ఉన్మాదుల ఇష్టారాజ్యానికి సమాజాన్ని వదిలేస్తారా?


ఉన్మాదుల ఇష్టారాజ్యానికి సమాజాన్ని వదిలేస్తారా?

ఉన్మాదుల


ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతపై దాడికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ప్రభుత్వం అట్టహాసంగా తెలుగు మహాసభల వేడుక చేసి రోజులు కూడా కాలేదు. ఒక సామాజిక ఆచరణ మీద, భావప్రకటన మీద హేయమైన దాడి జరిగుతున్నది. అంతకు ముందే ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య మీద దాడితో పాటు రాజ్యం, ఆధిపత్య కులాలు, సంఘపరివార్‌ కలిసి అమలు చేస్తున్న హింసను ప్రశ్నించి, నిరసన తెలిపిన రచయితల అరెస్టులతోనే ఆ వేడుకలు మొదలయ్యాయి. డిసెంబర్‌ 25న మనుస్మృతిని దహనం చేసి, ప్రజాస్వామ్యానికి విఘాతమైన కులాధిపత్య వ్యవస్థపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఎ.బి.వి.పి, ఆర్‌.ఎస్‌.ఎస్‌ గూండాలు దాడి చేసి కొడితే పోలీసులు దాడి చేసిన వాళ్ల పక్షాన విద్యార్థులనే అరెస్టులు చేసారు. దాడి చేసిన వాళ్లు అంతటితో ఆగక ఈ విద్యార్థుల వెనక ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత ఉన్నారని, వాళ్లంతా కలిసి భారతమాత బొమ్మను తగలబెట్టారని దుష్ప్రచార దాడి మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో బూతులు తిడుతూ అసభ్యరాతలు రాస్తున్నారు. ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత చాలా కాలంగా ప్రజాసమస్యల మీద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఆమె ఆచరణ ఉన్నట్టుగానే ఆమె భావాలను బహిరంగంగా, సూటిగా వ్యక్తం చేస్తూ రచనలు చేస్తున్నారు. అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు. ఈ విషయం చట్టానికి, ప్రభుత్వానికి తెలుసు. దాడి చేస్తున్న వాళ్లు ఎవరో కూడా తెలుసు. వాళ్లంత నిస్సకోచంగా దాడి చేస్తున్నారంటే తెలంగాణ సమాజానికి ఎటువంటి సంకేతం ఇస్తున్నట్టు? బాషా ఉత్సవాలు జరపడం కాదు. ఇటువంటి దాడుల పట్ల ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? ఉన్మాదుల స్వైర విహారానికి సమాజాన్ని వదిలేసి, విద్యార్థులపై, ప్రజాసంఘాల కార్యకర్తలపై అణచివేత ప్రయోగించడంలోనే రాజ్యం స్వభావం తెలిసిపోతోంది.
ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత మీద తప్పుడు ఆరోపణలతో అబద్ధాలు ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో జుగుప్సాకర రాతలు రాయడం సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. నిజానికిది కొత్త కూడా కాదు. సంఘపరివార్‌ అధికారంలోకి వచ్చాక ఈ తరహా ధోరణి రోజురోజుకూ పెచ్చరిల్లిపోతోంది. ఒక సమాజ సాంస్కృతిక విలువల పతనానికిది నిదర్శనం. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులందరి మీదా ఉంది. ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతకు ప్రజాసంఘాలతో పాటు విరసం అండగా ఉంటుంది. కులవ్యవస్థ అంతరించాలని, దేశం ప్రజాస్వామికీకరణ చెందాలని తపన పడిన అంబేద్కర్‌ మనుస్మృతిని దహనం చేస్తే, ఇవాల కుహనా దేశభక్తులు అంబేద్కర్‌ జపం చేస్తూనే మనుస్మృతిని బతికిస్తున్నారు. వాళ్లు బతికిస్తున్నారు కాబట్టి మనువు చచ్చేదాకా తగలబెడుతూనే ఉంటాం. సంఘపరివార్‌ దృష్టిలో భారతమాత అంటే మనుస్మృతి పుస్తకం కావచ్చునేమోగాని, మాకు కోట్లాది శ్రామిక తల్లులలో భారతమాత ఉంటుంది. కుల, మత, వర్గ సంకెళ్లలో బంధీయై ఉన్న ఆమె విముక్తి కోసం పోరాడుతూనే ఉంటాం.

-వరలక్ష్మి,
కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం

Keywords : surepalli sujatha, virasam, ktr, kcr, bjp, h9indutva, rss, abvp
(2018-06-19 08:17:26)No. of visitors : 911

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

Search Engine

ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం
రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులపై దేశవ్యాప్త నిరసనలు
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన
భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు
Maharashtra Governmentʹs terror trail to protect HINDUDTVA TERRORISTS
నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!
తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?
more..


ఉన్మాదుల