అధికారవ్యామోహం, అవకాశవాదమే తెలంగాణ పునరేకీకరణా - సతీష్


అధికారవ్యామోహం, అవకాశవాదమే తెలంగాణ పునరేకీకరణా - సతీష్

అధికారవ్యామోహం,

(సతీష్ బైరెడ్డి రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక‌ డిసంబర్, 2017 సంచికలో ప్రచురించబడినది)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని టి.ఆర్‌.ఎస్‌. నాయకత్వం పదేపదే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏకైక రాజకీయ పార్టీగా నిలబడడం ఉద్యమంలో అనేక ప్రజా సంఘాలతో కలిసి నడిచిన అనుభవం వల్ల తెలంగాణ ప్రజాజీవితపు అవగాహన ఆ పార్టీకే ఉంటుందని ప్రజలు వారికి అధికారం అప్పగించారు. నిజానికి మిగతా పార్టీలతో పోల్చితే టి.ఆర్‌.ఎస్‌. వ్యవస్థాగత నిర్మాణం అంత పటిష్టంగా లేకపోవడం వల్ల ఆ దిశగా దృష్టి సారించి బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అలా ప్రకటించారు. తెలంగాణ ఎజెండా తప్ప మిగతా ఏ విషయాల్లోనూ కూడా అప్పటికే ఉన్నటువంటి రాజకీయ పక్షాలకి టి.ఆర్‌.ఎస్‌.కి సైద్ధాంతికంగా, అభివృద్ధి నమూనా పరంగా ఏలాంటి వైరుధ్యమూ లేదు.

ఉద్యమ సమయంలో టి.ఆర్‌.ఎస్‌.లో చేరిన వారంతా తెలంగాణ ప్రజలను ప్రేమిస్తూనో, వారి పక్షాన నిలబడి తెలంగాణ సాధించడం వల్ల ప్రజాజీవితంలో ఏదో గుణాత్మకమైన మార్పు తెద్దామని కాదు కానీ ప్రజల ఆకాంక్షను రాజకీయంగా సొమ్ముచేసుకోవడానికే అనేది వాస్తవం. సహజంగా అధికారమనే ఆకర్షణ ఉన్నప్పుడు అన్నిదారులు అటువైపుగానే ఉంటారుు. రాజకీయాలు అనగానే అధికారం అనే అవగాహన కంటే ఎక్కువ పరిదిని చూసేవాళ్లు కూడా పెద్దగా లేరు. ఏ సమాజపు అస్తవ్యస్థతనైనా సృజనాత్మకంగా, క్రియాత్మకంగా పరిష్కరించి దాని రూపురేఖల్ని సమూలంగా మార్చివేయగలిగే శక్తి రాజకీయ వ్యవస్థకుంటుందనే విశాలమైన అవగాహన కంటే ప్రజలపైన పెత్తనం చెలారుుంచడమే రాజకీయాల లక్ష్యమనుకునే సమూహాలే అధికార రాజకీయాల పంచన చేరుతారుు. సరిగ్గా టి.ఆర్‌.ఎస్‌. చెబుతున్నటువంటి పునరేకీకరణకు ఇలాంటి అర్థమే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పొడగిట్టనివారు, ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమకారులపై నిర్బంధాన్ని అమలు చేసిన వారంతా ʹపునరేకీకరణʹ అవుతున్నారు.

ఒకవైపు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం అందించినవాళ్లు నిత్య నిర్బంధానికి గురౌతుంటే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసిన వారంతా పదవుల్లోకి దూరి ప్రజలపై పెత్తనం చేస్తున్నారు. భిన్నమైన జెండాలు, ఎజెండాల మీద గెలిచిన వారంతా అధికార పక్షంవైపే అడుగులేస్తున్నారు. పార్టీ ఫిరారుుంపుల చట్టాలు చట్టుబండలైపోరుునవి. కొత్త రూపంలో ఈ నీచ రాజకీయాల అవినీతి కొనసాగుతున్నది. పైసలిచ్చి ఎదుటి పక్షం ఎం.ఎల్‌.ఎ.లను కొంటేనేమో అవినీతి, పదవులిచ్చి కొనుక్కుంటేనేమో రాజకీయ పునరేకీకరణ! అవినీతి అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశానికి మాత్రమే సంబంధించింది కాదు, అక్రమంగా ఎదుటివాళ్లను ఆపరేషన్ల పేరుతో చేసే ʹనీటుʹ వ్యవహారం కూడా నీతిలేని చర్యనే అవుతుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్‌లోకి ఆనాటి టి.ఆర్‌.ఎస్‌. ఎం.ఎల్‌.ఎ.లను ఎగురేసుకపోతే అది తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చే రాజకీయ దుర్మార్గమని పదేపదే ప్రచారం చేసింది టి.ఆర్‌.ఎస్‌. ఆ విషయంలో కోర్టు తలుపులను సైతం తట్టింది. ఇవాళ అధికార పక్షంలో ఉన్న పార్టీలు కొత్త ఎత్తుగడలతో వారి ఆపరేషన్లను సమర్థించుకుంటున్నాయి. పార్టీ ఫిరారుుంపుదారుల నీతిమాలిన చర్యను స్పీకర్‌ పరిధిలోని అంశమంటూ ఏ నిర్ణయం తీసుకోకుండా అధికారాంత కాలందాక సాగదీస్తున్నారు. అదే కాంగ్రెస్‌ పాలనలో స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్‌ను దుమ్మెత్తిపోసిన వాళ్లంతా ఇవాళ ఏమీ మాట్లాడడం లేదు. స్పీకర్‌ పరిధిలోని అంశం కోర్టులు జోక్యం చేసుకోజాలవు అనే వాదన వినిపిస్తున్నారే కానీ తామూ గతంలో అదే చేశామని, తమ చర్యలు అనైతికమనో, అక్రమమనో అంగీకరించట్లేదు.

ఇవాళ పార్టీలు మారే ఎం.ఎల్‌.ఎ.లందరు ʹఅభివృద్ధిʹ కోసం వెళ్తున్నామంటున్నారు. నిజానికి అది ఎవరి అభివృద్దో? ఇలా పార్టీలు మారడంలో ఎవరి స్వంత లక్ష్యం వారికున్నది. అనేక వ్యాపారాలు ఉన్నవారు, కాంట్రాక్టర్లుగా ఉన్నవాళ్లు అధికార పక్షం వెళ్లకపోతే ఆర్థికంగా గిట్టుబాటు కాదనుకునే వాళ్లంతా అభివృద్ధి పేరే చెబుతున్నారు. ఏవో అక్రమ దందాలు చేసినవాళ్లు, చేస్తున్న వాళ్లు కేసుల్లో ఇరుక్కున్నవాళ్లకు కూడా కొదువలేదనుకోండి. కొన్ని దశాబ్దాల కిందట ఏవో కొన్ని విలువలున్న నాయకులైతే ఒక ప్రత్యేక అంశంపైన విభేదించో, సైద్ధాంతిక విభేదాలవల్లనో పార్టీలు మారడం జరిగేది. ఇవాళ పార్టీలు మారడం చొక్కాలు మార్చినంత సులభమైపోరుుంది. ఒక నియోజక వర్గ ప్రజాప్రతినిధి ఏ పార్టీ గుర్తుమీద గెలిచాడో, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో, రేపు ఏ పార్టీలోకి వెళ్తాడో అక్కడి సాధారణ ప్రజలకు కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉన్నది.

ఓట్ల, సీట్ల బేరంలో ఫిరారుుంపుదారులు, జంపు జిలానీలు, ఆయారామ్‌లు, గయారామ్‌ల సంస్కృతి ఏ విలువలూ సిద్ధాంతాలు లేని రాజకీయాల్లో సర్వసాధారణమైపోరుుంది. ఎన్నికలు జరిగిన తక్షణ కాలంలో అధికార పక్షంవైపు వెళ్లడం, మళ్లీ ఎన్నికలు సమీపించేనాటికి ఏ పార్టీకి అధికారం దక్కే అవకాశాలున్నాయో ఆ పార్టీకి మారడం జరుగుతున్నది. పార్టీ ఫిరారుుంపుల్లో ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనాలుండవు. బయటికి ప్రచారమైన కారణాలకంటే తెరచాటు లావాదేవీలే వీటిని నిర్ధేశిస్తారుు. ఇటీవల ఓ టి.డి.పి. నాయకుడు కాంగ్రెస్‌లో చేరిపోవడం పెద్ద వార్తనే కాకుండా అదో రాజకీయ పరిణామమర్యుుంది. మొత్తం తెలంగాణ రాజకీయ చిత్రపటమే మారిపోతుందా అనే స్థారుులో మీడియా హడావుడి సృష్టించింది. ఇవాళ నాయకుల సామర్థ్యాలను వారి మేధోజ్ఞానం, ప్రజాపక్షపాత సిద్ధాంతం, నీతి నిబద్ధత, త్యాగ నిరతి, లక్ష్యశుద్ది విలువల కంటే వదరుబోతుతనం, దురుసుతనం, దుర్భాషలాడడం, మాటకుమాట అనగలిగే వాళ్లనే సమర్థులైన వాళ్లుగా, ʹడైనమిక్‌ʹగా మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ పార్టీలు, నాయకులు ఒకే తానులోని ముక్కలు. ఏ ముక్క ఎక్కడ ఉన్నా ఒకే పనితీరు ఉంటుంది. ఏ ముక్కలు ఎప్పుడైనా కలువవచ్చు కలవకపోరుునా పరస్పర ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో ఎటువంటి తేడాలుండవు. వ్యక్తులుగా ఎటువంటి అవకాశవాదాన్ని అవలంభిస్తున్నారో పార్టీలు కూడా అంతకంటే భిన్నంగా ఏమీ ఉండడం లేదు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో, ఏ సమీకరణాలకు తెరతీస్తారో తెలియకుండా వ్యవహారాలు జరిగిపోతూ ఉంటారుు. పార్టీలు సానుకూల ప్రజా తీర్పుకంటే పాలకపక్షం పట్ల వ్యతిరేకతను ఆసరాగా తీసుకొని లబ్ధి పొందాలని ఆశలు పెంచుకుంటున్నారుు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుని సరిదిద్దుకునే నిజారుుతి ప్రతిపక్ష కాంగ్రెస్‌కు గానీ, లేదా ఇవాళ అధికారంలో ఉన్న తమపైన ప్రతిపక్షం నుండి కాకపోరుునా పౌర సమాజం నుండి వచ్చే విమర్శను స్వీకరించే ప్రజాస్వామిక సంస్కృతిని టి.ఆర్‌.ఎస్‌.గానీ అలవర్చుకోవడం లేదు. పైగా అసహనానికి గురవుతూ అభివృద్ధి నిరోదకులంటూ ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికలు సమీపించేకొద్దీ పార్టీలు హడావుడిని పెంచుతున్నారుు. పొత్తులు, సమీకరణాలకై కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారుు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి దగ్గరయ్యే ఎం.ఐ.ఎం. ఏకంగా టి.ఆర్‌.ఎస్‌.తో కలిసి పనిచేస్తామని, ఇంత గొప్ప ముఖ్యమంత్రి మరొకరు లేరని ఆకాశానికెత్తి భవిష్యత్‌ పొత్తులకు తొలి తెరలేపింది. ఆ స్నేహం చెడకుండా ఉంటే వారి పొత్తు ఖాయంగా కనిపిస్తుంది. వీరి స్నేహ బంధం మద్యలోనే పుటుక్కుమంటే టి.ఆర్‌.ఎస్‌. బి.జె.పి. సీట్ల సర్దుబాటో, ఎన్నికల తరువాతైనా అవగాహన కుదురుతుంది. పార్టీలకు ఉన్నది ʹవాస్తవికʹ వాదమే, ప్రయోజనవాదమే తప్ప సిద్ధాంత వాదమంటూ ఏమీ లేని కాలంలో ఎవరికి ఎవరితోనైనా వియ్యం కుదురుతుంది. సిద్ధాంత పార్టీలుగా చెప్పుకునే వామపక్షాల పార్టీలైన సి.పి.ఐ., సి.పి.ఎం. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పాలక పార్టీతో జతకట్టి సైడ్‌ హీరో పాత్రను పోషిస్తూ శాసన వ్యవస్థలో తమ అస్తిత్వాన్ని కష్టంగా కాపాడుకుంటున్నారుు. ఈ సారి అటువంటి పరిస్థితి పునరావృతం కాబోదని పదే పదే ఆ పార్టీలు చెబుతున్నప్పటికీి ఎన్నికల నాటికి మరేదో వాస్తవ దృక్పథం మళ్లీ వారిని పాత పొత్తుల వైపే నెట్టివేసే అవకాశం ఉన్నది.

ఈసారీ టి.జె.ఎ.సి. రూపంలో తెలంగాణ యవనిక మీద మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుందా అనే ఆసక్తి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమీకరణాల, నాయకుల పార్టీ మార్పిడీలపైన కంటే ఎక్కువగా నెలకొని ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఉద్యమ ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నది టి.జె.ఎ.సి. అనేక ప్రజా సముదాయాల సమస్యలు, సంక్షోభాలపై అన్ని రకాల వనరులున్న రాజకీయ పార్టీలంటే ఎక్కువగా ముందుండి పోరాడుతున్నదనేది వర్తమాన వాస్తవం. అది రాజకీయ పార్టీగా పరివర్తన చెందాలనే సాధారణ ప్రజానీకం తక్కువేం కాదు. జె.ఎ.సి.లో భాగస్వామ్య సంఘాలు విడివిడిగా అంత బలాన్ని కల్గి లేకపోరుునా జె.ఎ.సి. నాయకత్వం నీడన తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నారుు. జె.ఎ.సి. నాయకుడిగా ఉన్న కోదండరాం కంటే భాగస్వామ్య సంఘాల నాయకత్వాలకు రాజకీయ ప్రత్యామ్నాయం పేరుతో పార్టీ ఉత్సాహం ఉరకలేస్తున్నది. పార్టీ ఏర్పాటు వాస్తవరూపం దాలిస్తే అది కొత్త సమీకరణాలకు దారి తీస్తుందా? ఒంటరిగా ఎన్నికల్లోకి వెలితే అధికార పక్ష వ్యతిరేక ఓట్లు చీలిపోయేలా పరిణామాలు ఉంటాయనేది కూడా విస్మరించరానిది. రాజకీయ పార్టీగా ఏర్పడకపోరుున కాంగ్రెస్‌ అనుకూల వైఖరిని తీసుకునే అవకాశమూ లేకపోలేదు!? అదే జరిగినట్లరుుతే విడిగా పోటీచేసి తమ స్వంత బలాన్ని ప్రదర్శించాలను కుంటున్న వామపక్షాలు కూడా పునరాలోచనలో పడతారుు. అనేక ప్రజా సంఘాలు పెద్ద పార్టీల్లో కలిసి పోవడమో వారి నాయకత్వాలకు సీట్లు అడుక్కోవడమో జరుగుతుంది. మొత్తానికి టి.ఆర్‌.ఎస్‌. పునరేకీకరణలో తను సర్దగలిగిన సంఖ్యకంటే ఎక్కువ మొత్తంలో చేర్చుకోవడం కూడా తాను ఆశించిన ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉండబోతుంది. వారికోసమే నియోజకవర్గాల పెంపుకోసం ఎంత ప్రయత్నించినప్పటికీ సఫలం కాకపోవడం వారిని తప్పక నిరాశపర్చి ఉంటుంది.

రాజకీయ సమీకరణాలు పొత్తులు అనేవి ప్రజా ప్రయోజన ప్రాతిపదికన జరిగితే ప్రజలు ఆహ్వానిస్తారు. పచ్చి రాజకీయ అవకాశవాదమో, అధికార వ్యామోహమో లేదా కొన్ని ఆధిపత్య సామాజిక వర్గాలకు ఇపుడున్న పార్టీ పాలనలో ʹన్యాయంʹ జరగలేదనే కారణంగానో పార్టీలు పావులు కదిపితే మెజారిటీ ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుంది. మారుతున్న పరిస్థితుల్లో, కొత్తగా రాజేయబడిన అనవసరపు అంశాలకు ముగింపు పలకాలంటే విస్తృత ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కొత్తగా పునరేకీకరణలు జరగాల్సిందే. పలానా వ్యక్తి ʹబాహుబలిʹ అనో భాగా తిడతాడనో రాజకీయాలను వన్‌ మ్యాన్‌ ఆర్మీలా మార్చడం అవాంఛనీయమైనది.

ఇప్పటికే ప్రాంతీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం శూన్యం. వైచిత్రి ఏమిటంటే ప్రాంతీయ పార్టీలన్నీ దేశ స్థారుులో ఉండే పార్టీలు, తమ ప్రాంతీయ ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏదో ఒక ప్రజాస్వామిక డిమాండ్‌తో ఉద్భవించినవే. సరిగ్గా ఇవాళ తెలంగాణ అధికార పార్టీ కూడా ప్రజాస్వామిక డిమాండ్‌ అరుున ప్రత్యేక రాష్ట్రానికి నిలబడింది నిజమే కానీ అధికారం వారిని ఎంత అప్రజాస్వామికంగా మార్చివేసిందో, ఎంత అహంకారాన్ని నింపివేసిందో ఉద్యమ పార్టీగా చెప్పుకునే పార్టీ ఏ శాంతియుత నిరసనను కూడా సహించకుండా నిర్బంధాన్ని మోపుతున్నది. తెలంగాణ అన్ని ఉద్యమ రూపాల్లో భాగస్వామ్యమర్యుు ఇవాళ అదే రూపాలను ప్రజా సంఘాలో, పార్టీలో కొనసాగిస్తే అభివృద్ధి నిరోధకమంటున్నది. ఉద్యమ పార్టీయే తెలంగాణలో ఉండాలంటుంది, మరే దేశానికి జాతీయోద్యమ కాలంలో నాయకత్వం వహించిన కాంగ్రెస్‌లో కూడా తాము మాత్రమే ఉండాలని కోరుకున్న ఆధిపత్య శక్తులు ఉన్నప్పటికీ అది సాధ్యం కాకపోగా ఆ ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ అనేక పార్టీలు పురుడు పోసుకొని వాటితోనే జతకట్టాల్సిన స్థితికి కాంగ్రెస్‌ను నెట్టివేసినవి. దానికి టి.ఆర్‌.ఎస్‌. కూడా మినహారుుంపేమీ కాదు. సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ ఎన్నికల వ్యవస్థలో సాధ్యమా అనే విశాలమైన రాజకీయ ప్రశ్నలు బలంగా ముందుకు పెడుతూ ఉద్యమాలు నడుస్తున్నాయనే అంశాన్నీ విస్మరించజాలరు.
-సతీష్ బైరెడ్డి
(రచయిత ఆంగ్ల ఉపన్యాసకులు)

Keywords : telangana, trs, kcr, ktr, andhrapradesh,
(2018-02-16 18:56:36)No. of visitors : 310

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

తెలంగాణ ఉద్యమకారుడి కిడ్నాప్ !

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా లోంచి ఎగిసిన విద్యార్థి నాయకుడు... తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడుగా ఉద్యమంలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నవాడు. జైలుకు పోయినవాడు. సమైక్యాంధ్ర పోలీసులను ఎధిరించి, బరిగీసి నిలబడ్దవాడు....

Search Engine

ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !
Violence in Kasganj Sponsored by BJP: Former DIG, UP Police
Dear Mr. Bhansali, I am Stunned after Watching Glorification of Sati in Your Movie: Swara Bhaskarʹs Open Letter
హైదరాబాద్ లో కాలేజ్ సిబ్బంది వేదింపులు...విద్యార్థిని ఆత్మహత్య..విద్యార్థులపై పోలీసు దాడులు
ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు
After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life
హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు - మావోయిస్టు పార్టీ
more..


అధికారవ్యామోహం,