ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు


ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

ప్రభుత్వ

ఆధార్ కార్డు లేకుంటే ఈ దేశంలో బతుకులేకుండా చేస్తున్నారు. అది ఉంటే హాయిగా బతుకొచ్చని కాదు కానీ లేకుంటే మాత్రం పేదలకు చావు ఖాయం. ఆధార్ కార్డులేక ఓ పదకొండేళ్ళ చిన్నారి ఆకలికి అలమటించి... అలమటించి చనిపోయింది.

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు. సంతోషి కుమారి తల్లి కొయిలీ దేవీ కూలీ పని చేసి సంపాదించే కొద్ది మొత్తంతో రేషన్ సరుకులు కొనుక్కొని జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. అంత పేదరికంలో కూడా ఆ తల్లి తన కూతురిని స్కూలుకు పంపిస్తోంది.

ఇటువంటి దుర్బరమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని వెలువరించిన దరిమిలా... ఆధార్‌ కార్డు లేని కారణంగా కోయిలీ దేవి పేరుమీదున్న రేషన్‌ కార్డు రద్దయింది. ఆధార్‌ కార్డు లింకు ఉంటేనే సరుకులు ఇస్తానని స్థానిక రేషన్‌ షాపు డీలర్‌ తెగేసి చెప్పాడు. సంతోషి కుటుంబంతోపాటు మరో 90 మంది పేదల రేషన్‌ కార్డులు కూడా ఆధార్‌ కార్డులు లేని కారణంగా రద్దయ్యాయి. మిగతావారికంటే సంతోషి వాళ్ల స్థితి దారుణంగా ఉందని, ఆ ఒక్క కుటుంబానికి మాత్రం కాస్త వెసులుబాటు కల్పించాలని ఆహార హక్కు కార్యకర్తలు కొందరు మండల అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కానీ అధికారులు వీరి మొర పట్టించుకోలేదు.

ఆధార్‌ కార్డు రద్దయిన తర్వాత సంతోషికి స్కూల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంతో కడుపు నింపుకునేది. అయితే దసరా పండుగ సందర్భంగా 10 రోజులపాటు సెలవులు ఇవ్వడంతో చిన్నారి పరిస్థితి దారుణంగా తయారైంది. అటు పని, ఇటు రేషన్‌ దొరక్క సంతోషి తల్లి బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడిపింది. ఎనిమిది రోజులపాటు అలా ఆకలితో అలమటిస్తూ సెప్టెంబర్‌ 28న సంతోషి ప్రాణాలు విడిచింది.
(Source : https://scroll.in/article/854225/denied-food-because-she-did-not-have-aadhaar-linked-ration-card-jharkhand-girl-dies-of-starvation)

Keywords : Denied food because she did not have Aadhaar-linked ration card, Jharkhand girl dies of starvation
(2022-08-04 15:37:14)



No. of visitors : 1580

Suggested Posts


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.

ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹ

సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిష‌న్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

demanding the immediate release of Damodar Turi

We strongly condemn the unlawful arrest of Damodar Turi (Central Convenor Committee member of Visthapan Virodhi Jan Vikas Andolan) by Jharakhand Police on 15 February 2018. And demand for immediate release for him.

Search Engine

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
more..


ప్రభుత్వ