, BSF, BVS, BCVS, TDVS, CMS, MSO, SC STVS, LSO, ASU, AMSA, APSA, TMNSA, TVUV, SFSJ, NIRUDYOGA JAC, T.S JAC )

Keywords : bengal, gurkhaland, bjp, tmc, mamata benurjee, telangana
(2024-04-24 19:00:18)



No. of visitors : 1516

Suggested Posts


ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టుల మృతి - తప్పించుకున్న హరిభూషణ్, దామోదర్

ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం....

మా స‌భ్యుల‌ను పోలీసులు కిడ్నాప్ చేశారు: టీవీవీ అధ్య‌క్షుడు మ‌హేష్‌

వ‌రంగ‌ల్ పోలీసులు త‌మ స‌భ్యుల‌ను కిడ్నాప్ చేశారంటూ తెలంగాణ విద్యార్థి వేదిక ఆరోపించింది. టీవీవీ కాక‌తీయ‌ యూనివ‌ర్సిటీ నాయ‌కులు చిరంజీవి, రాజుల‌ను గురువారం సాయంత్రం ముగులు పోలీసులు కిడ్నాప్ చేశార‌ని ఆ సంస్థ అధ్య‌క్షుడు మ‌హేష్‌ పేర్కొన్నారు......

భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి

భీమాకోరేగావ్ అల్ల‌ర్లు, ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర పేరుతో రాజ్యం ప్ర‌జాస్వామిక గొంతుల‌ను అణ‌చివేసే కుట్ర చేస్తుంద‌న్నారు. ద‌ళితులు, ఆదివాసీలు, ముస్లింల ప‌క్షాన నిల‌బ‌డిన విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేసేందుకు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల్ని ప్ర‌చారం చేస్తున్న ఉద్య‌మ‌కారుల‌పై అక్ర‌మ కేసులు మోపుతోంద‌న్నారు.

పోలీసును మింగిన వాట్సాప్...!

అతనో పోలీస్ ఆఫీసర్. వాట్సాప్ గ్రూపులో ఓ మెంబర్ కూడా. అదే అతని జీవితానికి ముగింపు పలికేలా చేసింది. ఓ చిన్న పొరపాటు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పింది. కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏపీ షాజి...ఆత్మహత్య సంచలనానికి కారణమైంది.....

కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌

72 ఏండ్లలో పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం పేరిట జ‌రిగిన ఎన్నిక‌లు, అధికారం నెరిపిన పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేద‌న్నారు సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్‌. ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పార్ల‌మెంట‌రీ రాజ‌కీయ పార్టీల విధానాల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల ప్ర‌జాస్వామ్యం

Journalists – Arrested, tortured, jailed in South Bastar

Picked up in July and September end, two Hindi language journalists from the Darbha block in southern Bastar have been under arrest, charged with supporting....

కంచె ఐల‌య్యకు మావోయిస్టు పార్టీ మ‌ద్ద‌తు

నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీ, కేసీఆర్‌లు తమ వ‌ర్గాన్ని ప్రశ్నించడాన్ని, విమర్శించడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే... కంచె ఐలయ్య భావ‌ప్రకటనా స్వేచ్చను అడ్డుకుంటూ. చంపుతామని, నాలుక కోస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తెలంగాణ