ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు


ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ʹమునివేళ్ల

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

రోజూ బై లైన్ లు రావు గదా...!

విలేకరి మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. కొన్ని వార్తలు బాగా రాయగలిగినప్పుడు శ్రేయోభిలాషులు, మిత్రులు మెచ్చుకోగానే అంతకన్నా బాగా రాయాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం లో అందరూ కాకున్నా కొంత మంది తప్పులో కాలేస్తారు. నా అనుభవాలు రికార్డ్ చేస్తున్న క్రమం లో వస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, నిన్న కూడా అదే స్థాయిలో రాయాలని ప్రయత్నించా. అయితే నిన్నటి అనుభవాల్లో సమగ్రత లోపించిందనిపించింది. అలాగే కొన్ని పేరాలు ఇంటర్ వీవ్ చేయడం లో సఫలం కాలేదనిపించింది. నిజానికి "ఎన్నికల తెర " పేజీకి, అనంతర ఘటనలకు పరస్పర సంబంధాలున్నాయి. అప్పటి ఎన్నికల కవరేజీ లో ఆ ఘటనలూ భాగమే. కానీ ఎన్నికల సందర్భంగా ఆర్ కే ఇచ్చిన ఇంటర్వ్యూ కాంటెంట్ ఇప్పటి పరిస్థితులకు అవసరం కాదు గాబట్టి, అక్కడికి చేరుకునేందుకు మేము ఎదుర్కున్న హర్డిల్స్ మాత్రమే రాయగలిగా. ఆ ఇంటర్వ్యూ అనంతరం ఉత్తర తెలంగాణా మొత్తం నిజం గా యుద్ధ వాతావరణమే నెలకొంది. ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు. ఇలా ఘటనలు జరిగినప్పుడు పోలీసులు ఆగ్రహం తో కెమెరాలు లాక్కున్న సందర్భాలు కో కొల్లలు. లెంకల గడ్డ వార్త రోజు రవీందర్ సార్, జైపాల్ రెడ్డి సార్ ఇద్దరూ ఫోటోల కోసం ప్రయత్నిస్తున్న క్రమం లో నేనూ అశోక్ రెడ్డి (అప్పుడు మా కేసముద్రం విలేకరి ) ఆఫీసులో ఉండాల్సి వచ్చింది. ఈ విషయాలను సరైన రీతిలో ప్రెజెంట్ చేయలేక పోయాననిపించింది. అందువల్లనే రోజూ "బై లైన్ వార్తలు రావు గదా ! " అని భావించాల్సి వచ్చింది.
జైపాల్ రెడ్డి సార్ వరంగల్ లో ఉన్నప్పుడు ఆఫీసులో కొంత అన్యోన్య వాతావరణంఉండేది. అందువల్ల రోజూ మేమంతా ఇన్ని ఘటన ల వార్త లు రాస్తున్న ప్పటికీ ఎలాంటి టెన్షన్ లేకుండా జోవియల్ గా ఉండే వాళ్లం. ఇదే సందర్భం లో సార్ వాళ్ల తండ్రి మృతి చెందాడు. అప్పుడు ఆంధ్ర ప్రభ డిప్యూటీ ఎడిటర్ గా ఎం వీ ఆర్ శాస్త్రి గారు ఉండేవారు. వరంగల్ డెస్క్ ఇన్ ఛార్జి గా రామానుజం ఉండే వారు.సార్ వాళ్ళ నాన్న నలగొండ జిల్లా రెడ్ల రేపాక లో చనిపోవడం తో సార్ సమాచారం అందగానే వెళ్ళి పోయారు. ఒక పది రోజుల వరకూ సార్ రాకుండా ఉండే స్థితి. అందువల్ల జనగామ లో పనిచేసే కిరణ్ ను వరంగల్ లో వార్తల సేకరణలో ఇక్కడున్న మిత్రులకు సహకరించాలని చెప్పి పంపారు. కిషన్ సార్ వెళ్లగానే కే కే ఆంధ్ర ప్రభ నుంచి వెళ్ళిపోవడం తో నగరం లో వరంగల్ డేట్ లైన్ ఖాళీగా ఉన్న దశ కావడం తో కిరణ్ ,ఇక్కడున్న రవీందర్ సార్, వసంత్ లకు తోడుగావార్త లు రాసేందుకు వచ్చారు. ఆఫీసుకు వచ్చీ రావడం తోనే కిరణ్ జైపాల్ రెడ్డి సార్ చెయిర్ లో కూర్చున్నడు.అలా కూర్చోవడం తప్పు అని నేను చెప్పాను. అయినా కిరణ్ వినలేదు. శివకుమార్ ఆయన వార్తలను ప్రాధాన్యతలో పంపాలని భావించాడు. అందువల్ల వరంగల్ డేట్ లైన్ తో పంపారు. రవీందర్ సార్ ఎప్పటికీ ఏదో ఒకటి అని తనలో తాను అనుకున్నాడు. వసంత్ తన కల్చరల్ వార్తలకు ధోకా లేదు గదా అనుకున్నడు. నేను మాత్రం స్కూల్ ల లో గూడా ఎవరయినా హెడ్ మాస్టర్ లీవ్ లో వెళితే ఇన్ చార్జి గా ఉండే వాళ్ళు ఆ కుర్చీకి గౌరవం ఇస్తూ పక్క చెయిర్ లో కూర్చుంటారని అది తప్పని చెప్పాను. అయినా కిరణ్ వినలేదు. ఇక పిల్లి మెడలో గంట కట్టగలిగేది రాజు గారే అని మేమంతా ఒక నిర్ణయానికొచ్చాం. రాజు గారు సాయంత్రం అయిదింటికి గానీ ఆఫీస్ కు రారు. అప్పటి దాక వేచి చూడాల్సిందే.ఆ రోజు మధ్యాహ్నం మొత్తం అందరం టాప్ ఇన్ కేఫ్ లోనే గడిపాం. రాజు గారు వచ్చారు. ఆయన కూడా కిరణ్ ను నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పారు. అయితే తనను శాస్త్రి గారు పంపారు కాబట్టి ఆ చెయిర్ లో కూర్చో వచ్చని కిరణ్ వాదన. మొదటి సారి ఆఫీస్ లో గంభీర వాతావరణం చోటు చేసుకుంది. ఆ రోజు నా ఎల్ ఎం ఎల్ పై రాజు గారిని ముందే తీసుకుని ఫాతిమా నగర్ లో వుండే జైపాల్ రెడ్డి సార్ బంధువు వెంకట్ రెడ్డి సార్ ఇంటికి వెళ్ళాం. రాజు గారు వెంకట్ రెడ్డి తో ఎలాగయినా జైపాల్ రెడ్డీ సార్ వాళ్ళ ఊరికెళ్లి ఈ విషయం చెప్పాలని కోరాడు. ఇంతవరకూ బాగానే ఉంది. వెంకట్ రెడ్డి రేపాక కు వెళ్లాడు. విషయం సార్ కు చెప్పాడు. సార్ కూడా శాస్త్రి గారికి సమాచారమిచ్చాడు. ఈ లోగా కిరణ్ ఎస్ పీ, డి ఐ జీ ల ఇంటర్వ్యూ లు, కలెక్టర్ ఇంటర్వ్యూ రాసాడు. డెస్కు ఇన్ చార్జీ రామానుజం ఆయనకు అనుకూలం గా ఉండడం వల్ల వార్తలు ప్రముఖం గా ప్రచురితమైనాయి.మా అందరిదీ ఒకటేబాధ. జైపాల్ రెడ్డి సార్ మళ్ళీ రాకుండా కిరణ్ దగ్గరే వీళ్ళు పని చేయాలా అని ఒక ఆందోళన. వెంకట్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఓ గమ్మత్ జరిగింది. సార్ తమ్ముడు దేవేందర్ హనుమకొండ లోనే ఉంటాడు. వాళ్ళ నాన్న హఠాత్తుగా చనిపోవడం తో కుటుంబాలన్నీ వెంటనే వెళ్ళాయి కాబట్టి దేవేందర్ అన్నీ చూసుకోవడానికి తిరిగి వచ్చాడు.వచ్చీ రావడం తోనే మా ఆఫీస్ కు వచ్చాడు దేవేందర్. ఆఫీస్ దర్వాజ లో అటొక చేయి ఇటొక చేయి వేసి "మా అన్న సీట్ల ఎవరో కిరణ్ కూచున్నడట గదా. రాజు గారు వెంకట్ రెడ్డిని పంపి అన్ని విషయాలూ చెప్పిండు అని అన్నడు.ఆఫీస్ లో సార్ కుర్చీ లో కిరణ్. మేమంతా నవ్వాలో ఏమనాలో తెలియక గతుక్కుమన్నాం. ఈ ఘటన తర్వాత పాపం రాజు గారు మొదటి సారి నాలుగు నెలల పాటు కాజీపేట డేట్ లైన్ కు దూరమయ్యాడు.
గ్రామీణ విలేకరులు డేట్ లైన్ లు కోల్పోవడానికి గానీ, పదోన్నతి పొందటానికి గానీ డెస్కుల నుంచి వచ్చే ఆరోపణలు, ప్రోత్సాహకాలే కారకాలవుతయని ఈ సందర్భం లో అర్థమయింది.
ఇంగ్లీష్ రిపోర్టింగ్ అనగానే గుర్తొచ్చే ముఖ్య రిపోర్టర్లు-
నేనభిమానించే రిపోర్టర్లలో హిందూ శ్రీనివాస్ రెడ్డి సార్ ఒకరు. వరంగల్ లాంటి ఉద్యమ జిల్లాల వార్తలు, సీనియర్ గా ఉన్న శాస్త్రి గారు ఆ పత్రిక అవసరాల మేర రాయక పోయేవాడని ఇక్కడి పాఠకులు అనుకునే వారు. ఆ మేరకు స్టేట్ బ్యూరో కాంపెన్సేట్ చేస్తూ వస్తుండేది. శ్రీనివాస్ రెడ్డి సార్ రాసే ఎన్ కౌంటర్ వార్తలు, మందుపాతర వార్తల కాపీలను నేను ప్రొఫార్మా లుగా వాడుకునే వాడిని. ఆ ప్రొఫార్మాల్లో మళ్ళీ జరిగే సంఘటనల సంబంధిత గ్రామాల వివరాలు పూరిస్తూ వార్తలు రాసే వాడిని. ఇది నాకు ఇంగ్లీష్ రిపోర్టింగ్ లో ఎంతగానో ఉపకరించిన అంశం. నన్ను బాగా ప్రభావితం చేసిన ఇంగ్లీష్ రిపోర్టర్లలో కాకతీయ విశ్వవిద్యాలయం లో హిస్టరీ కాంగ్రెస్ వార్త రాసిన జే ఎస్ ఇఫ్తెకార్, అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ నన్ను అభిమానించే వీజేఎమ్ దివాకర్ సార్ ఉన్నారు. అయితే ప్రొఫార్మా తరహా లో వార్తలు రాసేందుకు నేనెంచుకున్న మరో రిపోర్టర్ జి ఎస్ వాసు. "నాట్ విత్ స్టాండింగ్ "అని తను చేసిన ఒక స్టోరీ లీడ్ ను నేను అనేక సార్లు నా వార్తలకోసం వాడుకున్నాను. ఎన్నికలను ఎలక్షన్స్ అనడం తో బాటు "హస్టింగ్స్" అని రాయవచ్చని నేను పీ ఎస్ జయరాం సార్ దగ్గర తెలుసుకున్నాను. ఓ సారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ గా నేను కొనసాగుతున్నప్పుడు వరంగల్ లో పీ వీ నరసిం హా రావు ఉపన్యసించిన మహాసభ జరిగింది. ఆ సభ కవరేజి కి సార్ వచ్చారు. ఆ మీటింగుకు సంబంధించి ప్రధాన ఉపన్యాసాన్ని సార్ రిపోర్టింగ్ చేసిన తీరును నేను చదివి , భవిష్యత్తులో నేర్చుకోవాల్సిన విషయాలను మననం చేసుకున్నాను.
ఇంగ్లీష్ రిపోర్టింగులో లాథూర్ భూకంప సందర్భం లో జీ ఎస్ వాసు చేసిన రిపోర్టింగ్ లో "ఎపిసెంటర్"పదాన్ని మందుపాతర ఘటనల్లో ఉపయోగించడానికి ప్రయత్నించే వాడిని. రాజా రాం సంక్లా అయితే ఈ విషయం లో నాకు ఎప్పుడూగుర్తుంటాడు.
నక్సలైట్ల నాయకత్వాల తో ఇంటర్వ్యూల కెళ్లిన ప్రతీ సందర్భం లోనూ హిందూ శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రొఫార్మా లు నాకు "రెడీ రెకానర్ "ల లా ఉపయోగ పడేది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో నేనూ ,పిట్టల రవీందర్ పర్మినెంట్ ఉద్యోగం కోసం పరితపించాం. ఎన్నో సార్లు సుందరం సార్ తిట్లు ఓర్చుకుంటూనే మదురై కార్యాలయం లో మా దరఖాస్తులు ఫార్వర్డ్ కావాలని కోరుకునే వాళ్లం. అయితే ఆ అవకాశం కలుగ లేదు. ఈ దశలోనే, వార్త అనే పత్రిక రాబోతున్నదని అందుకోసం సీనియర్ల రిక్రూట్ మెంట్ జరుగుతున్నదని ప్రచారం మొదలయింది. అప్పటికే ఆంధ్ర ప్రభ లో మహబూబా బాద్ లో పని చేసే దొంతు రమేశ్ ట్రెయినింగ్ కోసం వెళ్ళాడు. పిట్టల రవీందర్ కూడా నిజామాబాద్ బ్యూరో గా జాయిన్ అయ్యాడు. వరంగల్ లో జకీర్ సర్ వచ్చారు. ఇంకా ఉద్యోగాలున్నాయని ప్రచారమవుతున్నది. హనుమకొండ ఆంధ్ర భూమి లో పని చేసిన విజయభాస్కర్ కూడా ట్రెయినీలలో చేరాడు. ఆయన కు ప్రభాత వార్త నెట్ వర్క్ ఇన్ చార్జి రమణా రావు గారికి దగ్గర అని తెలిసింది. నాకు అప్పటికే ఓ వంద కు పైగా ఇంగ్లీష్ బై లైన్లు ఉన్నాయి. నేను వార్త కోసం మొదటి సారి ఆ బై లైన్ లను బైండింగ్ చేయించాను.వార్త లో జాయిన్ అవాలనుకున్నప్పుడు కూడా బాబాయి ఇంట్లోనే చర్చించుకున్న గుర్తు. బన్ని కి కూడా తెలిసిన విజయ భాస్కర్ నాకు అవకాశం విషయం లో కొంత హెల్ప్ చేసాడు. ఇంటర్వ్యూ రోజు అర్థరాత్రి వరకు ఉన్నా, సుందరం సార్ హ్యూమిలియేషన్ ముందు ఎలాంటి బాధా కలుగ లేదు. వార్త లో సీనియర్ సబ్ ఎడిటర్ గా వరంగల్ ఎడిషన్ లోనే చేరాను..
-పీవీ కొండల్ రావు

Keywords : journalism, andhraprabha, indian express, vartha, reporter
(2018-12-10 13:11:06)No. of visitors : 624

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

   ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 5...స్లగ్గులు.. వార్తలు - -పీవీ కొండల్ రావు

మొదటి సారి ఓ ఆజ్ఞాత నక్సలైట్ నాయకుడు, అధినేత కొండపల్లి సీతారామయ్య తో "కొండపల్లి తో కొన్ని గంటలు" పేరిట ఇంటర్వ్యూలు ఇలా చేయొచ్చు అని నిరూపించిన పత్రిక అది. ఆ ఇంటర్వ్యూ అప్పటి పరిస్థితుల్లో , ఇప్పుడు కూడా సీరియస్ గా జర్నలిజాన్ని ఎంచుకొని తమకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉండాలని భావించే పాత్రికేయులకు దిక్సూచి.....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 2..."కామన్ పేజీలు.. లైన్ అకౌంట్లు.."

ఆంధ్ర ప్రభ లో పని చేసిన ప్రతీ అకేషనల్, రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ కూడా తమ బై లైన్ చూసుకోవాలని పరితపిస్తారు. ఆంధ్ర ప్రభ దినపత్రికకు ఆ రోజుల్లో ఉన్న పేరు అది. ఎమర్జెన్సీ కా లం లో పత్రికా స్వేచ్ఛను నియంత్రించ యత్నించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్లాంక్ ఎడిటొరియల్ ఇచ్చారని ఆ పత్రిక పట్ల అపరిమితమైన గౌరవం.....

Search Engine

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


ʹమునివేళ్ల