కోరేగావ్ అప్డేట్స్ : దళితులపై దాడులు చేసినవారిని వదిలేసి జిగ్నేష్, ఉమర్ లపై కేసులు !


కోరేగావ్ అప్డేట్స్ : దళితులపై దాడులు చేసినవారిని వదిలేసి జిగ్నేష్, ఉమర్ లపై కేసులు !

కోరేగావ్

కోరేగావ్ లో దళితులపై దాడులకు తెగబడ్డ వారిని ఆ దాడుల సూత్రదారులను వదిలేసి కోరేగావ్ పోరాత అమరుల సంస్మరణ సభలో వక్తలుగా పాల్గొన్న గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మెవానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ లపై కేసులు పెట్టారు. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
200 ఏండ్ల క్రితం కోరేగావ్ లో 25వేల‌ పీష్వాల సైన్యంపై 300 మంది మహర్ లు, ఇతర దళితులు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పోరాటంలో అమరులైన దళితలను స్మరించుకుంటూ జరిగిన సభ హిందుత్వ మూకలకు ఆవేశం తెప్పించింది. బ్రాహ్మణులను దళితులు ఓడించడమే వారికి భరించరానిదైతే మళ్ళీ విజయోత్సవాన్ని జరుపుకోవడం హిందూ మతోన్మాద , అగ్రవర్ణ కులోన్మాదులు అస్సలు తట్టుకోలేక పోయారు. మోడీ దేశ ప్రధానిగా అయిన తర్వాత దేశవ్యాప్తంగా ముస్లింలపై, దళితబహిజనులపై, మహిళలపై, ఆదివాసులపైన దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్న ఉన్మాద మూకలే ఈ కోరేగావ్ లో దళితులపై దాడివేనక కూడా కూడా ఉన్నారు. ఆరెస్సెస్ కు అతి దగ్గరివారైన, మోడీకి చాలా ఇష్టులైన సమస్త్ హిందూ ఏక్తా అగాధీ నాయకుడు మిలింద్ ఏక్బోటే, శివ్ ప్రతిస్థాన్ హిందుస్తాన్ నాయకుడు శంబాజీ బిడేలు ఈ దాడులకు సూత్రదారులని దళిత లోకం కోడై కూస్తోంది. కోరేగావ్ సంఘటనలకు పది పదిహేను రోజుల ముందునుండే వీరిద్దరూ, వీరి అనుచరులు సోషల్ మీడియాలో దళితులకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. హిందువులను రెచ్చగొడుతూ రాతలు రాస్తూ మతోన్మాదులను ఆర్గనైజ్ చేశారు. కోరేగావ్ లో సభకు అనేక ప్రాంతాలనుండి వస్తూన్న వాహనాలపై తోవలోనే దాడులకు దిగారు. సభలో జిగ్నేష్ మేవానీ, ఉమర్ ఖలీద్ లు రెచ్చగొట్టడం వల్లనే ఘర్షణలు జరిగాయని చెబుతున్న పోలీసులకు వారి ఉపన్యాసాలకన్నా ముందే దళితులపై దాడులు జరిగాయన్న విషయం తెలియదా ?
దాడులకు నిరసనగా దళితుల తీవ్ర నిరసనలతో తప్పని పరిస్తితుల్లో పోలీసులకు శంబాజీ బిడే, మిలింద్ ఏక్బోటేలపై కేసు నమోదు చేయాల్సి వచ్చింది.
మరో వైపు ముంబైలో ఇవ్వాళ్ళ జిగ్నేష్, ఉమర్ లు ప్రసంగిచాల్సి ఉన్న ఓ విద్యార్థుల సభను పోలీసులు హటాత్తుగా రద్దు చేశారు. అప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్న వందలాది మంది విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనేకమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
కోరేగావ్ లో దళితులపై హిందుత్వ మూకలు చేసిన దుర్మార్గమైన దాడులకు నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాళ్ళ కూడా నిర్సన ప్రదర్శనలు జరిగాయి.

Keywords : Bhima Koregaon, Sambhaji Bhide , Milind Ekbote, jignesh mevani, Umar Khalid, Mumbai, dalits, hindutva
(2018-03-21 10:18:00)No. of visitors : 588

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !
Atrocities against Dalits at 17-year high in Gujarat
Baiga Adivasis March Against Displacement Due to Tiger Corridor, Demand Forest Rights
సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?
Hindu Mahasabhaʹs calendar refers to Mecca as Macceshwar Mahadev temple
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం
Why it is important to support the Spring Thunder Tour?- International Committee to Support the Peopleʹs War in India
చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ
సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
more..


కోరేగావ్