వాట్సప్ లోదైవ దూషణ చేశాడని యువకుడికి మరణ శిక్ష !

వాట్సప్


మతాలన్నీ శాంతినే ప్రబోధిస్తాయని మత పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రపంచంలో ఇప్పుడు మతంపేరుతో మారణ హోమంజరుగుతోంది. మతం పేరుతో హత్యలు, దాడులు అనేక రకాల అరాచకాలు సాగుతున్నాయి. భారత్ లో పాలకుల అండతో మాతోన్మాద శక్తులు ఆపని చేస్తోంటే పాకిస్తాన్ లో ఆ పని ఏకంగా చట్టమే చేస్తోంది.
పాకిస్తాన్ లో ఓ వ్యక్తి త‌న‌ స్నేహితుడికి వాట్సప్‌లో ఓ పద్యాన్ని పంపాడ‌ని, అందులో దైవ‌దూష‌ణ ఉంద‌ని నదీమ్‌ జేమ్స్‌ మసిహ్ అనే క్రైస్తవుడిపై కేసు న‌మోదైంది. దీంతో ఆయ‌న‌కు అక్క‌డి న్యాయ‌స్థానం మ‌ర‌ణశిక్ష విధించింది. ఈ కేసును జేమ్స్ స్నేహితుడు యాసిర్‌ బషీరే వేయ‌డం గ‌మ‌నార్హం.
ఈ తీర్పుపై డిఫెన్స్‌ లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. తన క్లయింట్ జేమ్స్‌ అమాయకుడని చెప్పారు. జేమ్స్‌ ఓ ముస్లిం బాలికతో స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, ఈ కార‌ణంగానే అతడిపై తప్పుడు అభియోగాలు మోపారని అన్నారు. ఈ తీర్పును లాహోర్‌ హైకోర్టులో సవాల్‌ చేస్తామని తెలిపారు.
తమ మతానికి వ్యతిరేకంగా మాట్లాడారనే పేరుతో పాకిస్థాన్‌లో మ‌త ఛాంద‌స‌వాదుల దాడులకు, హత్యలకు గురైన సంఘటనలు కోకొల్లలు. దీంతో త‌న‌పై నేరారోప‌ణ రాగానే జేమ్స్ ఇంటి నుంచి పారిపోయి, కొన్ని రోజుల‌కి పోలీసులకు లొంగిపోయాడు. లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్‌ జైల్లోనే అతడిని న్యాయ‌స్థానం విచారించింది.

పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులు ఎప్ప‌టినుంచో జ‌రుగుతున్నాయి. దైవదూషణకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తూ పదేపదే దాడులు జరుగుతున్నాయి. భారత్, పాక్ లతో సహా ప్రపంచవ్యాప్తంగా మత మైనారిటీలపై జరుగుతున్న దాడులకు అంతులేకుండా పోతోంది.

Keywords : pakistan,court, Capital punishment , religion, india
(2024-04-24 19:25:52)



No. of visitors : 2570

Suggested Posts


భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం

ప్రియమైన భారత్ మాతా నేను నీ సోదరుడి బిడ్డను. సరిహద్దులకు ఈవల‌ కరాచీ నుండి ఈ లేఖ రాస్తున్నాను. చాలా ఏళ్ళ క్రితమే నువ్వూ నీ తమ్ముడూ విడిపోయారు కానీ నాలో ఇప్పటికీ నీరక్తమే ప్రవహిస్తోంది.

What Pakistani Girls think about INDIA

Watch This Video What Pakistani Girls think about India and What the Pakistani Schools Teaching to the Students

దేవుడు లేడన్నందుకు ఓ విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారు

వందల మంది చుట్టుముట్టి కర్రలతో, ఇనుప రాడ్ లతో, రాళ్ళతో విచక్షణా రహితంగా కొట్టి చిత్ర హింసలు పెట్టి చంపారు. శరీరంపై బుల్లెట్‌ గాయం కూడా ఉంది. దాడిలో 4 వేల మంది పాల్గొన్నారు. దాడి చేస్తున్నంతసేపూ ఆవేశ పూరితంగా నినాదాలు చేశారు.....

అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే కరోనా వచ్చింది - మత పెద్ద మూర్ఖపు కామెంట్లు

కరోనా లాంటి వైరస్ ల విజృంభణకు అమ్మాయిలు కురచ దుస్తులు ధరించడమే కారణమట ! పాకిస్తాన్ కు చెందిన మతాధికారి తారిక్‌ జమీల్ ఈ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సమక్షంలోనే ఆయన ఈ మాటలు మాట్లాడాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వాట్సప్