include 'men';
?>
దీన్ని మాఫియా అనకుండా ఏమనాలి కేటీఆర్ ?
సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్ళలో ప్రజలపై పోలీసులు దుర్మార్గమైన దాడి చేసి దారుణమైన చిత్రహింసలపాల్జేసిన తర్వాత వచ్చిన నిరసనలు, ఉద్యమాల మూలంగా గత్యంతరంలేక బాదితులను పరామర్శించాడు మంత్రి కేటీఆర్. అయితే ఆస్పత్రిలో బాదితులను పరమార్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఇసుక మాఫియా అనే పదంపట్ల సీరియస్ అయ్యాడు. తమను ఏమైనా విమర్శించండి కానీ ఇసుక మాఫియా అని మాత్రం అనొద్దు అని హెచ్చరించాడు. ఇసుక మాఫియాను మాఫియా అంటే కేటీఆర్ కు ఎందుకు అంత కోపమొచ్చిందో పక్కన పెడితే నిజంగానే ఇసుక మాఫియాలేదా ? ఇసుక మాఫియా బరితెగింపును ఏబీఎన్ ఛానల్ ఆధారలతో సహా బయటపెట్టింది. సిరిసిల్ల లో ఇసుక మాఫియా ఎంత బరితెగించిందో వీడియోలో బంధించింది. TS 22 T15 అనే ఒకే నెంబర్ తో ఆరు లారీలు ఇసుక తీసుకొని వెళ్ళడాన్ని చిత్రీకరించింది. ఒకే నెంబర్ మీద అనేక లారీలు.... ఒకే వేబిల్లు మీద అనేక లారీలు వెళ్తున్నాయని ఏబీఎన్ కథనం చెప్పింది. దాదాపు 50 శాతం ఇసుక లారీలు లెక్కల్లో లేకుండానే పోతున్నాయి. కేటీఆర్ కు తెలుసో లేదో దీన్నే మాఫియా అంటారు. ఆ మాఫియా లీడర్లు గతంలో కాంగ్రె నాయకులు వాళ్ళ బందువులు. అంతకు ముందు టీడీపీ వాళ్ళు ఇప్పుడు టీఆరెస్ నాయకులు వాళ్ళ బందువులు. నేరెళ్ళ ఘటనకు కారణమైన సంతోష్ రావు, శ్రీనివాసరావులు ఎవరో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలియనివాళ్ళెవరన్నా ఉన్నారా ?
ఏబీఎన్ కథనం తర్వాత తప్పని సరి పరిస్థితుల్లో అధికారులు కదిలారట . TS 22 T15 అనే నెంబర్ లారీ పెద్దపల్లికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిది అని గుర్తించారట ! ఇక చర్యలు తీసుకుంటారట! ఇప్పటివరకు ఈ దందా అధికారులకు, నేతలకు తెలియదంటే మనం నమ్మి తీరాలి. లేదంతే ప్రభువులకు మళ్ళీ కోపమొస్తుంది.
Note : ఏబీఎన్ చిత్రీకరించింది మచ్చుకు ఒక్క ఉదహరణ మాత్రమే ఇది మాఫియా బరితెగింపులో ఒక్క శాతం మాత్రమే . నేరెళ్ళ , ఆ చుట్టూ ఉన్న గ్రామల ప్రజలనడిగితే పూర్తి నిజాలు పూసగుచ్చినట్టు చెప్తారు.
ఏబీఎన్ వీడియో కోసం ఈ కింది లింక్ ను ఉపయోగించండి
https://www.youtube.com/watch?v=-3s8eyoW5Pk&t=24s
.
Keywords : ktr, kcr, telangana, sirisilla, nerella, karimnagar, land mafia
(2025-03-14 15:41:05)
No. of visitors : 4219
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..