మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !


మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !

మావోయిస్టు


ప్ర‌జాసంఘాల‌ను నిషేధించాల‌ట

మావోయిస్టులు ఎవ‌రు? అస‌మ స‌మాజంలో అంత‌రాలు తొల‌గాల‌ని కాంక్షించే వాళ్లు.. వాళ్ల ఆకాంక్ష‌ల‌ను అణ‌చివేయాల‌నుక‌న్న‌ప్పుడు ఆయుధం అందుకున్న‌వాళ్లు... మొత్తం స‌మాజాన్ని విముక్తం చేసేందుకు అన్న‌లైన వాళ్లు. అందుకే ప్రాణ‌త్యాగాల‌కూ వెన‌కాడ‌కుండా అన్ని ర‌కాల దోపిడీ పీడ‌ల‌కు వ్య‌తిరేకంగా త‌మ పోరాటాన్ని ఎక్కుపెట్టారు. అలా ప్ర‌జ‌ల కోసం ప్రాణ‌మిచ్చిన వాళ్లు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతారు. ఆ అమ‌రుల‌ను స్మ‌రిస్తూ వాళ్ల గుర్తుల‌ను స్తూపాలుగా నిలుపుకుంటారు. అది ఇంద్ర‌వెల్లి అయినా, హుస్నాబాద్ అయినా, ఎనుమాములైనా, బ‌స్త‌ర్ అయినా, ఏఓబీ అయినా లేదా ఆల‌కూర‌పాడు అయినా. ఇప్పుడా గుర్తుల‌ను చెరిపేయాల‌నుకుంటోంది రాజ్యం. మావోయిస్టు స్తూపాల‌ను తొలిగించాలంటూ పోలీసు ప్రేరేపిత ఆందోళ‌న‌లు రంగ‌మెక్కాయి. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌.. మావోయిస్టు భాదిత కుటుంబాల పేరుతో ఒంగోలు, టంగుటూరుల్లో పోలీసులు క‌న్నుస‌న్న‌ల్లో జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌.

ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మున్నా స్మార‌కార్థం కుటుంబ స‌భ్యులు ప్ర‌కాశం జిల్లా ఆల‌కూర‌పాడులో నిర్మించిన స్తూపాన్ని తొల‌గించాలంటూ కొంది మందిని డ‌బ్బులు తీసుకొచ్చిన జ‌నాల‌తో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, టంగుటూరు త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చారు. మావోయిస్టులు హింస‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ద పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్నార‌ని, స్తూపాలు నిర్మిస్తే పోలీసుల‌కు నిర్మించాల త‌ప్ప మావోయిస్టుల‌కు కాద‌ని వాళ్ల వాద‌న. ఆల‌కూర‌పాడులో స్తూపాన్ని తొల‌గించి ఆ స్త‌లాన్ని త‌మ‌కు అప్ప‌గించాలంటూ ర్యాలీలో ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు.. ప్ర‌జాసంఘాలు మావోయిస్టుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయ‌ని ఆరోపిస్తూ... ప్ర‌జా సంఘాల‌ను నిషేధించి, ప్ర‌జాసంఘాల్లో ప‌నిచేసే వారిని క‌ఠినంగా శిక్షించాల‌నీ డిమాండ్ చేశారు.

మావోయిస్టు బాదిత కుటుంబాల పేరిట జ‌రిగిన ర్యాలీల్లో పోలీసులు కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం. అంతే కాదు... స్థానిక ప్రైవేటు క‌ళాశాల‌ల బ‌స్సుల్లో పోలీసులే ద‌గ్గ‌రుండి జ‌నాల్ని త‌ర‌లించి ఈ ర్యాలీలు తీయించారు. ప్ర‌జా ఉద్య‌మాల‌ను అణ‌చివేసే ల‌క్ష్యంతో పోలీసులు ఇలాంటి ప్ర‌తిఘాతుక ఆందోళ‌న‌ల‌ను ప్రేరేపిస్తున్నార‌ని, రాష్ట్రంలో ప‌లు చోట్ల ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌పై పోస్ట‌ర్లు వేసిన పోలీసులు ఇప్పుడు ప్ర‌జాసంఘాల‌ను నిషేదించాల‌నే వాద‌న‌తో ముందుకు వ‌స్తున్నార‌ని హ‌క్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్మారక చిహ్నాల‌ను తొల‌గించ‌డ‌మంటే రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల్ని కాలరాయ‌డ‌మే అని, ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం త‌గ‌ద‌న్నారు.

Keywords : maoist, munna, aob, police
(2023-05-28 22:05:04)



No. of visitors : 3348

Suggested Posts


A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home Minister

When I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force....

జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ

మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని

జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖ

ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు.

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

విప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము.

ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

దోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు...

మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై....

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న అనారోగ్యంతో అమరుడయ్యాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆడియో ప్రకటనను విడుదల చేశారు.

Govt lost mercy petition of 4 Maoist convicts on death row

Four death row convicts in Bihar have been waiting for a decision on their mercy petition for more than a decade because their plea to be spared.....

37 మంది మావోయిస్టులను విషంపెట్టి చంపారా ?

ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర విప్లవోధ్యమంపై కక్షగట్టిన కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి ఒడిగట్టాయని

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
more..


మావోయిస్టు