ʹఐలవ్ ముస్లిమ్స్ʹ అన్నందుకు ఓ అమ్మాయిని వేధించి, వేధించి చంపేసిన మ‌తోన్మాదులు...బీజేపీ నేత అరెస్టు


ʹఐలవ్ ముస్లిమ్స్ʹ అన్నందుకు ఓ అమ్మాయిని వేధించి, వేధించి చంపేసిన మ‌తోన్మాదులు...బీజేపీ నేత అరెస్టు

ʹఐలవ్

కర్ణాటకలోని చిక్‌మగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు హిందూ మతోన్మాదులు ఓ అమ్మాయిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అందుకు కారణం ఆ అమ్మాయి సరదాగా ʹఐ లవ్‌ ముస్లిమ్స్‌ʹ అని వాట్సప్‌లో మెసేజ్ చేయడమే. వివరాల్లోకి వెళితే, ధన్యశ్రీ అనే 20 ఏళ్ల బీకాం విద్యార్థిని సంతోష్‌ అనే తన స్నేహితుడితో వాట్సప్‌లో ఛాటింగ్ చేస్తోంది. అందులో కులం, మతాల గురించి మాట్లాడుకుంటున్నారు. ముస్లింలంటే నచ్చని ఆ యువకుడికి సరదాగా కోపం తెప్పించాలని ʹఐ లవ్‌ ముస్లిమ్స్‌ʹ అని ఆమె మెసేజ్ చేసింది.

దీంతో ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ముస్లింలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పాడు. ధన్య చేసిన ఆ మెసేజ్‌ను స్క్రీన్‌ షాట్ తీసి స్థానిక భజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ సభ్యులకు పంపాడు. ఆమె మెసేజ్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై నానా రకాలుగా కామెంట్లు రావడంతో ధన్యశ్రీ మనస్తాపం చెందింది. అంతేకాదు, ఆమె ఇంటికి వెళ్లిన ముడిగెరె పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనిల్‌ రాజ్.. ఇటువంటి పనులు చేయొద్దని ధన్యశ్రీ తల్లిదండ్రులను హెచ్చరించాడు.

దీంతో ఆమె అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తన జీవితాన్ని, చదువును నాశనం చేసిందని ధన్యశ్రీ ఆత్మహత్య లేఖలో పేర్కొంది. సదరు బీజేపీ నేతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Keywords : Karnataka woman, kill herself, I love Muslims
(2018-12-14 13:30:27)



No. of visitors : 1040

Suggested Posts


Support the struggle for human dignity and livelihood .

ix months back onwards 577 Adivasi families had legally occupied government land in siddapura near virajpet and constructed hutments in order to escape the bonded wage labour in the coffee estate....

న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?

ʹఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు బాధితులు, సాక్షులైన మహిళలను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


ʹఐలవ్