శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు


శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు

శ్రీకాకుళములోన

శ్రీకాకుళంలోన చిందింది రక్తము
కొండలెరుపెక్కినాయి పోరాడ బండలే కదిలినాయి
మన దేశంలో సాయుధ రైతాంగ వర్గపోరాటాలకు చరిత్రలో మలుపు అనదగిన తేదీలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. తెలంగాణ రైతాంగ పోరాటానికి జులై 4, 1946 వలె, నక్సల్బరీ మే 23-25, 1967 వలె - శ్రీకాకుళ పోరాటానికి 31 అక్టోబర్ 1967,

ఈ మూడు సందర్భాల్లోనూ మైదాన ప్రాంతమైన కడివెండిలో భూస్వామి ఏజెంటు తుపాకి గుండుకు గురయి అమరుడైన దొడ్డి కొమురయ్య బడుగువర్గం నుంచి వచ్చిన వ్యవసాయ కూలీ. నక్సల్బరీలో ఇప్పటికే చాలాసార్లు చెప్పకున్నట్లుగా సంతాల్ ఆదివాసీ మహిళలు, పిల్లలు సిఆర్పిఎఫ్ కాల్పుల్లో, శ్రీకాకుళంలో కోరన్న మంగన్నలు గిరిజనులు ఒక భూస్వామి తుపాకి గుండ్లకు అమరులైనారు.
1964 కమ్యూనిస్టు పార్టీలో మొదటి చీలిక నాటికే వెంపటాపు సత్యనారాయణ (సత్యం, కొండబారిడి మాస్టారుగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీకాకుళ పోరాట నిర్మాత), ఆదిభట్ల కైలాసం శ్రీకాకుళం ఏజెన్సీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరినీ విప్లవ రాజకీయాల వైపు పురికొల్పిన రాములు ఎక్కువకాలం కొనసాగలేదు. వసంతాడ రామలింగాచారి కమ్యూనిస్తు కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 1964 నుంచీ గిరిజనుల మధ్య పనిచేస్తూ, మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన భూస్వాముల, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా వారిని సంఘటితపరుస్తూ సత్యం, కైలాసాలు గిరిజనుల చైతన్య స్థాయి పెరిగే క్రమంలో పోరాట స్థాయిని పెంచుతూ పోయారు. గిరిజన సహకార సంఘాలు, గిరిజన సంఘర్షణ సమితులు నెలకొల్పుతూ - అటవీ వస్తువులు సేకరించి విక్రయించినందుకు న్యాయమైన రేట్లు, న్యాయమైన తూనికలు మొదలు ఆర్థిక పోరాటాలు నిర్వహిస్తూ పోడు భూముల్ని తాకట్టు పెట్టుకున్న భూముల విముక్తి కోసం, పోడు భూములపై హక్కు కోసం పోరాటాలు నిర్మిసూ పోయారు. ముఖ్యంగా గిరిజనుల మౌలిక అవసరాలయిన బియ్యం, ఉప్ప, పప్పుల కోసం విలువయిన అటవీ సంపద మాత్రమే కాకుండా తమ నెత్తురు చెమటయిన పోడు వ్యవసాయంలో తమ భూముల్లో తామే కంబారీ (కూలీ)లయిన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు ఆయత్తం చేసారు.
అట్లా నిర్మాణం చేసూ వచ్చిన గిరిజనుల సంఘటిత శక్తిని ప్రకటించడానికి శ్రీకాకుళం జిల్లా గిరిజన మహాసభను అక్టోబర్ 31న మొండెంఖలు అనే గ్రామంలో తలపెట్టారు. విస్తృత ప్రచారంతో జరిగిన ఆ సభకు జిల్లా నలుమూలల పోరాట ప్రాంతాల నుంచీ చీమలపుట్ట నుంచి కదలి వచ్చినట్లుగా గిరిజనులు తరలివస్తూ ఉంటే లేవిడి అనే గ్రామం దగ్గర ఒక చెట్టు చాటుకు కాపుగాచిన రాజమండ్రి నుంచి వచ్చిన భూస్వామి సత్యనారాయణ గుంపుపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో అక్కడికక్కడే కోరన్న మంగన్న అనే ఇద్దరు గిరిజనులు నేలకొరిగారు. ఈ వార్త జిల్లా అంతటా దావానలం వలె వ్యాపించి సభా నిర్వహణ సన్నాహాల్లో ఉన్న సత్యం కైలాసాలకు ఈ వార్త తెలిసింది. ఆ సభా వేదిక మీంచే నాయకత్వం ఆత్మరక్షణ కోసమైనా సరే గిరిజనులు ఆయుధం పట్టక తప్పదని ప్రకటించారు.
కోరన్న మంగన్నల అమరత్వాన్ని సాయుధ పోరాట ప్రకటనను - అప్పటి వరకు జరిగిన వర్గపోరాట సన్నాహాలను, కృషిని, అప్పటికే 1967 మే 25 నుంచే నక్సల్బరీ పంథా వైపు నీటికి చేపల వలె ఎక్కుతున్న ప్రజల చైతన్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రిస్తూ ప్రజా వాగ్గేయకారుడు సుబ్బారావు పాణిగ్రాహి అక్టోబర్ 31 జముకు కథ రాసి ఏలూరు, ఖమ్మంల దాకా కూడా శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి అశేష పీడిత ప్రజల మద్దతునే కాదు ఎందరో ಬುದ್ಧಿಜಿಪುಲ, కవుల, కళాకారుల, ప్రజాస్వామ్యవాదుల మద్దతును కూడగట్టాడు.
నక్సల్బరీ పంథా తూర్పు తీరాన తెరిచిన మరొక పోరాట ఫ్రంట్ అయింది శ్రీకాకుళం. భూస్వాముల, వడ్డీవ్యాపారుల ఇళ్లపై వందల వేల సంఖ్యలో ప్రజలు దాడి చేయడం, అప్ప పత్రాలు తగులబెట్టడం, రుణవిముక్తి ప్రకటించి, తాకట్టుపడిన పోడు భూములను స్వాధీనం చేసుకోవడం గరుడభద్రపురం, రామభద్రపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ తాలూకాలయిన పా ర్వతీపురం, పళాకోందా, పాతపట్నం, ఉద్దానంలలో కెరటాలుగా కెరటాలుగా విస్తరించింది. 1.

శ్రీకాకుళ పోరాట నాయకత్వం నక్సల్బరీ పంథా వైపే కాకుండా చారుమజుందార్ నాయకత్వం పట్ల కూడా విశ్వాసం ప్రకటించి 1969 ఏప్రిల్ 22న సిపిఐ (ఎంఎల్) ఏర్పాటులోనూ, మేడే రోజు షహీద్ మినార్, కలకత్తాలో పార్టీ ఆవిర్భావ ప్రకటనలోనూ పాల్గొన్నారు. ఆవిర్భావంలో పాల్గొన్న కొన్ని రోజులు కలకత్తా, ఒరిస్సాలలో పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని వస్తున్న క్రమంలోనే 27 మే 1969న పంచాది కృష్ణమూర్తి, రమేశ్చంద్ర సాహు, తామాడ చినబాడు (14 సంవత్సరాల బంగారుబాబు, సుబ్బారావు పాణిగ్రాహి జముకు కథల దళంలో స్త్రీ పాత్ర వేసిన బాలుడు) మొదలైన ఆరుగురు సోంపేట రైల్వేస్టేషన్లో అరెస్టయ్యారు. పార్వతీపురం కుట్రకేసు చార్జిషీటులో నమోదయిన ఆధారాల ప్రకారం "బంప్ దెమ్ ఆఫ్ʹ అనే హోంమంత్రి వైర్లెస్ ఆదేశాలతో జరిగిన మొదటి ఎన్కౌంటర్ హత్య అది.
యజ్ఞం కథలో శ్రీరాములు నాయుడుతో పోల్చదగిన పార్లమెంటరీ రాజకీయాల సమర్థమైన నాయకుడు, 17 ఏళ్లు ఆవిచ్ఛన్నంగా ప్రధానిగా పాలించిన జవహర్లాల్ నెహ్రూ కూడా అంతకు అయిదేళ్ల ముందు 1964 మే 27ననే మరణించాడు. ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడు మాత్రం అసహజ మరణానికి గురయ్యాడు.
ఇంక అక్కడి నుంచి 1972 దాకా శ్రీకాకుళ చరిత్ర అంతా రక్తసిక్తమైన చరిత్ర. రెంజిమ్, తాబేలు నాయుడు కుటుంబంలోపన్నెండు మంది సభ్యులు, అంకమ్మ సరస్వతి మొదలు అరికె సోములు దాకా ఎందరో ఆదివాసీ యోధులు, సానుభూతిపరులు ఎన్కౌంటర్లలో అమరులయ్యారు. బొడ్డపాడు వంటి ఉద్దాన ప్రాంతం, ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తామాడ గణపతి, పంచాది నిర్మల, సుబ్బారావు పాణిగ్రాహి, రమణమూర్తి - మైదాన ప్రాంతం నుంచి వచ్చిన డాక్టర్ చాగంటి భాస్కరరావు, మల్లికారునుడు మొదలు అనంతపురం రీజినల్ ఇంజినీరింగ్ కాలెజి నుంచి వచ్చిన రాజారాంరెడ్డి దాకా 370 మంది విప్లవకారులు, సానుభూతిపరులు బూటకపు ఎన్కాంటర్లలో అమరులయ్యారు.
వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం - 1970 ఫిబ్రవరిలో శ్రీశ్రీ అరవై ఏళ్ల సభలో సాహిత్యంలో పోలరైజేషన్ మొదలు జులై 4న విరసంʹ ఆవిర్భావం వరకు చూసిన శ్రీకాకుళ విప్లవ నాయకత్వం - ఒక వారం రోజులు కూడా గడవక ముందే జులై 10న శత్రువు చేతజిక్కి బూటకపు ఎన్కౌంటర్లో అమరులయ్యారు. మంచాలకు కట్టవేసి 89 మృతదేహాలను పార్వతీపురం ఆసుపత్రికి పోస్ట్మార్ధమ్ కొరకు తీసుకవచ్చినప్పుడు వేలాదిమంది ప్రజలు తమ కొండబారిడి మాస్టారి కడసారి చూపు కోసం వచ్చారు.
1972లో అరికెసొములు, రాజారాంరెడ్డి దళం ఎన్కౌంటర్తో శ్రీకాకుళం తుడిచిపెట్టకపోయింది. ఈ మధ్యకాలమంతా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల ʹకల్లోలిత ప్రాంతాల ప్రకటన, ఎనభై గ్రామాల్లో సిఆర్పిఎఫ్ క్యాంపులు, ఎన్కౌంటర్లు - శ్రీకాకుళంలో నెత్తుర్లు పారాయి.
అయినా బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి లేచినట్లుగా ʹతిరిగి తిరిగొచ్చింది నక్సల్బరీ, తనకు మరణమే లేదంది నక్సల్బరీʹ అని ఒక కవి రాసినట్లుగా 1980 సిపిఐ (ఎంఎల్) పీపుల్స్వార్ ఏర్పడిన తర్వాత శ్రీకాకుళంలో మళ్లీ పోరాటం మొదలైంది.
తమ పంటలో దోసెడు గింజలు సత్యం పార్టీ కోసం గాదెలో పోగుచేస్తూ వచ్చిన గిరిజన రైతాంగం మళ్లీ విప్లవానికి దోసిళ్ళతో స్వాగతం చెప్పారు. సత్యం తర్వాత మళ్లీ సత్యమంత విశ్వాసాన్ని చూరగొన్న రాజన్న(గంటి రమేశ్) నాయకత్వంలో విప్లవ పార్టీ నిర్మాణం, ఒరిస్సా సరిహద్దుల వరకు విస్తరించి దానికి కక్షగానే "కోపర్డంగ్ʹʹ ఎన్కౌంటర్ జరిగింది. ఆంధ్ర ఎస్ఐబి, గ్రేహౌండ్స్ సరిహద్దులు దాటి కోపర్డంగ్ లోయలో ప్లీనమ్ జరుపుకుంటున్న అరవై మంది సమావేశంపై గ్రెనేడ్లు విసిరారు. భద్రత కోసం నిలిచిన మహిళా గెరిల్లాలతో సహా అనారోగ్యంతో స్టెచర్ పై తీసుకువచ్చిన జిల్లా కార్యదర్శి గంటి రమేశ్ వరకు 17 మంది ఈ ఎన్కౌంటర్లో అమరులయ్యారు.
1980 నుంచి 97 వరకు విప్లవోద్యమ పునర్నిర్మాణ చరిత్రంతా సృజనాత్మకంగా సువర్ణముఖి కథల్లో చదువుకోవచ్చు.
2000 సంవత్సరం నుంచి శ్రీకాకుళం - ఆరంభ కాలంలో మూడు ఏజెన్సీ తాలూకాలు, ఉద్దానం మాత్రమే ఉన్న శ్రీకాకుళం - ఉత్తరాంధ్ర ఉద్యమంగానే కాదు ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు స్పెషల్ గెరిల్లా జోన్గా ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు, దక్షిణ ఒరిస్సాలో ఐదు జిల్లాలకు, వెరసి ఎనిమిది జిల్లాలకు విస్తరించింది. ఎఒబి స్పెషల్ గెరిల్లా జోన్ మొదటి కార్యదర్శిగా కృష్ణగా వడ్మాపురం చంద్రమౌళి, ఆయన సహచరి 2007 పార్టీ కాంగ్రెస్లో పాల్గొనడానికి వెళూ పట్టుబడి ఎన్కౌంటర్లో అమరులయ్యారు.

1987లో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ఏరియాతో ప్రారంభించి కోరాపుట్ ప్రాంతం దాకా కృష్ణ‌ నాయకత్వంలో విజృంభించిన విప్లవోద్యమం ఎన్నో ఆటుపోటులను, వాకపల్లి, భల్లగూడాలను తట్టుకొని నారాయణపట్నాప్రజా ప్రత్యామ్నాయ రాజకీయ పరిణతిగా దేశంలో గుర్తింపు పొందింది. 25 సంవత్సరాల క్రితమే నలగొండ జిల్లా వరిగొండ మండలం దాసిరెడ్డి గూడెం నుంచి వెళ్లిన చామల కిష్టయ్య - దయగా ఉద్దానం మొదలు ఎఒబి ప్రాంతమంతా చేసిన ఉద్యమ నిర్మాణం మల్లా ప్రజల హృదయాల్లో వెంపటాపు సత్యంను ప్రతిష్టించింది. ఆదివాసుల నుంచి రాష్ట్ర‌ నాయకత్వానికి బాకూరి వెంకటరమణ ఎదిగాడు. ఎందరో ఆదివాసీ మహిళలు ఎదిగారు. ఇవ్వాళ భూస్వాధీన పోరాటాలు, బాక్సెట్ వ్యతిరేక పోరాటాలు మాత్రమే కాకుండా ప్రజా ప్రత్యామ్నాయ విప్లవ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. స్వావలంబనతో కూడిన స్వపరిపాలన చేపట్టారు. అందుకే ఈ ఏబై ఏళ్లలో దేశంలో కనీవిని ఎరగని పెద్ద మారణకాండను తలపించే - రామగూడ ఎన్కౌంటర్ (24 అక్టోబర్ 2016) కు ఆంధ్ర, ఒరిస్సా, కేంద్ర బలగాల ముప్పేట దాడి తలపెట్టింది రాజ్యం.
మూడు వైపుల నీరున్న కటాఫ్ ప్రాంతంలో బలిమెల రిజర్వాయర్ దగ్గర జరిగిన ఈ మారణకాండలో రాష్ట్ర, කීඟුලි నాయకత్వంతో పాటు అధిక సంఖ్యలో ఆదివాసులు, అందులోనూ అధికంగా మహిళలు అమరులయ్యారు. అయినా 1972 శ్రీకాకుళం వలె ఈసారి ఎఒబి తుడిచి పెట్టకపోలేదు. పైగా ఎంత సంఖ్యలో కోల్పోయారు, అంత సంఖ్యలో రిక్రూట్ అయి అమరుల స్మారక భవనం నిర్మించుకొని రెవల్యూషనరీ ప్రావిన్షియల్ కౌన్సిల్ల నాయకత్వంలో ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాలతో పురోగమిస్తున్నారు. ఏడాది పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాలపై దాడులు, ముఖ్యంగా అమరుల బంధుమిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం, విరసం పై పోస్టరూ, దాడులు, ప్రత్యేకించి చైతన్య మహిళా సంఘాన్ని బద్నామీ చేయాలనే రాజ్యం కక్ష అక్టోబర్ 25 దాకా కూడా ప్రత్యక్షంగా చూసాం. ఇంత నిర్బంధం యాభై ఏళ్ల క్రితం శ్రీకాకుళం, నక్సల్బరీ పంథాలో ఎఒబిలో సాధిస్తున్న విజయాలకు దాఖలా.
నక్సల్బరీ, శ్రీకాకుళం మొదలు, ఎమర్జెన్సీ దాకా విప్లవోద్యమంపై, ప్రజాస్వామిక శక్తులపై తీవ్ర రాజ్యహింస అమలు చేసిన ఇందిరా గాంధీ రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత జాతులపై మారణకాండకు పూనుకున్నది. ఆనంద్ పూర్ సాహెబ్ తీర్మానం (రక్షణ, కరెన్సీ, విదేశాంగ విధానం, రైల్వేలు మినహా మిగతా శాఖలన్నీ రాష్ట్రాల‌ స్వయం నిర్ణయాలకు వదిలేయాలి. మతం విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు) అమలు మొదలు, ఖలిస్తాన్ వరకు 1980-84 మధ్య మిలిటెంట్ గా పంజాబ్ లో సిఖ్కు జాతి (భౌcమ్) చేపట్టిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. పంజాబ్ స్వర్ణ మందిరంపై బూస్టార్ ఆపరేషన్ పేరుతో సైనిక దాడి ఇందుకు పరాకాష్ట్ర యాదృచ్చికమే కావచ్చు కాని మొదలు పదకొండు సంవత్సరాలు, రెండవసారి నాలుగు సంవత్సరాలు దేశ ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ కూడా 1984 అక్టోబర్ 31ననే తన అంగరక్షకుల తుపాకి తూటాలకు ప్రధాని నివాసంలోనే కుప్పకూలి అసహజ మరణానికి గురైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజి హిట్లర్ యుద్ధంలో సోషలిస్ట్ శక్తుల చేతుల్లో ఓడిపోతు అసహజ మరణానికి గురైనప్పుడు ఫాసిజంపై ప్రజాస్వామ్య విజయాన్ని ప్రకటించిన ప్రజలు "జో హిట్లర్ కా చాల్ ఛలేగా హో హిట్లర్ కా మౌత్ మరేగా" నినదించారు. ఇందిరా గాంధి మరణం తరువాత దేశ వ్యాపితంగా ఈ భావననే పెల్లుబిక్కింది. రాజీవ్ గాంధీ విషయంలోను తమిళ జాతి అటువంటి ప్రతికారమే తీర్చుకుంది. వర్తమాన, భవిష్యత్తులో ఫాసిస్టు పాలకుల విషయంలో దేశ ప్రజలు ఏ తీర్పు ఇవ్వనున్నరో...
- వరవరరావు

Keywords : srikakulam, maoism, armed struggle, varavararao, revolution
(2017-11-23 14:18:33)No. of visitors : 132

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తెలంగాణను ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియా పరిపాలిస్తోంది ‍- వరవరరావు

తెలంగాణ ను ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా పరిపాలిస్తోందని విప్లవ రచయిత వరవరరావు మండిపడ్డారు. నేరెళ్ళ లో భూమయ్య మరణానికి, 8 మంది అరెస్టుకు కారణమైన ఇసుక మాఫియాను అరెస్టు చేయాలని, వాళ్ళ ఆస్తులు జప్తు చేసి , భూమయ్య కుటుంభానికి, నేరెళ్ళ దళితులకు పంచిపెట్టాలని వీవీ డిమాండ్ చేశారు. ....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

ʹనాగేశ్వర్ రావు అలియాస్ చిన్నబ్బాయ్ ని పట్టుకొని కాల్చి చంపారుʹ

మల్కన్ గిరి చిత్రకొండ సమితి దగ్గర కప్పాతుట్టా అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని ఆ ఎన్ కౌంటర్ లో ఒక నక్సలైటు చనిపోయాడని పోలీసులు చెబుతున్న కథనం బూటకం. ఇక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు జరగలేదని స్థానికులు అంటున్నారు....

ఇసుక మాఫియా ఆస్తులను జప్తు చేసి నేరెళ్ళ దళితులకు పంచాలి.. వీవీ డిమాండ్

సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్ళలో అనేక మంది మరణాలకు కారణమైన , పోలీసులతో ప్రజలపై దాడులు చేయించిన , యువకులను చిత్రహింసలపాజేసిన ఇసుక మాఫియాను అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంభాలకు పంచాలని విప్లవ రచయిత వరవరరావు డిమాండ్ చేశారు...

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
Saudi Arabia to Behead 6 School Girls for Being With Their Male Friends Without Parents or a Guardian
more..


శ్రీకాకుళములోన