కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల
ఏవోబీలోని బలిమెల ఒడ్డున రామగూడ గుట్టల్లో పోలీసులు జరిపిన సాముహిక మారణకాండలో 22 మంది మావోయిస్టు కార్యకర్తలు అమరులయ్యారు. ఆ సంఘటన నిజనిర్దారణ కోసం ఆ ప్రాంతానికి తెలంగాణ డెమాక్రటిక్ ఫోరం (టి.డి.ఎఫ్.) నిజనిర్ధారణ బృందం వెళ్ళి ఈ రోజుకు ఏడాది అయ్యింది. ఆనాటి ఆ అనుభవాలు, అనుభూతులు, గాయాలు, నెత్తుటి మరకలు... ఆ బృంద సభ్యురాలు సావి కొల్ల తన ఫేస్బుక్ టైంలైన్ పై పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ యదాతథంగా మీకోసం...
బలిమెల ఒడ్డున రామగూడ గుట్టల్లో జరిగిన సాముహిక మారణకాండ వివరాలను తెలుసుకోవటానికి వెళ్ళిన టి.డి.ఎఫ్. నిజనిర్ధారణ బృందంలో నేను కూడా ఉన్నాను. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మొదలైన ఆ ప్రయాణం, ప్రయాణ బడలిక, అడవిలో రాత్రి బస, వంటలు వండుకోవడం, ఆదివాసుల అమాయక చూపులు – చిరు నవ్వులు, సూటి ప్రశ్నలు, నిర్మొహమాట ప్రకటనలు అన్ని అలా అలా...... ఆనాటి ఆ అనుభవాలు, అనుభూతులు, గాయాలు, నెత్తుటి మరకలు ఈ ఫోటోల్లో కళ్ళ ముందు కదలాడుతున్నాయి.
అదిగో ఆ ఎర్ర గోంగూర చెట్టుందే అదే విప్లవ యువ కిశోరం మున్నా శత్రు సేనలతో వీరోచితంగా పోరాడుతూ తన రక్తంతో ఎరుపెక్కించిన నేల. సహచరులను, నాయకత్వాన్ని కాపాడడానికి విప్లవోద్యమానికి ఊపిరిలూదుతూ మున్నా ఊపిరి వదిలిన ఆ చోటంతా ఎర్ర గోంగూర మొక్కలతో అచ్చం ఎర్రపూల వనంలా విరబూసింది. ఆ జారుడు మట్టిదారి మన ప్రియతమ మహిళా నాయకురాలు భారతక్క తూటాల గాయాలతో పైకి ఎక్కలేక జారిపడ్డ బాట. ఆ కొండమలుపులోనే మిలిటరీ దిగ్గజం యాదన్న మరో తరాన్ని కాపాడడానికి శత్రు మోర్టార్లు, మెషిన్ గన్నులకు ఎదురొడ్డి పోరాడి నిలిచింది. ఆ కొండల మధ్య ఉన్న ఆ ప్లెన్ ప్రదేశమంత తూటాలు, రక్తపు మరకలు, కకావికల దృశ్యాలు. అక్కడే దాదాపు 22 మంది విప్లవకారులు అమరులైన ప్రాంతం. కనిపించే ఆ పెద్ద చెట్టుకిందే డి.జి.పి. వచ్చే ముందు రోజు మరో ఇద్దరు (ఒక ఆడ, ఒక మగ) కామ్రేడ్స్ ను చిత్ర హింసలు పెట్టి చంపినది. ఫోటోలో కనిపిస్తున్న తూటాలు మచ్చుకు కొన్ని మాత్రమే. మా బృందంలోని సభ్యులం చాలా మందిమి వాటిని ఏరుతుంటే ఓ మిత్రుడు పోలీసుల విచ్చలవిడి ఫైరింగ్ ను వెటకరిస్తూ పల్లిచేనులో కాయలేరినట్లుంది అన్నాడు. అక్కడో బూడిద ముద్ద ఉంది చూసారా... అదేమిటంటే ఎన్కౌంటర్ లో 31 మంది చనిపోయారు. శవాలను తరలించారు. తగలపెట్టారు కాని ఓ గ్రామస్థుడు తూటాల పాలబడి ఆ కొండగుట్టల్లో ఎవరూ చూడక అలానే మరణించి పురుగులు పడితే వారం రోజుల తరువాత గ్రామస్తులు గమనించి అక్కడే అలానే ఉంచేసి వారి ఆచారం ప్రకారం దహన సంస్కారాలు చేసారు.
మీకు గుర్తుందా వాగులో పడి ఓ పోలీస్ ఆఫీసీర్ మరణించాడనే వార్త... అదిగో ఆ ఫోటోలో చూడండి, కాళ్లు కడగటానికి కూడా సరిపోని ఆ కొంచం నీళ్ళే వాగంటే.. అందులోనే పడి మునిగి చనిపోయాడంట. ఎంత చవకబారుగా ఉందో కదా పోలీసుల కధనం. గ్రామాల్లో నిజ నిర్ధారణకు వెళ్ళినప్పుడు తమ బిడ్డలను, అక్కలను, అన్నలను కోల్పోయిన తండ్రులు, తల్లులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు మొత్తంగా గ్రామస్తులు ఆనాడు ఆ దారుణం ఎలా జరిగిందో కళ్ళకు కట్టినట్లు వివరించారు. తన మైనర్ కొడుకును బట్టలు తొలగించి చేతి రెక్క విరిచేసిన వైనాన్ని ఆ కన్నా తండ్రి వివరిస్తుంటే హృదయం బరువెక్కింది. తన ఎంతో అందమైన కూతురి మొఖాన్ని అంటే తలని నరికి వేసిన పైశాచికత్వం గురించి ఆ కన్నా తల్లి వివరిస్తుంటే కడుపుల పేగులు కదిలాయి. 22 రోజులపాటు పోలీస్ కస్టడీ లో చిత్రహింసలు అనిభవించి ముందురోజే విడుదలై వచ్చిన ఆ యువకుడి కళ్ళల్లో దైన్యం ధైర్యం రెండూ కనిపించాయి. వారికి పోలీసులు మావోయిస్టులు పట్ల స్పష్టత ఉంది, ఎవరు తమ కోసం పని చేస్తున్నారు అనే దాని పట్ల కూడా. పోలీసులు ఎంత భయ భ్రాంతులకు గురిచేసినప్పటికీ, తమ జీవితాలు బాగుపడటానికి వైద్యం, వ్యవసాయం, విద్య, చైతన్యం అందిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న మావోయిస్టులు అంటే వారికి చాలా అభిమానం. వారి త్యాగాలకు గుర్తుగా గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమకు చిహ్నాలుగా గూడాల్లో అమరుల స్తూపాలు నిర్మించుకున్నారు.
పచ్చని అడవుల మద్య చల్లని నది వొడ్డున ప్రశాంతంగా నిదురిస్తున్న పల్లెకు పోలిస్ బలగాలు చేరుకున్నది ఆ అందమైన నది ద్వారానే. కొన్ని గుడిసెలు మాత్రమే ఉన్న గ్రామంలోని అదిగో ఆ చిన్న గుడిసె గోడకున్న తూటాలు చూసారా! పక్కనే ఉన్న రామగిరి గుట్టల మధ్య చేయబోతున్న పాశవిక హత్యాకాండను అడ్డుకోవడానికి గ్రామస్తులెవరూ రాకుండా నియంత్రించడానికి వారిని భయాందోళనలకు గురిచేస్తూ ఆ పసి పిల్లలు, ఆడవాళ్ళూ ఉన్న గుడిసె మీద ఫైరింగ్ చేసారు. తరువాత మావోయిస్టు శిబిరం మీద మూడు వైపుల నుంచి చుట్టు ముడుతూ రాపిడ్ ఫైరింగ్ చేశారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బూట్లు, కిట్ బ్యాగులు, పుస్తకాలు, పేపర్లు, వంట సామగ్రి, రేషన్, వండిన అన్నం, బూజు పట్టిన పచ్చడి, మొక్కజొన్న కంకులు, పల్లి గింజలు, ప్లాస్టిక్ సంచులు, టూత్ బ్రష్ లు, అండర్ వేర్స్, మందుల రాపర్లు, తూటాలు... క్యాంప్ లో పడి ఉన్నాయి. శిబిరం మొత్తం ధ్వంసం అయిపోయింది. ధ్వంసమైన మొక్కజొన్న కంకులనుండి చిగురిస్తున్న మొలకలు తూర్పు కనుమల్లో వికసిస్తున్న విప్లవోద్యమానికి ప్రతీక గా పైకి లేస్తున్నాయి. దారిపొడుగునా అమరుల స్తూపాలు గుండెల నిండా విశ్వాసాన్ని ప్రజలపట్ల ప్రేమను సమాజంపట్ల బాధ్యతను పెంచుతూ నిటారుగా, ఠీవిగా ఎర్రటి నక్షత్రాలై మెరుస్తూ దారి చూపిస్తున్నాయి.
- సావి కొల్ల
Keywords : maoists, encounter, AOB, Police, ramaguda, munna
(2024-11-30 19:45:20)
No. of visitors : 2923
Suggested Posts
| ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ - సందె గంగయ్యతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి !ఏవోబీలో మరో (పోలీసుల కథనం ప్రకారం)ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. |
| గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల మృతదేహం కోసం పోరాటంఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో జరిగినట్టు చెబుతున్న ఎన్కౌంటర్ నిజమా అబద్దమని మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీలను పట్టుకొని కాల్చి చంపారని. స్థానిక ఆదివాసులైన జయంతి , రాధిక గొల్లూరి,సుమలా , రాజశేఖర్ కర్మలను పోలీసులు అరెస్టు చేసి పట్టుకెళ్ళారని వారిని కూడా చంపేస్తారేమోననే ఆందోళన ఆద |
| మావోయిస్టు అరుణ ఎక్కడ ?
సీపిఐ మావోయిస్టు పార్టీ నాయకురాలు అరుణ ఎక్కడుంది? పోలీసుల అదుపులో ఉన్నదా ? ఏవోబీలోనే సేఫ్ గా ఉన్నదా ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉన్నది. ఈ నెల 22న గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ చనిపోయిందని ప్రచారం కూడా సాగింది. |
| అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులుఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగినట్టు అందులో మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీల ఎలియాస్ మీనా ఎలియాస్ జిలానీ మృతి చెందిన ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. |
| ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభపోలీసుల కూంబింగ్ తీవ్రంగా జరుగుతుండగానే సీపీఐ మావోయిస్టు పార్టీ అదే ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న బలిమెల రిజర్వాయర్ కటాఫ్ ఏరియాలో ఈ సభ నిర్వహించారు. |
| అక్టోబరు దాడి తర్వాత... AOBలో ఏం జరుగుతోంది...? ʹʹ వాళ్లు మా ప్రభుత్వంపై దాడి చేశారు. అయితే శాశ్వతంగా వారు నష్టం కలిగించలేరు. ఈ రోజు కను చూపు మేరలో కూడా పోలీసుల జాడ లేదు. మళ్లీ మా పార్టీ పూర్తిస్థాయిలో వచ్చేసిందిʹʹ అని చెప్పాడు దోమ్రు.... |
| కామ్రేడ్... నీ నెత్తిటి బాకీ తీర్చుకుంటాం... గర్జించిన వేల గొంతులువార్త తెలుసుకున్న వందలాది గ్రామాలనుండి వేలాది మంది ఆదివాసులు ఆదివారం రాత్రి నుండే కొండెముల గ్రామానికి రావడం మొదలుపెట్టారు. సోమవారం ఉదయానికే ఆ గ్రామం ఎర్రజెండాలు చేబూనిన వేలాదిమందితో నిండిపోయింది. తమ ప్రియతమ నాయకుడి భౌతిక కాయాన్ని చూసిన ప్రజలు బోరుమంటు విలపించారు.... |
| పితృస్వామ్యంపై విల్లెత్తిన విప్లవ మహిళ - భారీ బహిరంగ సభఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ముంచింగుపుట్టు ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా , మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ... |
| గుంపులలో సందె గంగన్న సంస్మరణ సభ (వీడియో)
ఏవోబీలో ఎన్ కౌంటర్ లో మరణించిన సందె గంగన్న సంస్మరణ సభ ఈ రోజు ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంపులలో జరిగింది. |
| నిత్య పోలీసు దాడుల నడుమ మావోయిస్టుల నాయకత్వంలో సాగుతున్న భూపోరాటాల జైత్ర యాత్రగ్రామాలపై పోలీసుల దాడులు... ఎన్ కౌంటర్ హత్యలు.... ఏవోబీలో ఒక వైపు పోలీసులు ప్రతి చెట్టును, పుట్టను తమ తుపాకులతో జల్లెడ పడుతూ భయోత్పాతం సృష్టిస్తుండగానే... మరో వైపు ప్రజలు భూపోరాటాలు, అమరుల సంస్మరణ సభలు జరుపుకుంటూ తమ... |