అధికార పార్టీ కోసం..వలన...చేత‌... ప్రాజెక్టుల ప్రజాభిప్రాయ సేకరణ తంతు - మల్లన్న సాగర్


అధికార పార్టీ కోసం..వలన...చేత‌... ప్రాజెక్టుల ప్రజాభిప్రాయ సేకరణ తంతు - మల్లన్న సాగర్

కాళేశ్వరం ప్రాజేక్ట్ లో భాగంగా సిద్దిపేట పరిసరాల్లో కట్టబోతున్న రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ మరియు కొండపోచమ్మసాగర్ల కు ఆగస్టు 27 వ తేదీన‌ సిద్దిపేట వయోలా గార్డేన్ లో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ తీరుపై ʹమల్లన్న సాగర్ʹ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై పెట్టిన పోస్ట్.

పార్టి_ప్లీనరీనా లేక ప్రజాభిప్రాయ_సేకరణా?

కాళేశ్వరం ప్రాజేక్ట్ లో భాగంగా సిద్దిపేట పరిసరాల్లో కట్టబోతున్న రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ మరియు కొండపోచమ్మసాగర్ల కు ఇయ్యాల సిద్దిపేట వయోలా గార్డేన్ లో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ చేపట్టడం జరిగింది.
ముంపు ప్రాంతాల్లో ఇప్పటివరకి ఏ రకమైన ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు, కాని రిజర్వాయర్లు టెండర్ల దశ కి వచ్చినంక ఇప్పుడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యడమనేది అర్థరహితం...
పేరుకి మాత్రమే భూనిర్వాసితుల పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కని పొద్దుగల్ల 8:30 వరకే వయోలా గార్డెన్లో సిద్దిపేట వనితలు, చుట్టుపక్కల మండలాల అధికార పార్టీ నాయకులతో నిండిపోయింది.
కొద్దిగంత కష్టపడి మొదటి గ్యాలరీలో భూనిర్వాసితులు చందన్న, మహిపాల్, శ్రీనివాస్ లు కూర్చున్నా లోకల్ నాయకులు గమనించి వాళ్ళని మన పోలీస్ అన్నలతో లేపించి ఎక్కడో దూరాన నిలబెట్టడం జరిగింది.ఆ ఇద్దరు కానిష్టేబుల్స్ సభ జరుగుతున్నంత సేపు అన్నలతోనే ఉండటం చూస్తే ప్రభుత్వం మీద అసహ్యమేసింది.

అస్సలు ఏం జరుగుతుందో కూడా తెలియని నిర్వాసిత ప్రాంతాలకి సంబంధం లేని కుల వృత్తుల వాల్లు, కులానికి సంబందించిన పరికరాలతో రావడం చూస్తే అవ్తలి మొన్న అధికార పార్టీ చేసిన ప్లీనరి గుర్తుకొచ్చింది...అవును ఇది ముమ్మాటికి సిద్దిపేట పరిసరాల అధికార పార్టీ కార్యకర్తల సమావేశానికేం తీసిపోదు అనే విషయం అక్కడికొచ్చిన ప్రతొక్కల్కి అర్థమయ్యేదే.

బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి గార్డెన్ వరకు ఉన్న పోలీస్ వాహనాలు, టియర్గ్యాస్ జీపు వందలమంది పోలీస్లని చూస్తే అలనాడు KCR గారు తెలంగాణ కోసం రంగధాంపల్లి దగ్గర నిరాహార దీక్షకి కూసున్నప్పుటి సన్నివేశాలు కండ్లల్లో మెదిలినయ్....
ఇంక సమావేశాల కొచ్చేసరికి కలెక్టర్ గారు ఎవరైతే మాట్లాడదల్చుకున్నారో వాల్ల పేర్లు నమోదు చెయ్యమని తెల్లని కాగితాలు పంపడం జరిగింది,అదే విధంగా అందరికి మాట్లాడె అవకాశం ఇస్తామని(2 minutes) చెప్పడం కూడా జరిగింది.

ప్రజాభిప్రాయం అనేది అధికార పార్టీ ప్రతినిధులతో మొదలయ్యింది ఇంగ వాల్లేం చెప్తారో అందరికి తెల్సిన విషయమే, మైక్ ఆపేసే కంట్రోల్ కలెక్టర్ గారివద్దనె ఉంది, కలెక్టర్ గారు 2-3 సార్లు ఇది రాజకీయ సభ కాదు అని గుర్తుచేయడం ఎక్కడొ కూర్చున్నా వినపడ్డది. నిర్వాసితులు కాని సామాన్య ప్రజలు/చిన్న ప్రజప్రతినిధులు కూడా ఊకదంపుదు మొదలువెట్టినా ఒచ్చినవాళ్ళ పుణ్యమా అని తొందరగనే ముగించారు,చాలాసేపటివరకు నిర్వాసితులకు అవకాశం రాలేదు..రాసిన తెల్లకాగితాల్లో పేరుతో సహా గ్రామం కూడా ఉంది కాబట్టి జల్లెడ పట్టుంటారు.

అంతలోనే ఫంక్షన్ హాల్ ఎంట్రెన్స్ లో ఎన్నో ప్రయాసలకు ఐడెంటిటి చెక్లను అధిగమించి వేములాఘట్ నిర్వాసితులు న్యాయం చెయ్యాలని నినాదాలు చేస్కుంటు ఫంక్షన్ హాల్ లోపలికొచ్చారు,వాళ్ళకి తోడుగా మిగతా నిర్వాసితులు కూడా నోరుకదపడం కనవడ్డది. వాల్లకోసమే మేమున్నామన్నట్లు మన పోలీసన్నలు వాల్ల స్టైల్లో ఆడమగ తేడాలేకుండా భయటకి నూకేసి అప్పటికే సిద్దంగా ఉన్నా వాహనాల్లో సమీప రక్షకభట నిలయాలకు తరలించిర్రు.

దీనివల్ల చలనమొచ్చిందో ఏమో అన్నట్లు భూనిర్వాసితుల పేర్లు మైక్లనుండి విన్పిస్తున్నాయి...నిర్వాసితులు ఏం మాట్లాడిర్రో తెల్సుకునె ముందు నిర్వాసితులకోసం ఏవన్నా సంఘాలు ఏం మాట్లాడినయో చెప్త...

సభ మొదలయ్యే ముందు రోడ్డుపైన ఏవో నినాదాలు వినపడ్డాయి, పోలీసులు కూడా అడ్డుకుంటలేరనే సరికి అదేదో పార్టీకి సంభందించిన ర్యాలీ అనుకున్న కని కొద్ది సేపటికి పాత్రికేయ మిత్రుడొకరు చెప్పిన విషయం విని వ్యవస్థల మీద జాలేసింది. ఆ ర్యాలి తీసింది ఎవరో కాదు జర్నలిస్టులని.

ఇంక విషయానికొస్తే జర్నలిస్టు లీడరైనటువంటి రంగాచార్యులు లేసి ఇక్కడి రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రాజెక్టులు అనివార్యమని మొదలువెట్టి చెప్తాపోతాఉండు, నా మనసెప్పుడు ఎవలన్నా నిర్వాసితుల సాదకబాదకాలు మాట్లాడ్తారేమో విందామని ఎదురు చూస్తున్న, జర్నలిస్టులు చాలామంది భూ నిర్వాసితుల బాధలు చాలా దగ్గర్నుంచి చూసారు కాబట్టి వాల్లే మాట్లాడాలే కని రంగన్న మర్సిండేమో (కావాలని) , రంగన్న మాటల్లో నిర్వాసితుల ప్రస్తావన రానందుకు కొంచం బాదేసింది.

తర్వాత వంతు మన DBF శంకరన్నది, భూనిర్వాసితులకు మొదటినుంచి వెన్నంటే ఉన్న శంకరన్న మన గురించే మాట్లాడిండు.అభిప్రాయాలు తెల్పడం మొదలయ్యి చాలాసేపయినంక శంకరన్న మాటలు విన్నంక ఇది నిర్వాసితుల సభకూడా అన్పించింది.
అప్పుడే మన ప్రజల SI రంగకృష్ణ గారు వేములాఘట్ కి సంభందించిన రంగారెడ్డి, అమరేందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి లను మొదటి గ్యాలరికి తీస్కపోవడం దూరంగా కూర్చిన్నా కన్పించింది.

రంగారెడ్డి గారి పేరు కలెక్టర్ పిలవగానే, రంగారెడ్డి గారు స్టేజిపైకి వెల్లి నిర్వాసితుల వ్యధలను పూసగుచ్చినట్లుగా చెప్పడం విన్నాం, ఈ ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రజలను పరిసరప్రాంత గ్రామాల్లో ఎట్లా బదునాం చేసిందో చెప్పింది విని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కోట్లాడి,సచ్చిపోయి సాధించుకున్న తెలంగాణ ల కూడా ఏందిరా ఈ వ్యధ అని.

శ్రీనివాస్ రెడ్డి అన్న వంతు, అన్న మాట్లాడ్తూ మల్లన్నసాగర్ ముంపు ప్రాంతం లో ఉన్న అడవులు అందులో ఉన్న వృక్షజంతు జాతులగురించి, సాగునీరువరప్రధాయిని అయిన కోమటివెరువు ,గొలుసుకట్టు చెరువుల గురించి సవివరంగా చెప్పిండు, ఏమైందో ఏమో కని సీనన్న మాట్లాడ్తుండంగనే మైక్ కట్టవ్వడం కలెక్టర్ గారు చంద్రశేఖర్ రెడ్డి, ఏటిగడ్డకిష్టాపూర్, మహిపాల్ రెడ్డి ,ఎర్రవల్లి పేర్లను పిల్వడం జరిగింది. వాల్లెక్కడో జనాలమద్యలనుంచి పిల్సింది మా పేర్లే అని పోలీస్లను దాటుకుంటూ రావడం చూస్తే భూనిర్వాసితుల అభిప్రాయసేకరణ కు వాళ్ళనే మాట్లాడనియ్యరా అని బాధేసింది.

సీనన్న మాత్రం ష్టేజ్ పైన అట్లే ఉండడం చూసి కలెక్టర్ గారు ,సమయభావం వళ్ళ మైక్ కట్ చేసినా అని చెప్పిండు. ఇంతసేపు అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడినప్పుడు లేని సమయాభావం సీనన్న నిజాలు మాట్లాడ్తున్నప్పుడే రావడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతైనా అది వాళ్ళ మయసభ సీనన్నని ఇద్దరు మఫ్టీలో ఉన్న పోలీస్లు గుంజుకపోయిర్రు.

ఈ సారి చంద్రశేఖర్ రెడ్డి అన్న వంతు, ఏటిగడ్డకిష్టాపూర్ లో దాదాపు 90% భూసేకరణ జి.ఒ123 ప్రకారం జరిగింది, అది జరిగి సంవత్సరం అవ్తుంది. అన్న మాట్లాడ్తూ జివొ123 రద్దయ్యింది కాబట్టి భూములిచ్చిన నిర్వాసితుల R&R ప్యాకేజి గురించి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మల్లన్నసాగర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ లెక్క చూడొద్దని, ప్రభుత్వ పథకాలు అమలుచెయ్యాలని అప్పుడు ఇచ్చినహామీలను నెరవేర్చాలని చెప్పడం జర్గుతున్న లోపే మైక్ కట్ అయ్యింది ఈ సారి కారణం చందన్న పర్యావరణం గురించి కాకుండా అధికార పార్టి నిర్వాసితులకిచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఎండగట్టడమే, మల్లోకసారి అవకాశం ఇవ్వగా.. మల్లన్నసాగర్ పరిరక్షణ సమితి పేరిట మల్లన్నసాగర్ కట్టాలని ధర్నాలకు దిగిన రైతు(???) సంఘాలు భూనిర్వాసితులకు లబ్దిగ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 100 ఎకరాల లెక్క ప్రభుత్వం సేకరించి ఇవ్వాలని ఎందుకు చెప్పలేదో అని ప్రశ్నించి ముగించాడు.

ఇవన్నీ చూసినంక మహిపాల్ రెడ్డి అన్న పక్కా పర్యావరణ సమస్యల గురించే మాట్లాడ్తా అని డిసైడ్ అయినట్లు అన్పించింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వాసిత గ్రామాల్లో కాకుండా ఇక్కడ ఎందుకు పెట్టారో అని అడిగిండు, అట్లనే ఇటీవల తెలంగాణ JAC లేవనెత్తిన మల్లన్నసాగర్ ప్రాంతం లో భూమిపొరల్లో పగుల్లు, ఇదే సోషల్ మీడియా చర్చకు నీటిపారుదల OSD శ్రీధర్ రావ్ దేష్పాండే గారు సమాధానమిస్తు ఇక్కడ భూకంపాలకు చాన్సేలేదని ,దానికి సంభందించిన సర్వే ఇప్పుడే మొదలుపెట్టామని చెప్పిండు, ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ ఇప్పటివరకు భూకంపాల గురించి పరిశోధన జరగకుండా టెండర్లవరకు ఎందుకు రావాల్సొచ్చిందో అడిగి ముగించాడు.

ఇవన్నీ చూసిన వేములాఘట్ నర్సింహారెడ్డి అన్న, ఇన్ని ఆంక్షలు వెట్టి ఈ సభలెందుకు అని ఒక "" కొంగలు ......."" అనే సామెత చెప్పి సభంతా నవ్వులు పూయించిండు. ఏ జి.ఓ చెప్పింది MLA లకు లక్షల జీతాలు పెంచమని నిర్వాసితులకు పెంచొద్దనంగనే సభ వెనక నుంచి పెద్ద ఎత్తున నిర్వాసితులకు అనుకూలంగా నినాదాలు విన్పించాయి.

వేల / లక్షల మెజారిటి ఇచ్చి గెల్పించిన మాజి నక్షలైట్ MLA నైనా , కష్టం తెల్సిన MP అయినా భూనిర్వాసితుల పక్షాణ మాట్లాడ్తారేమో అని జెరంత ఆశుండే..ఆల్లుసుత కమీషన్ల మేతకల్వాటువడ్డరేమో నక్స‌లైటు సిద్దాంతాలను మర్సిర్రేమో ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికేం ఇబ్బంది లే ,100% కట్టాలె అని చెప్పి ముగించిర్రు.

కనెందుకో నిర్వాసితుల బాధలు ప్రస్తావిస్తేనే సంభందం లేని టాపిక్ అయితది, అసలైన పర్యావరణ సమస్యలు చెప్తే సమయాభావం గుర్తొస్తది అధికార పార్టి ప్లీనరీ లెక్క మాట్లాడ్తే ఏ అభ్యంతరముండది. పాపం అధికారులు మాత్రం ఏం చేస్తారు ఆజ్ఞలు పాటించడం తప్ప.

చదివినోల్లు గమనించుంటారు అధికార పార్టీ అని వాడిన తప్ప TRS అని స్పెషల్ గా మెన్షన్ చెయ్యలేదు ఎందుకంటే ఏ అధికార పార్టి అయినా గిట్లనే చేస్తది. ఒకటి కొద్దిగంత ఎక్కువ ఒకటి కొద్దిగంత తక్కువ. చివరికి నగిలేది సామాన్య ప్రజలే. వ్యవస్థని ప్రజలు ప్రశ్నించనంతవరకు గిసొంటియి జరుగుతనే ఉంటాయి సామాన్యుడు నష్టపోతనే ఉంటాడు..
లాంగ్_లివ్_Democrasy 🤔🤔🤔
అయినా వీళ్ల చాదస్తం కాకపోతే ఎద్దుగుద్ద పొడ్సెటోనికి ప్రాజేక్ట్ కడ్తే పర్యావరణ సమస్యల గురించి మాట్లాడు మంటే ఏం మాట్లాడ్తాడు?? ఎవ్సం జేస్కునే రైతుకు ఎప్పుడు ఏ పంట వెయ్యాలే గదే తెల్సు..ఎంతైనా ఎవ్సం ఇంజనీర్లు వాళ్లు..
- మల్లన్న సాగర్

Keywords : mallannasagar, vemula ghat, project, people, Environmental Public Hearing, Kaleswaram Project
(2018-12-14 03:43:29)No. of visitors : 664

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


అధికార