ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాల
(సీనియర్ జర్నలిస్టు, విరసం సభ్యురాలు ఎం.రత్నమాల రాసిన ఈ వ్యాసం వీక్షణం డిసెంబర్, 2017 సంచికలో ప్రచురించబడినది)
ఆదిలాబాద్ (పాత) జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య గత రెండు నెలలుగా సాగుతున్న ఘర్షణ తెలంగాణలోని ఖమ్మం మొదలైన ఏజెన్సీ ప్రాంతాలకే కాదు, ఆదిలాబాద్ జిల్లా (పాత) పొరుగున రెండు రాష్ట్రాల సరిహద్దు మహారాష్ట్రలోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది. 2017 అక్టోబర్ 6న జోడెన్‌ఘాట్‌లోని ఆదివాసి మ్యూజియంలో ఉన్న లంబాడా స్త్రీ విగ్రహాన్ని ఆదివాసీలు తగులబెట్టడం తో ఈ రెండు తెగల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలకు మూలం 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి. ఈ వలసల ఉదృతి వల్ల అంతకు ముందు ఇక్కడ మైనస్ 2 శాతం మాత్రమే ఉన్న ఆదివాసీల జనాభా అభివృద్ధి రేటు ఒక్క 1976 సంవత్సరంలోనే 6 శాతం పెరిగింది. లంబాడాలను షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో మహారాష్ట్ర నుంచి వెల్లువెత్తిన లంబాడాల వలస కారణంగా జిల్లాలో ఒకే సంవత్సరంలో అంతకు ముందు మైనస్ జనాభా అభివృద్ధి రేటు ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి దారితీసింది. లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడాన్ని అదివాసీలు అప్పుడే వ్యతిరేకించారు. ఆనాటి నుంచి ఈ విషయంపై ఆదివాసీల అసంతృప్తి గతంలో కూడా అనేక పర్యాయాలు ఆదివాసీలు బహిరంగంగా ప్రకటిస్తూ వస్తూనే ఉన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద కొన్నిసార్లు, హైదరాబాద్‌లోని ట్రైబల్ వెల్‌ఫేర్ కమిషనరేట్ వద్ద ఆందోళనలు చేశారు. నేను పౌరహక్కుల సంఘం అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న కాలంలో రెండు సార్లు హైదరాబాద్‌లో మాసబ్ ట్యాంక్ పక్కన ఉన్న ట్రైబల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆదివాసీలు ఆందోళన చేసినప్పుడు నేను వారితో పాల్గొని కమిషనర్‌కి వినతి పత్రం ఇచ్చాం. ఇందువల్లనే గతంలో కూడా ఆదివాసీలకు ఈ విషయంపై ఆందోళన చేశారని చెప్పగలుగుతున్నాను.
అసలు ఆదివాసీలకు, లంబాడాలకు రూపురేఖల్లోనే శరీర వర్ణం, వస్త్రధారణ, ఆచార వ్యవహారాలు, మొత్తంగా ఈ రెండు వర్గాల సంస్కృతికి ఏమాత్రం పోలికలు లేవు. అభివృద్ధి విషయంలో కూడా మైదాన ప్రాంతాలతో సంబంధం ఉన్న లంబాడాలు విద్య, ఉద్యోగ, తదితర విషయాల్లో ఆదివాసీల కంటే ఎంతో ముందున్నారు. లంబాడాలను షెడ్యూల్డు తెగగా ప్రకటించిన తర్వాత ఆదిలాబాద్ (పాత) షెడ్యూల్డు తెగకు ప్రత్యేకించిన నియోజకవర్గాలన్నింటిలో ఎంఎల్‌ఎలు అత్యధికులు (పేరు చివరన రాథోడ్, నాయక్ కలిగినవారు లంబాడాలే) మండల, స్థానిక సంస్థల్లో కూడా లంబాడాలే అత్యధికంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, గురుకుల పాఠశాలల్లోని, వీటికి అనుబంధంగా ఉన్న విద్యార్థి వసతి గృహాల్లో దాదాపు 60 శాతానికి పైగా లంబాడాలు ఉంటున్నారు. 1992 - 1994 సంత్సరాల్లో నేను ఆదిలాబాద్ జిల్లాలో దిన పత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న కాలంలో నేను జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించిన, సేకరించిన సందర్భంలో నేను గుర్తించిన విషయం ఇది కనుకనే నేనీ విషయం స్పష్టంగా చెప్పగలుగుతున్నాను.
రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డు (సి) సెక్షన్ పేరా 13 ఆర్టికల్ 244 (1) ప్రకారం లంబాడా ఉద్యోగులు ఆదివాసి షెడ్యూల్డు ప్రాంతాల్లో ఉద్యోగానికి అనర్హులంటూ జిల్లాలోని లంబాడా ఉద్యోగులను ఈ ప్రాంతం నుంచి పంపించాలని ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్న ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. జైనూరు మండంలోని మార్లవాయి పాఠశాలకు, ఆ తర్వాత నార్మూరు మండల కేంద్రంలోని పాఠశాలలకు ఆదివాసీలు తాళాలు వేశారు. అసలే అభద్రతా భావంతో ఉన్న ఆదివాసీలకు ప్రభుత్వ చర్యలు మరింత ఆజ్యం పోసినట్లయింది. అక్టోబర్ 6న ఆదివాసి మ్యూజియంలో లంబాడా స్త్రీ విగ్రహాన్ని తగలబెట్టారని పోలీసులు కేసు రిజిష్టర్ చేయడం, కొందరిని అరెస్టు చేయడం పట్ల నిరసనగా ఆదివాసీలు చేపట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసు అధికారులు లంబాడాల ర్యాలీకి అనుమతించడం ఆదివాసీల ఆగ్రహానికి అజ్యం పోసినట్లయింది. ఈ దాంతో నవంబర్ 12న లంబాడాలు తలపెట్టిన మరో ప్రదర్శనను పోలీసులు అనుమతించలేదు.
నవంబర్ 8న ఇంద్రవెల్లి స్థూపం వద్ద నుంచి ఉట్నూరు ఐటిడిఎకు ఆదివాసీలు నిర్వహించిన రోజే లంబాడా అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 మంది లంబాడా ఉపాధ్యాయులు ఐటిడిఎ ముందు ధర్మా చేశారు. ఇరు వర్గాల మధ్య ఐటిడిఎ ముందు తీవ్ర ఘర్షణ జరిగింది. అందుకే నవంబర్ 12న లంబాడాలు తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాని అంతకు ముందు లంబాడాల ధర్నాకు ఆదివాసీలు అదే రోజు ప్రదర్శన ఉందని తెలిసి కూడా అనుమతులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇరు వర్గాల మధ్య సామరస్యతకు ప్రయత్నించడం కంటే రెచ్చగొట్టే వ్యవహారంగానే కనిపించడంలో అవాస్తవమేమీ లేదు.
ఏ విధంగా చూసినా ఆదివాసీల ఆగ్రహంలో న్యాయం ఉంది. ఇంత కాలంగా ఆదివాసీల్లో ఈ విషయంపై రగులుతూ వస్తున్న అసంతృప్తి ఇప్పుడు కట్టలు తెంచుకుని ఆందోళన అలజడి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. అంతేకాదు, గతకొంత కాలంగా వాల్మీకి బోయలు కూడా తమను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇట్ల ఒక తెగ తర్వాత మరో తెగ తమను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించాలని అంటూపోతే చివరికి తమ పరిస్థితి ఏమిటని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. లంబాడాలు కొంత కాలంగా తమను లంబాడాలు అనవద్దని, గొర్బాయిలు (గొరా - ఎరుపు వర్గం) అనాలని అంటున్నారు. కానీ, ప్రస్తుతం ఆదివాసీలతో ఘర్షణ పడుతున్న లంబాడాలు తాము చేస్తున్న ఆందోళనలన్నీ లంబాడా ఉపాధ్యాయ సంఘం - లంబాడా ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. కనుక నేను కూడా ఇక్కడ లంబాడాలనే పేర్కొంటూ రాయాల్సి వచ్చింది. లంబాడాలని షెడ్యూల్డు తెగగా ప్రకటించారు గనుక ఇక్కడ మాత్రం గొర్బాయిలు అనాలనే వాదన తెలివిగా దాటవెస్తున్నారు లంబాడాలు. ఎంతైన మైదాన ప్రాంతాల సంబంధంతో అబ్బిన తెలివి తేటలు కదా లంబాడాలవి. వెనక్కి పోతున్న కొద్దీ ఎప్పటికప్పుడు మారుమూలలకు నెట్టివేయబడుతున్న ఆదివాసీలు విగ్రహం తగలబెట్టారన్న ఐదుగురు ఆదివాసీలను అరెస్టు చేయడం వాళ్లను మరింత రెచ్చగొట్టడమే. ఈ అరెస్టు తర్వాతనే ఆదివాసీలు లంబాడా టీచర్లు వెళ్లిపోవాలంటూ పాఠశాలలకు తాళాలు వేశారు. దొంగే దొంగ అని అరిచినట్లు లంబాడాలు ఒక ఆదివాసి (కొలామ్ తెగ) యువకున్ని కొట్టి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, డబ్బులు లాక్కున్నారు. ఇది పిర్యాదు చేసినా పోలీసులు ఏ చర్యా తీసుకోలేదు. ఇవన్నీ చూసీ ప్రభుత్వం లంబాడాలతో కుమ్మక్కయిందని ఆదివాసీలు అనుకోవడంలో అవాస్తవమేమీ లేదు.
-ఎం.రత్నమాల, సీనియర్ జర్నలిస్టు, విరసం సభ్యురాలు
Keywords : adivasi, lambada, adilabad, girijan, telangana, kcr, reservations
(2024-09-08 00:52:25)
No. of visitors : 5434
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ... |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |