ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

ఎవరివీ

(వీక్షణం సపాదకులు ఎన్.వేణు గోపాల్ రాసిన ఈ వ్యాసం వీక్షణం డిసెంబర్, 2017 సంచికలో ప్రచురించబడినది)

మిత్రులారా, నేను రాసిన ʹఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు?ʹ వ్యాసం వీక్షణం డిసెంబర్ 2017 సంచికలో అచ్చయింది. పత్రికలో అచ్చయిన ప్రతిలో కొన్ని అచ్చుతప్పులున్నాయి. అచ్చుతప్పులు లేని మొత్తం వ్యాసం యూనికోడ్ ప్రతి కూడ ఇక్కడ ఇస్తున్నాను. అలాగే 1975 విరసం కార్యవర్గ తీర్మానాన్ని వ్యాసంలో యథాతథంగా ఉటంకించాను. దానిలో స్త్రీలను కించపరిచే నానుడి ఒకటి ఉంది. విరసం కూడ ఇప్పుడైతే అటువంటి వ్యక్తీకరణ వాడదనుకుంటాను. కాని అది చారిత్రక పత్రం గనుక దాన్ని యథాతథంగా ఇవ్వక తప్పలేదు.
***
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ʹప్రపంచ తెలుగు మహాసభలుʹ నిర్వహించబోతున్నది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభల్లో తెలంగాణలోని తెలుగు భాషాభిమానులతో పాటు, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరూ పాల్గొనాలని ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ʹఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సులు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిపైన కూలంకషంగా చర్చిస్తాయి. గత వైభవాన్ని ఘనంగా తలచుకుంటూనే వర్తమానాన్ని విశ్లేషిస్తాయి. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి. ఈ సభల్లో ఏర్పాటు చేసే కళాప్రదర్శనలు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్య రసహృదయులందరూ ఒకచోటకు చేరటంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు నూతన ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తాయిʹ అని ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనలో అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, నందిని సిధారెడ్డి అధ్యక్షుడుగా ఉన్న తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం రెండు కారణాల వల్ల చర్చనీయాంశమవుతుంది. ఒకటి, ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు, ప్రభావశీలమైన ప్రజాపక్ష కవిగా, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడుగా నందిని సిధారెడ్డి గతంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో తెలుగు భావన పట్ల ప్రకటించిన వైఖరి. రెండు, గతంలో అదే పేరుతో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల పట్ల వారు తీసుకున్న వైఖరి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెరాస అధ్యక్షులు కె చంద్రశేఖర రావు తెలుగు భాష గురించి, ఆంధ్ర పెత్తనం గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ʹఎవరి తెలుగు, ఎవరి తెలుగు తల్లి, తెలుగు తల్లా దయ్యమాʹ అని ఎన్నోసార్లు ప్రశ్నించి వివాదం రేపారు. ఆయనను అనుసరించిన చాల మంది ఉద్యమకారులు కూడ తెలుగు అనే మాటే అభ్యంతరకరమైనదిగా చూశారు. చివరికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడ పత్రికల్లో, ప్రసార సాధనాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు అనే మాట వచ్చినా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కవి నందిని సిధారెడ్డి కూడ తెలంగాణ ఏర్పడడానికి ముందు జరిగిన సభల్లో అనేకసార్లు తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు వేరువేరు అని మాట్లాడారు. ఈ ధోరణి ఇంకా తీవ్రమై తెలంగాణ భాష తెలుగే కాదని అనేంతవరకూ సాగింది. తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర ప్రాంత నాయకుల రాజకీయార్థిక ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భాషా సాహిత్యాల మీద ఆంధ్ర ప్రాంత పెత్తందారీ తనాన్ని వ్యతిరేకించడం అనే తప్పనిసరిగా తీసుకోవలసిన వైఖరి పరిధులు దాటి ఆంధ్ర ప్రాంత ప్రజలను, ఉమ్మడి భాషను, ఉమ్మడి వారసత్వ చరిత్రను, సంస్కృతిని, సాహిత్యాన్ని ఖండించడం దాకా ఇది సాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ʹతెలుగు సభలుʹ జరపాలని, గత ప్రభుత్వాలు ఉపయోగించిన పేరునే, అదే పద్ధతిలో వాడుకోవాలని అనుకోవడం ఆశ్చర్యకరమే.
రెండవది, ʹప్రపంచ తెలుగు మహాసభలుʹ అనే మాట కొత్తది కాదు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు అనే పేరుతోనే 1975లో ప్రారంభించి 2012 వరకూ నాలుగు సార్లు (మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్ 12-18, హైదరాబాద్; రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు 1981 ఏప్రిల్ 14-18, కౌలాలంపూర్, మలేషియా; మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 1990 డిసెంబర్ 10-13, మోకా, మారిషస్; నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు 2012 డిసెంబర్ 27-29, తిరుపతి) ఇటువంటి మేళాలనే నిర్వహించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇతరులు కూడ అదే పేరుతో ఎన్నో చోట్ల ఇటువంటి సభలను నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ అదే పేరుతో నిర్వహించబోతున్నాయంటే 2017 సభలు పాత సభలకు కొనసాగింపా, భిన్నమైనవా ప్రశ్నించవలసి వస్తున్నది. గతంలో జరిగిన ʹప్రపంచ తెలుగు మహాసభలుʹ తెలంగాణకు అన్యాయం చేసిన సమైక్యతకు చిహ్నంగా జరిగాయంటూ బహిష్కరించాలని పిలుపు ఇచ్చినవాళ్లే ఇవాళ ఆ పేరుతోనే సభలు జరపడం, వారు వీరయ్యారా, వీరు వారయ్యారా అని సందేహానికి తావు ఇస్తుంది.
పైగా గత సభల్లో మొదటి మహాసభలు కచ్చితంగా 1969 తెలంగాణ ఉద్యమ అపజయం తర్వాత, 1972 ఆంధ్ర, తెలంగాణ ఉద్యమ అపజయం తర్వాత, ఆంధ్ర పెత్తందార్ల విజయసూచకంగా జరిగాయి. ఆ సభల నాటికి తెలంగాణ సాహిత్యవాదులు స్పష్టమైన సంఘటిత రూపం తీసుకోలేదు గనుక తెలంగాణ వాదులవైపు నుంచి వాటిని బహిష్కరించాలనే మాట రాలేదు. కాని, ఆ తర్వాత రెండు ప్రపంచ మహాసభలు విదేశాల్లో జరిగి, నాలుగో మహాసభలు సరిగ్గా ఉధృతమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తిరుపతిలో జరిగాయి. ఆ మహాసభలకు ప్రత్యేక నేపథ్యం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించడమే. అప్పటికే సాగుతున్న కుహనా సమైక్య ఉద్యమానికి మద్దతు పలకడమే. అందువల్లనే ఈ తిరుపతి మహాసభలను బహిష్కరించాలని, ఇవి సమైక్యవాదుల కుట్రపూరిత సభలని తెలంగాణవాదులందరూ పిలుపునిచ్చారు. (ఇప్పుడు ఆ తిరుపతి మహాసభలు ఎంత ఉజ్వలంగా జరిగాయో స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారి రాస్తున్నారు!!) తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.
తెలంగాణ అనే ఏకైక అంశం వల్ల మాత్రమే కాదు, ప్రభుత్వాలను, పాలకవర్గాలను మొత్తంగా ధిక్కరించే, అసలు ఈ వ్యవస్థనే మార్చాలనుకునే విప్లవవాదులు కూడ ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించమని, తిరుపతి సందర్భంలో మాత్రమే కాదు మొత్తంగానే అంటూ వస్తున్నారు. సాహిత్యాన్నీ, సంస్కృతినీ, సాహిత్యకారులనూ లోబరచుకునే ప్రయత్నాలలో భాగంగానే పాలకవర్గాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయనీ, ప్రజల పక్షం ఉన్నవారు వీటిని బహిష్కరించాలనీ విప్లవ రచయితల సంఘం మొదటి నుంచీ పిలుపునిస్తోంది. తొలి ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించమంటూ విప్లవ రచయితల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది.
ʹశ్రమజీవులకు వీసమెత్తు స్థానం లేని ప్రపంచ తెలుగు మహాసభలు కలవారి వినోద కార్యకలాపాలకు రంగస్థలం కావటంలో ఆశ్చర్యం లేదు. తెలుగువారిమధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే గాక తిరుగబడిన విద్యార్థుల్ని, సామాన్య ఉద్యోగుల్ని సమైక్యత పేరుతో నెత్తురుటేళ్లలో ముంచిన విషయం తెలుగు ప్రజల మనోఫలకాల నుండి ఇంకా చెరిగిపోలేదు. ప్రపంచచరిత్రలోనే అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిభాసంపత్తులతో ప్రజల జీవనరాగాల్ని, పోరాటాల్ని గానం చేసిన సుబ్బారావు పాణిగ్రాహిని, ముక్కుపచ్చలారని పదునాలుగేళ్ళ బాల కళాకారుడూ, విప్లవకారుడూ అయిన చినబాబును, స్త్రీలోకం గర్వించే విధంగా ప్రజల కోసం ఆయుధాలు పట్టిన పంచాది నిర్మలను, అంకమ్మను, పద్మక్కనూ, స్నేహలతనూ పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరపడం మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కటమే. అనేక వందల మంది విప్లవకారుల్ని పిట్టల్లా కాల్చి చంపింది ఈ ప్రభుత్వమే. విప్లవ రచనల్ని నిషేధించి రచయితల్ని కుట్రకేసుల్లో ఇరికించి దీర్ఘకాల నిర్బంధానికి గురి చేసిందీ ఈ ప్రభుత్వమే. కూటికిలేని కూలి నాలి జనాల నుండి నిర్బంధంగా డబ్బు వసూలు చేసి కోటికి పడగలెత్తిన వేయితలల విషపునాగైన ఈ ప్రభుత్వం తెలుగు సంస్కృతీ సాహిత్యాల గురించి మాట్లాడటం విడ్డూరాలలోకెల్లా విడ్డూరం....జాతి, భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు వేటినీ అభివృద్ధి చేయని, చేయలేని కృత్రిమ వేషాల, వాగ్దానాల అంటురోగం నుండి బయటపడని ఎరువు తెచ్చుకున్న మోకాటి బుద్ధితో, బూర్జువా, భూస్వామ్య సంస్కృతికి నీరాజనం పడుతూ జరుపుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్ని విప్లవ రచయితల సంఘం నిర్ద్వంద్వంగా బహిష్కరిస్తోంది...ʹ అని విరసం కార్యవర్గ తీర్మానం ప్రకటించింది. ʹబూర్జువా, భూస్వామ్య సంస్కృతికి కైవారాలు పలుకుతున్న ఈ సభల్ని బహిష్కరిస్తున్నానుʹ అని ప్రకటించిన శ్రీశ్రీ మహాసభలు జరుగుతున్న లాల్ బహదూర్ స్టేడియం ప్రధాన ద్వారం దగ్గర విరసం సభ్యులు చెరబండరాజు, ఎంటి ఖాన్, కాశీపతి, నగ్నముని, రంగనాథం, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు మాధవరావు, తేజ్ రాజేందర్ సింగ్, విజయ, అరుణ, జలజ తదితరులతో నిరసన ప్రదర్శన జరిపారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి ముప్పై ఆరు గంటల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఆ తర్వాత రెండు మహాసభలు దేశంలో జరగలేదు. నాలుగో మహాసభ తిరుపతిలో జరుగుతుండగా విరసం మళ్లీ బహిష్కరణ పిలుపు ఇచ్చింది. సభా ప్రాంగణంలో నిరసన తెలపడానికి వెళ్తున్న విరసం నాయకులను మార్గమధ్యంలో రైళ్లలోంచి, బస్సుల్లోంచి దించి అరెస్టు చేశారు.
ఇంత ఘన చరిత్ర గల ప్రపంచ తెలుగు మహాసభలు పేరునే యథాతథంగా కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం గత ప్రభుత్వ ప్రయత్నాల కన్న భిన్నంగా ఏమీ కనబడడం లేదు. సభల లక్ష్యాలుగా ప్రకటిస్తున్నవన్నీ గత సభలలో సమైక్య ప్రభుత్వాలు ప్రకటించినవే. అప్పటి లక్ష్యాలలో ఒకటైన సమైక్యత కూడ ఇప్పుడు వినబడుతున్నది. అప్పుడు తెలంగాణ సాహిత్య, సంస్కృతులను అణచివేసే, సమైక్యతను ప్రబోధించే లక్ష్యాలుగా కనబడినవి ఇప్పుడు గత వైభవాన్ని ఘనంగా తలచుకునేవిగా, వర్తమానాన్ని విశ్లేషించేవిగా, భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించేవిగా కనబడుతున్నాయి. నామమాత్రపు ప్రదర్శనా వస్తువులుగా ప్రజాకళా రూపాలు కొన్నయినా ఉన్నాయి గాని, సాహిత్య చరిత్ర మాత్రం ముఖ్యమంత్రి ప్రసంగం వరకే చూస్తే దాశరథి, కాళోజీలతో ఆగిపోయింది (అది కూడ వారిద్దరిదీ నిజాం వ్యతిరేక పోరాట కవిత్వం అనకుండా!). ఆ తర్వాత గడిచిన ఏడు దశాబ్దాల తెలంగాణ సాహిత్య చరిత్ర ప్రస్తావనకైనా రాలేదు. అంటే ఇదంతా గత వైభవం గురించి చెప్పి మైమరిపించే సర్కసే తప్ప ప్రస్తుతమూ వర్తమానమూ కాదు. వర్తమాన జనజీవనం ఎలా ఉన్నదో, ఆ జనజీవనాన్ని చిత్రించడానికి, ప్రతిఫలించడానికి, విశ్లేషించడానికి, ఉన్నతీకరించడానికి సాహిత్యం ఏ కర్తవ్యాలను నిర్వహించవలసి ఉన్నదో చెప్పదలచుకుంటే పాలకుల దుర్మార్గాల గురించి చెప్పకతప్పదు. అందువల్ల పాలకుల కనుసన్నల్లో నడిచే ఈ సభలు వర్తమానం లేని గతాన్ని, శవాన్ని పూజించడమే తమ లక్ష్యంగా భావిస్తున్నాయి. ప్రజాకళలను వినోద వస్తువుగా, అలంకారంగా, కరివేపాకుగా చూపదలచాయి గాని ఆ కళల కాణాచి అయిన ప్రజల జీవితం ఎలా కునారిల్లిపోతున్నదో చూసే, చూపే చిత్తశుద్ధీ, ఓపికా, సంయమనమూ ఈ సభలకు లేదు.
నిజానికి తెలుగు అనే భాష ప్రజలది. ఆ భాషలో ప్రజలు తమ సుఖదుఃఖాలను గానం చేసుకుంటున్నారు. ప్రజలు తమ గతపు కడగండ్లనూ పోరాటాలనూ తలచుకుని, వర్తమానం దుర్భరత్వానికి చింతిస్తూ, భవిష్యత్తు కోసం కలలు గంటున్నదీ, ఆ కలలకు సాహిత్య, కళారూపం ఇస్తున్నదీ ఆ భాష లోనే. ఆ ప్రజలకు గాని, వారి భాషకు గాని, ఆ భాష పరిరక్షణకు గాని ఏ సహాయమూ అందించని, తమ స్వార్థప్రయోజనాలే, తమ ఆశ్రితుల ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్న ప్రభుత్వానికి తెలుగు మహాసభలను నిర్వహించే నైతిక అర్హత లేదు. తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఏ ఆకాంక్షలతో, ఏ కలలతో స్వరాష్ట్రం కోరుకున్నారో, ఉద్యమించి, అపారమైన త్యాగాలు చేశారో, ఆ ఆకాంక్షలనూ, కలలనూ, ఉద్యమ సంప్రదాయాలనూ, త్యాగాలనూ నిరంకుశంగా కాలరాస్తున్న ప్రభుత్వానికి, పాలకవర్గాలకు ప్రజల భాష పేరు మీద సభలు జరిపే నైతిక అర్హత లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంనిర్ణయాధికారం అనే మౌలిక ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో పాత ఉమ్మడి రాష్ట్రపు నిరంకుశ, దోపిడీ, పీడన పద్ధతులనే అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల భాష గురించి సభలు జరిపే నైతిక అర్హత లేదు. దళితుడే ముఖ్యమంత్రి, భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, కెజి నుంచి పిజి ఉచిత విద్య, ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం ఆపివేత, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు రద్దు చేసి, పూర్తిస్థాయి నియామకాలు జరపడం వంటి లెక్కలేనన్ని హామీల విషయంలో వాగ్దాన భంగం చేసిన ఈ ప్రభుత్వానికి తెలుగు భాష పరిరక్షణ అనే మరొక హామీ మీద సభలు జరిపే నైతిక అర్హత లేదు. దేశదేశాల దోపిడీదార్లకు ఎర్రతివాచీ ఆహ్వానాలు, రాష్ట్ర ప్రజల వనరుల అప్పగింత, అసంఖ్యాక రైతుల ఆత్మహత్యలు, ఇబ్బడిగా ముబ్బడిగా పెరిగిన రుణభారం, కనీస వాక్సభా స్వాతంత్ర్యాలతో సహా అన్ని పౌరహక్కుల ఉల్లంఘన, బూటకపు ఎన్ కౌంటర్లు, దళితులపై, ఆదివాసులపై దాడులు వంటి ఏ అంశం చూసినా కనీస ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపక్షపాతాన్ని చూపని ఈ ప్రభుత్వానికి ప్రజల భాష గురించి సభలు జరిపే నైతిక అర్హత లేదు. తెలంగాణ కోసమే ఆలోచించి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రుతి వంటి విద్యాధిక యువతిపై అత్యాచారం చేసి చంపిన ఈ ప్రభుత్వం, వివేక్ వంటి ముక్కుపచ్చలారని విద్యాధికుడిని కాల్చిచంపిన ఈ ప్రభుత్వం, తెలంగాణ కోసమే ఆడి, పాడిన కళాకారుడు ప్రభాకర్ కు స్థానికులు స్తూపం నిర్మించదలచుకుంటే అడ్డుకుని, బంధుమిత్రులను నిర్బంధించిన ఈ ప్రభుత్వం, కవి, రచయిత కాశీంపై, తెలంగాణ విద్యార్థి నాయకుడు మహేష్ పై అబద్ధపు కుట్రకేసులు బనాయించిన ఈ ప్రభుత్వం ప్రజల భాషనూ, సంస్కృతినీ కాపాడడానికే ఈ సభలు జరుపుతున్నదని ఎవరైనా అనుకుంటే వారి అమాయకత్వానికి జాలి పడడం కన్న చేయగలిగింది లేదు.
రొట్టె ఇవ్వకుండా ఉండడానికి సర్కస్ ఇవ్వు అని ఇంగ్లిష్ సామెత చెప్పినట్టు, ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేసిన, చేస్తున్న ఈ పాలకవర్గాలు ప్రజల దృష్టి మళ్లించడానికి ఏర్పాటు చేస్తున్న సర్కస్ ఈ తెలుగు మహాసభలు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు కూడ అవసరం వచ్చినప్పుడల్లా ఇటువంటి సర్కస్ లు ఎన్నో నిర్వహించారు. ఆ అనుభవంతో, రెండాకులు ఎక్కువ చదివినట్టుగా ఈ పాలకులు మరొక కొత్త సర్కస్ నిర్వహిస్తున్నారు.
-ఎన్. వేణు గోపాల్, రచయిత, వీక్షణం ఎడిటర్

Keywords : world telugu meetings, prapanch telugu mahasabhalu, kcr, ktr, TJF, Virasam
(2024-04-24 20:40:11)



No. of visitors : 2455

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం

వీక్షణం, రాజకీయార్థిక సామాజిక మాసపత్రిక గత పదిహేడు సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజాపక్షం వహిస్తున్నందుకు, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను, విధానాలను విమర్శనాత్మకంగా పరిశీలించి, ప్రజలకు తెలియజేస్తున్నందుకు పాలకుల కన్నెర్రకు గురవుతున్నది.

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఎవరివీ